AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga for bloating: కడుపు ఉబ్బరం సమస్య వేధిస్తోందా? ఆలియా భట్ యోగా ట్రైనర్ చెబుతున్న ఈ యోగాసనాలు ట్రై చేయండి.. 

ఆలియా భట్, కరీనా కపూర్ వంటి బాలీవుడ్ హీరోయిన్లకు యోగా ట్రైనర్ గా ఉంటున్న అన్షుక కొన్ని యోగా టిప్స్ చెప్పారు. ముఖ్యంగా కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలకు అద్భుతంగా పనిచేసే యోగాసనాలను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ పేజీపై పోస్ట్ చేశారు.

Yoga for bloating: కడుపు ఉబ్బరం సమస్య వేధిస్తోందా? ఆలియా భట్ యోగా ట్రైనర్ చెబుతున్న ఈ యోగాసనాలు ట్రై చేయండి.. 
Yoga
Madhu
|

Updated on: Feb 03, 2023 | 1:59 PM

Share

ఇటీవల కాలంలో గ్యాస్ సమస్య సర్వ సాధారణం అయిపోయింది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందిరిలోనూ ఈ సమస్య వేధిస్తోంది. దీని వల్ల అసౌకర్యంగా ఫీల్ అవ్వడంతో మరేది తినలేని పరిస్థితి ఏర్పడుతుంది. కడుపు అంతా ఉబ్బరంగా ఉండటం.. కడుపు పట్టేసినట్లు ఉండటం సాధారణంగా మనకు కనిపిస్తాయి. అలాంటి సందర్భాల్లో చాలా మంది ఓ గ్యాస్ ట్యాబ్లట్ వేసుకోవడమో.. లేదా కార్భోనేటెడ్ డ్రింక్స్ తీసుకోవడం ద్వారా ఆ కడుపు ఉబ్బరం నుంచి బయటపడేందుకు ట్రై చేస్తారు. అయితే కొన్ని యోగాసనాలు ప్రయత్నించడం ద్వారా ఈ గ్యాస్ సమస్యల నుంచి పూర్తిగా విడుదల పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ యోగా నిపుణురాలు ఆలియా భట్, కరీనా కపూర్ వంటి బాలీవుడ్ హీరోయిన్లకు యోగా ట్రైనర్ గా ఉంటున్న అన్షుక కొన్ని యోగా టిప్స్ చెప్పారు. ముఖ్యంగా కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలకు అద్భుతంగా పనిచేసే యోగాసనాలను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ పేజిపై పోస్ట్ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

అసలు సమస్య ఎందుకు వస్తుంది..

సాధారణంగా అజీర్తి కారణంగా గ్యాస్ సమస్యలు ఉత్తన్నమవుతాయి. మసాలాతో కూడిన ఆహారం ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు, ఫైబర్ కంటెంట్ సాధారణంగా నెమ్మదిగా అరుగుతాయి, అటువంటివి అధికంగా తిన్నప్పుడు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, పీరియడ్స్ సమయంలో కడుపులో గ్యాస్ సమస్య రావచ్చు. ఇది ప్రాథమికంగా కడుపు, పేగులకు సంబంధించిన సమస్య. వీటిని అధిగమించేందుకు ప్రముఖ యోగా ట్రైనర్ అన్షుక తన ఇన్ స్టా పేజీపై కొన్ని చిట్కాలతో కూడిన వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఆమె ఇలా పేర్కొన్నారు. ‘ చాలా మంది తరచుగా గ్యాస్ నుంచి ఉపశమనం పొందేందుకు కార్బోనేటేడ్ డ్రింక్స్‌ను తీసుకుంటారు. కానీ ఇక్కడ కొన్ని యోగా ఆసనాలు ఉబ్బరం తగ్గించడానికి , గ్యాస్ నుండి ఉపశమనం పొందడానికి మీకు సహాయపడతాయి. ఈ భంగిమలు మీ కడుపును బలోపేతం చేయడంతో పాటు ఉబ్బరం ఫ్రీక్వెన్సీని తగ్గించడానికి కూడా సహాయపడతాయి. ఈ ఐదు యోగా ఆసనాలను ట్రై చేయండి’ అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by ANSHUKA YOGA (@anshukayoga)

ఆ ఐదు యోగాసనాలు ఇవి..

యోగా ట్రైనర్ తన వీడియోలో చూపించిన ఐదు యోగాసనాలు ఇవి.. కటి చక్రాసనం, ఉత్తిత పార్శ్వకోనాసనం, మండూకాసన, సేతు బంధకాసన, పవనముక్తాసన. వీటి ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుతాయి. కటి చక్రాసనం ద్వారా వెన్నెముక, నడుము బలోపేతం అవుతాయి. అలాగే పొట్ట పైభాగాన్ని టోన్ చేయడంలో సహాయపడుతుంది. ఉత్తిత పార్శ్వకోనాసనం కాళ్లు, మోకాలు, చీలమండలు, గజ్జలు, వెన్నెముక, నడుము, భుజాలను సాగదీయడంలో సహాయపడుతుంది. మండూకాసనం ఉదర అవయవాలను టోన్ చేయడంలో, కడుపు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది వెనుక కండరాలను ఎన్ లార్జ్ చేయడంలో , శరీరాన్ని టోన్ చేయడంలో కూడా సహాయపడుతుంది. సేతు బంధాసనం రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పవన్ముక్తాసనం పేగులను మసాజ్ చేయడంలో, మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో, బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..