మీకు ఈ అలవాటు ఉందా.. అయితే వెంటనే మానుకోండి..! లేకుంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది..!
మన పెద్దవారు చెప్పే కొన్ని నమ్మకాలు శాస్త్రీయ కారణాలు కలిగి ఉంటాయి. ఉదాహరణగా పాదాలను కదిలించడం గురించి కొన్ని మతపరమైన, వైద్యపరమైన విశ్వాసాలు ఉన్నాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పాదాలను కదపకూడదని అంటారు. మరోవైపు దీనికి వైద్యపరమైన కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పూర్వం నుండి మన పెద్దలు చెప్పే పాత మాటలు ముఖ్యంగా అమ్మమ్మలు ఇచ్చే సలహాలు, ప్రతిదానికి కూడా ఒక అర్థం ప్రయోజనం ఉంది. వాటిని పాటించడం వల్ల మన జీవితం సక్రమంగా శ్రేయస్సుతో సాగుతుందని పెద్దలు నమ్ముతారు. ఉదాహరణకు మనలో చాలా మందికి పాదాలు కదపడం అనేది ఒక సాధారణమైన అలవాటుగా అనిపించవచ్చు. కానీ దీని వెనుక ఆధ్యాత్మిక కారణాలు, శాస్త్రీయ సమర్థన కూడా ఉన్నాయి. అమ్మమ్మలు పాదాలను కదపవద్దని చెప్పేవారు. ఎందుకంటే అది శుభం కాదనే నమ్మకం ఉంది. ఇలాంటి పాత మాటలను నిర్లక్ష్యం చేయకుండా వాటి వెనుక ఉన్న నమ్మకాలను అర్థం చేసుకోవాలి.
మన పెద్దవారు అనుసరించే పాత నమ్మకాలు కేవలం ఆచారాలు మాత్రమే కాదు. వాటి వెనుక గల ప్రాముఖ్యతను తెలుసుకోవడమే మనకు ఎక్కువ ఉపయోగం. పూర్వం నుండి వస్తున్న ఆచారాలు అనేక శాస్త్రీయ, మతపరమైన కారణాలు కలిగి ఉంటాయి. పెద్దవారు చెప్పే మాటలను పాటిస్తే మన ఇల్లంతా శాంతితో ఆనందం కలిగి ఉంటుందన్న నమ్మకం ఉంది. ఆచారాలు పాటించడం మన జీవితానికి లబ్ధి చేకూరుస్తుందని పెద్దవారు అంటారు. అందుకే వారి సలహాలు మన జీవితంలో ఎదురైన సమస్యలకు పరిష్కారం చూపించి విజయాన్ని తీసుకొస్తాయి.
కొంతమంది కూర్చున్నప్పుడు పాదాలను నిరంతరం కదిలించే అలవాటు ఉంటుంది. ఇది ఒకవైపు ఆరోగ్యకరంగా కాకపోయినా మన పెద్దవారు దీన్ని ఆపడానికి ఒక పాత విశ్వాసం చెప్పారు. వారు ఏం చెప్పారో తెలుసా..? లక్ష్మీదేవి మనపై ప్రసన్నం ఉంచాలంటే.. పాదాలను నిరంతరం కదిలించదంటున్నారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందట. దీని వల్ల ఇంట్లో ఆర్థికంగా సమస్యలు వస్తాయని చెబుతారు. కాబట్టి పాదాలను కదిలించడం శుభం కాదని పెద్దలు చెబుతారు. ఈ నమ్మకం ఇప్పటికీ కూడా కొన్ని కుటుంబాలలో కొనసాగుతోంది.
మతపరంగా చూస్తే పాదాలను నిర్లక్ష్యంగా కదపడం మంచిది కాదు. కొన్ని మతపరమైన విశ్వాసాల ప్రకారం లక్ష్మీదేవి స్థిరంగా ఉండేందుకు పాదాలను కదపకూడదని నమ్ముతారు. ఇది కేవలం భక్తితో పాటించే నిబంధన మాత్రమే కాదు జీవితంలో శ్రద్ధగా వ్యవహరించాల్సిన ఒక మంచి అలవాటు అని కూడా భావిస్తారు. శాస్త్రీయంగా చూసినా పాదాలను నిరంతరం కదిలించడం శరీరానికి హానికరమని గుర్తించారు. వైద్య శాస్త్రంలో దీనిని రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్ అని పిలుస్తారు. దీని వల్ల అనేక శారీరక సమస్యలు ముఖ్యంగా నిద్రలేమి, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
పెద్దవారు చెప్పే సలహాలు మనకెంతో ఉపయోగంగా ఉంటాయి. వాళ్ల అనుభవం వారి సలహాలలో ప్రతిబింబిస్తుంది. కేవలం పూర్వం నుండి వస్తున్న నమ్మకాలను పాటించండి అని పెద్దలు చెప్పలేదు. వారి మాటల్లో ఉన్న అర్థాన్ని మనం అర్థం చేసుకోవడం కూడా ముఖ్యం. ఈ విధంగా చిన్న విషయాల్లో కూడా మనకు మంచి జరగాలని పెద్దలు కోరుతారు. పెద్దవారు చెప్పే మాటలను పాటిస్తే జీవితంలో పాజిటివ్ ఫలితాలు పొందవచ్చు.
ఇలాంటి పాత మాటలు, విశ్వాసాలు మన కుటుంబాలకు ఆనందం, శ్రేయస్సును తీసుకువస్తాయి. వాటిని పాటించడం వల్ల మన పెద్దవారితో పాటు మనం కూడా మంచిని పొందవచ్చు. చిన్న సలహాలు కూడా జీవితానికి శాంతిని, సంతోషాన్ని తీసుకొస్తాయి.