Cyber Sickness Disease: ఫోన్, ల్యాప్‌టాప్‌లను ఎక్కువసేపు చూస్తున్నారా..? అయితే ఈ వ్యాధిబారిన పడినట్లే..

|

Dec 23, 2022 | 9:43 AM

ప్రస్తుత కాలంలో ఫోన్ అనేది మన జీవితం నుంచి విడదీయరాని భాగంగా మారిపోయింది. ఫోన్ అనేదాన్ని ఒక పరికరంగా  కంటే శరీరంలోని భాగంగా భావించేవారు కూడా ఉన్నారంటే ఆశ్యర్యం లేదు. ఫోన్ అనేది మన..

Cyber Sickness Disease: ఫోన్, ల్యాప్‌టాప్‌లను ఎక్కువసేపు చూస్తున్నారా..? అయితే ఈ వ్యాధిబారిన పడినట్లే..
Using Mobile Or Laptop For Overtime Will Cause Cyber Sickness Disease
Follow us on

ప్రస్తుత కాలంలో ఫోన్ అనేది మన జీవితం నుంచి విడదీయరాని భాగంగా మారిపోయింది. ఫోన్ అనేదాన్ని ఒక పరికరంగా  కంటే జీవన విధానంలో భాగంగా భావించేవారు కూడా ఉన్నారంటే ఆశ్యర్యం లేదు. ఫోన్ అనేది మన జీవితంలో ఒక భాగంగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించాలన్నా లేదా ఏదైనా తెలియని సమాచారాన్ని తెలుసుకోవాలన్నా ఫోన్, ల్యాప్‌టాప్‌ తప్పనిసరి. ఇక వీటిని ఆఫీసులో పని చేస్తున్నప్పుడు, భోజనం చేసేటప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు, బాత్‌రూమ్‌లో, బెడ్‌పై పడుకునేటప్పుడు కూడా విడిచిపెట్టకుండా వాడేస్తున్నాం. ఇంకో విధంగా చెప్పాలంటే ఇవి మానవ ప్రపంచాన్ని పట్టి పీడించే వ్యసన బూతాలుగా మారాయి.

అయితే మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లను ఎక్కువగా వినియోగించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది. మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌‌తో ఆన్‌లైన్ తరగతులు, పాఠశాల ఫీజులు, స్నేహితులతో చాట్ చేయడం, గేమ్‌లు ఆడటం అన్నీ సులువే. పని చేసిన తర్వాత కూడా సగానికి పైగా సమయాన్ని ల్యాప్‌టాప్ లేదా మొబైల్‌పైనే వెచ్చించడం వల్ల మన కాలాన్ని వృథా చేయడమే కాక మన ఆరోగ్యాన్ని కూడా పాడుచేసుకోవడమే.. ఫోన్‌ను ఎక్కువగా చూడడం వల్ల రాత్రి నిద్ర పట్టదు. ఎందుకంటే ఎక్కువ సేపు ఫోన్ లేదా ల్యాప్‌టాప్ స్క్రీన్‌కు అతుక్కొని ఉండడం వల్ల కళ్లలో మంటలు, కళ్లు తిరగడం, వాంతులు ప్రారంభమవుతాయి.

ఇవి కూడా చదవండి

ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ను ఎక్కువ సమయం చూడడం వల్ల కలిగే దుష్పభవాలు..

  • కళ్ళు ఎర్రబడటం
  • కనురెప్పలపై ఒత్తిడి అనుభూతి
  • తీవ్రమైన తలనొప్పి
  • కంటి వాపు
  • మైకము
  • వికారం
  • చికాకు
  • నిద్రపోవడం కష్టం
  • చత్వారం లేదా కళ్ల మసక

కళ్లను ఎలా సంరక్షించుకోవాలి..?

  • కళ్ళు మూసుకుని మూడు సార్లు పైకి క్రిందికి, కుడిఎడమలకు, చివరగా నేల వైపుకు కదుపుతూ చూడండి. ఇలా చేయడం వల్ల కళ్ల మంట సమస్యను పరిష్కరమవుతుంది.
  • వీలైనంత తక్కువగా  ఫోన్, ల్యాప్‌టాప్‌లను ఉపయోగించండి.
  • మీరు రోజుకు 7, 8 గంటల పాటు స్క్రీన్‌ను చూస్తున్నట్లయితే, మీరు టీవీని 10 గంటల కంటే ఎక్కువ సమయం చూసినట్లే. కాబట్టి జాగ్రత్తలు పాటించండి.
  • రాత్రిపూట, ముఖ్యంగా నిద్రిస్తున్నప్పుడు మొబైల్ వాడటం మానుకోండి.
  • ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో బ్లూ ఫిల్టర్‌ను ఇన్‌స్టాల్ చేయండి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం..