IRCTC Tours: రూ. 11,710కే ‘సుందర్ సౌరాష్ట్ర’ టూర్.. ఐఆర్ సీటీసీ ప్రత్యేక ప్యాకేజి వివరాలు ఇవి..
సుందర్ సౌరాష్ట్ర పేరుతో ప్రకటించిన ఈ ప్యాకేజీ ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లు ఉంటుంది. రైలులో తీసుకెళ్లి, రైలులోనే తీసుకొస్తారు. దీని ప్యాకేజీ ధరలు కేవలం రూ. 11,710 నుంచి ప్రారంభమవతాయి. తక్కువ ధరలో గుజరాత్ లోని ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించాలనుకొనే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇంకెందుకు ఆలస్యం ఐఆర్‌సీటీసీ సుందర్ సౌరాష్ట్ర టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఆధ్యాత్మిక క్షేత్రాలకు ఆలవాలం గుజరాత్. వాణిజ్యంగా అహ్మదాబాద్ ముందంజలో ఉండగా.. ద్వారకా, రాజ్ కోట్, సోమ్ నాథ్, వడోదరా వంటి ప్రాంతాలో చూడదగిన ప్రాంతాలు, పలు ఆలయాలు ఉన్నాయి. వీటన్నంటిని సింగిల్ టూర్ లో కవరయ్యేలా ఐఆర్‌సీటీసీ టూరిజమ్ ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. సుందర్ సౌరాష్ట్ర పేరుతో ప్రకటించిన ఈ ప్యాకేజీ ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లు ఉంటుంది. రైలులో తీసుకెళ్లి, రైలులోనే తీసుకొస్తారు. దీని ప్యాకేజీ ధరలు కేవలం రూ. 11,710 నుంచి ప్రారంభమవతాయి. తక్కువ ధరలో గుజరాత్ లోని ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించాలనుకొనే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇంకెందుకు ఆలస్యం ఐఆర్‌సీటీసీ సుందర్ సౌరాష్ట్ర టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఇది టూర్ ప్యాకేజీ..
- పేరు: సుందర్ సౌరాష్ట్ర(ఎస్‌హెచ్066)
- వ్యవధి: ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లు
- ప్రయాణ సాధనం: రైలు(స్లీపర్ క్లాస్/3ఏసీ)
- ప్రయాణ తేదీ: ప్రతి బుధవారం
- కవరయ్యే ప్రాంతాలు: వడోదరా, అహ్మదాబాద్, రాజ్ కోట్, ద్వారక, సోమ్ నాథ్, స్టాట్యూ ఆఫ్ యూనిటీ, సబర్మతి ఆశ్రమం
టూర్ సాగుతుందిలా..
డే1(బుధవారం): సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 15:00 గంటలకు రైలు నం. 19201 సికింద్రాబాద్ – పోర్ బందర్ ఎక్స్‌ప్రెస్‌లో బయలురుతారు. రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
డే2(గురువారం): వడోదర స్టేషన్ కు ఉదయం 11:00 గంటలకు చేరుకుంటారు. అక్కడ ఐఆర్ సీటీసీ సిబ్బంది మిమ్మల్ని రిసీవ్ చేసుకొని హోటల్‌కు తీసుకెళ్తారు. మధ్యాహ్నం స్టాచ్యూ ఆఫ్ యూనిటీని సందర్శిస్తారు. తిరిగి హోటల్ కి వెళ్లి రాత్రి బస చేస్తారు.



డే3(శుక్రవారం): లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌ని సందర్శిస్తారు. అక్కడి నుంచి అహ్మదాబాద్ బయలుదేరుతారు. అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించి, తిరిగి అహ్మదాబాద్‌లో హోటల్ కు చేరుకొని రాత్రి బస చేస్తారు.
డే4(శనివారం): ఉదయం సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. అనంతరం రాజ్‌కోట్‌కు బయలుదేరి, మధ్యాహ్నానికి అక్కడికి చేరుకొని హోటల్ వెళ్తారు. సాయంత్రం వాట్సన్ మ్యూజియం, గాంధీ మ్యూజియం, స్వామి నారాయణ్ ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రికి రాజ్‌కోట్‌లో బస చేస్తారు.
డే5(ఆదివారం): ఉదయం ద్వారకకు బయలుదేరండి. మార్గ మధ్యలో జామ్‌నగర్‌ను సందర్శిస్తారు. బెట్ ద్వారక సందర్శించి, రాత్రికి ద్వారకలో బస చేస్తారు.
డే6(సోమవారం): ద్వారకాదీష్ ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం సోమనాథ్‌కు బయలుదేరుతారు. మధ్యాహ్నం సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం పోర్‌బందర్‌కి బయలుదేరుతారు. అర్ధరాత్రికి పోర్‌బందర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు.
డే7(మంగళవారం): రైలు నెం. 19202 పోర్బందర్ – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ 00:50 గంటలకు (సోమవారం అర్ధరాత్రి). రైలు ఎక్కుతారు.
డే8(బుధవారం): ఉదయం 8.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీ ధరలు ఇలా..
- ఒకరు లేదా ముగ్గురు వరకూ కలిసి టూర్ ప్లాన్ చేసుకుంటే ధరలు ఇలా ఉంటాయి.
స్లీపర్ క్లాస్: హోటల్లో సింగిల్ రూం కావాలనుకుంటే రూ. 50,200, డబుల్ షేరింగ్లో ఒక్కొక్కిరికీ రూ. 26,310, ట్రిపుల్ షేరింగ్ లో ఒక్కొక్కరికీ రూ. 20,060 ఉంటుంది. ఐదేళ్ల నుంచి పదకొండేళ్ల పిల్లలకు ప్రత్యేకమైన బెడ్ అవసరం లేకపోతే రూ. 13,810, ప్రత్యేకమైన బెడ్ అవసరం అయితే రూ. 15,420 అవుతుంది.
3ఏసీ: హోటల్లో ప్రత్యేకమైన సింగిల్ రూం కావాలనుకుంటే రూ. 52,990, డబుల్ షేరింగ్ అయితే రూ. 29,100, ట్రిపుల్ షేరింగ్ అయితే రూ. 22,850 చార్జ్ చేస్తారు. ఐదేళ్ల నుంచి పదకొండేళ్ల పిల్లలకు ప్రత్యేకమైన బెడ్ అవసరం లేకపోతే రూ. 16,600, ప్రత్యేకమైన బెడ్ అవసరం అయితే రూ. 18,210 చార్జ్ చేస్తారు.
- నలుగురు నుంచి ఆరుగురు కలిసి టూర్ ప్యాకేజీని బుక్ చేసుకుంటే ట్యారిఫ్ ఇలా ఉంటుంది.
స్లీపర్ క్లాస్: హోటల్లో డబుల్ షేరింగ్ కావాలనుకుంటే రూ. 13,840, ట్రిపుల్ షేరింగ్ అయితే రూ. 11,710 చార్జ్ చేస్తారు. ఐదేళ్ల నుంచి పదకొండేళ్ల పిల్లలకు ప్రత్యేకమైన బెడ్ అవసరం అయితే రూ. 15,420, ప్రత్యేకమైన బెడ్ అవసరం లేకపోతే రూ. 13,810 తీసుకుంటారు.
3ఏసీ క్లాస్: డబుల్ షేరింగ్ అయితే రూ. 23,410, ట్రిపుల్ షేరింగ్ రూ. 20,440 చార్జ్ చేస్తారు. ఐదేళ్ల నుంచి పదకొండేళ్ల పిల్లలకు ప్రత్యేకమైన బెడ్ అవసరం అయితే రూ. 18,210, అవసరం లేకపోతే రూ. 16,600 చార్జ్ చేస్తారు.
ప్యాకేజీలో ఇవి కవర్ అవుతాయి..
స్లీపర్ క్లాస్, 3ఏసీలో ప్రయాణ టికెట్లు ప్యాకేజీలో వస్తాయి. అలాగే గుజరాత్ లో లోకల్లో ప్రయణానికి ఏసీ వాహనం. హోటల్లో ఏసీ వసతి కల్పిస్తారు. నాలుగు అల్పాహారాలు, నాలుగు రాత్రి భోజనాలు అందిస్తారు. అయితే మధ్యాహ్నం భోజనంతో పాటు, రైలులో భోజనం పర్యాటకులే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు ఐఆర్ సీటీసీ టూరిజమ్ అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లి, టూర్ ప్యాకేజీల సెక్షన్ లో సుందర్ సౌరాష్ట్ర ప్యాకేజీ వివరాలు తెలుసుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
