AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chocolates: చాక్లెట్ ప్రియులకు గుండె పగిలే వార్త.. ఒక్క చాక్లెట్ మీ బాడీలో ఇన్ని మార్పులు చేయగలదా?

ఏ దేశమేగినా చాక్లెట్ ప్రియులు ఉంటారనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రపంచవ్యాప్తంగా దీనికి అంతటి పాపులారిటీ ఉంది. ఎన్నో రకాల ఫ్లేవర్లు మరెన్నో రుచులతో చిన్నపిల్లల దగ్గరి నుంచి పెద్ద వారి దాకా అందరూ ఇష్టపడే చిరుతిండి ఇది. కానీ దీన్ని అతిగా తింటే ఏమవుతుందో తెలిస్తే మీకు నిజంగానే దిమ్మతిరిగి పోతుంది. చాక్లెట్లు తినాలి.. కానీ అతిగా తింటే మాత్రం సమస్యలేనని చెబుతున్నారు నిపుణులు. చాక్లెట్లు ఎక్కువగా తింటే.. ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవంటున్నారు.

Chocolates: చాక్లెట్ ప్రియులకు గుండె పగిలే వార్త.. ఒక్క చాక్లెట్ మీ బాడీలో ఇన్ని మార్పులు చేయగలదా?
Chocolate Benefits
Bhavani
|

Updated on: Mar 20, 2025 | 8:12 PM

Share

చాక్లెట్.. ఈ పేరు చెప్తే ఎవరికైనా నోరూరుతుంది. ఇక చిన్న పిల్లలైతే వీటిని కొనేదాకా మారాం చేయడం ఆపరు. బర్త్ డేలు, చిన్న చిన్న ఈవెంట్లు ఏవైనా వీటితోనే విష్ చేసుకోవడం ఇప్పుడు పరిపాటిగా మారింది. అకేషన్ ఏదైనా చాక్లెట్ తింటే.. అదో తృప్తి. అది మిల్క్ చాక్లెట్ అయినా, డార్క్ చాక్లెట్ అయినా, వైట్ చాక్లెట్ అయినా.. అలా నోట్లో వేసుకుంటే.. హాయిగా ఉంటుంది. అయితే ఏది ఏమైనా ఎక్కువగా చేయడం మంచిది కాదు. చాక్లెట్‌ను ఎక్కువగా తినడం వల్ల దుష్ప్రభావాలు ఉంటాయి.

జీర్ణ సమస్యలు

రుచి కోసం తొందరపడి చాక్లెట్లు అతిగా తినడం వలన జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలకు వీటిని ఎక్కువగా తినిపిస్తే మరీ ప్రమాదం. కొందరికి వీటి వల్ల కడుపు ఉబ్బరం, మలబద్ధకం, కడుపు తిమ్మిరి వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. వీటిల్లో అధిక స్థాయిలో కొవ్వు, చక్కెర, కెఫిన్‌లను కలిగి ఉంటాయి. ఇది ఎక్కువ పరిమాణంలో తినేటప్పుడు జీర్ణ అసౌకర్యానికి దారితీస్తుంది. చాక్లెట్‌లోని అధిక చక్కెర కంటెంట్ పేగులో హానికరమైన బ్యాక్టీరియా పెంచి పోషిస్తుంది.

చక్కరతో జాగ్రత్త..

చాక్లెట్‌లో అధిక మొత్తంలో ఉండే చక్కర శరీరానికి ఎంతో ప్రమాదం. ఇది రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలకు కారణమవుతుంది. ఆ తర్వాత అలసట, చిరాకు, మానసిక కల్లోలం వంటి వాటికి దారితీస్తుంది. అధిక చక్కెర మీ బరువును పెంచే ప్రమాదం కూడా ఉంది. అధిక రక్తపోటు, టైప్ 2 మధుమేహం రిస్క్ కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది.

కెఫిన్ తో రిస్క్ తప్పదు..

చాక్లెట్‌లో ఉండే కెఫిన్ మీలో వెంటనే ఎనర్జీ లెవెల్స్ ను పెంచేస్తుంది. అయితే ఇది దీర్ఘకాలంలో అంత మంచిది కాదు. అలసటను తగ్గిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇలా అని ఎక్కువ చాక్లెట్ తీసుకోవడం చేస్తుంటారు కొంతమంది. ఇది అధిక కెఫిన్ కు దారి తీస్తుంది. ఇది ఆందోళన, గుండె దడకు కారణమవుతుంది. కెఫిన్ అధిక మోతాదు నిద్రకు భంగం కలిగిస్తుంది.

కొవ్వులు, కేలరీలే ఎక్కువ

చాక్లెట్‌లో క్యాలరీలు, కొవ్వు ఎక్కువగా ఉంటాయి. దానిని ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. పండ్లు, కూరగాయలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలకు బదులుగా చాక్లెట్‌ను తీసుకుంటే ఇది చాలా సమస్యాత్మకంగా ఉంటుంది. ఎక్కువ చాక్లెట్ తీసుకోవడం కూడా అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు దోహదం చేస్తుంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.

అలర్జీకి కారణం..

కొంతమందికి చాక్లెట్‌లోని డైరీ, నట్స్, సోయా వంటివాటితో అలెర్జీ ఉండవచ్చు. అలాంటప్పుడు, ఎక్కువ చాక్లెట్ తినడం వల్ల అలెర్జీ ప్రతిచర్యకు కారణమవుతుంది. దద్దుర్లు, దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు వస్తాయి.