Wheat grass juice: ఈ జ్యూస్ ఔషధాల గని.. ఒక్కసారి తాగితే అస్సలు వదిలిపెట్టరు.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..

గోధుమ గడ్డి జ్యూస్ గురించి ఎప్పుడైనా విన్నారా? అది ఆరోగ్యానికి ఎం మేలు చేస్తుందో తెలిస్తే దానిని అసలు వదలిపెట్టరు. రోజూ గోధుమ గడ్డి రసం తాగితే.. అనేక ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Wheat grass juice: ఈ జ్యూస్ ఔషధాల గని.. ఒక్కసారి తాగితే అస్సలు వదిలిపెట్టరు.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..
Wheat Grass Juice
Follow us

|

Updated on: Mar 20, 2023 | 4:15 PM

గోధుమ గడ్డి జ్యూస్ గురించి ఎప్పుడైనా విన్నారా? అది ఆరోగ్యానికి ఎం మేలు చేస్తుందో తెలిస్తే దానిని అసలు వదలిపెట్టరు. రోజూ గోధుమ గడ్డి రసం తాగితే.. అనేక ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో దీనిని విరివిగా వినియోగిస్తారు. అక్కడ అన్ని స్టోర్లలో ఇది లభిస్తుంది. ఎక్కువ మంది దీనిని జ్యూస్ లా తీసుకుంటారు. ఒకటి నుంచి రెండు ఔన్సులు తీసుకుంటారు. అలాగే ఇది పౌడర్ రూపంలోనూ, ట్యాబ్లెట్ల రూపంలో కూడా లభ్యమవుతుంది. అయితే గోధుమ గడ్డి జ్యూస్ లా తాగితేనే దాని ప్రయోజనాలు బాగా అందుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రయోజనాలు ఏంటోచూద్దాం..

ఔషధాల గని..

గోధుమ గడ్డిలో విటమిన్‌-ఎ, బీ కాంప్లెక్స్‌, సీ, ఈ, కే విటమిన్లతో పాటు కాల్షియం, ఐరన్‌, మెగ్నీషియం, ఫైటోన్యూట్రియెంట్స్, 17 అమైనో యాసిడ్స్‌, క్లోరోఫిల్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాక యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది మన శరీరాన్ని డీటాక్స్‌ చేస్తుంది. శరీరంలోని మలినాలు, టాక్సిన్స్‌ను తొలగిస్తాయి.

ఇన్ ఫెక్షన్ తగ్గిస్తుంది..

గోధుమ గడ్డిలోని క్లోరోఫిల్‌‌‌‌‌ శరీరంలోని విష పదార్థాలను తొలిగించడంలో సహాయపడుతుంది. అలాగే చర్మ ఆరోగ్యానికి సాయపడుతుంది. కాలిన గాయాలను తగ్గిస్తుంది. దానికి ఇన్ ఫెక్షన్స్ అవ్వకుండా కాపాడుతుంది. ఆరోగ్యకరమైన కాలేయ పనితీరుకు తోడ్పడుతుంది. శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది..

గోధుమ గడ్డిలో ఎంజైమ్‌లు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి, పోషకాలను గ్రహించడానికి ఇవి సహాయపడతాయి. 2011లో జరిగిన పరిశోధన ప్రకారం, గోధుమ గడ్డిలోని డిటాక్స్ ప్రభావాలు పేగులను శుభ్రపరుస్తాయి. గ్యాస్‌, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తుంది. వీట్‌గ్రాస్ మలబద్ధకం, ఇరిటేటబుల్‌ బౌల్‌ సిండ్రోమ్‌ వంటి జీర్ణ సమస్యలను పరిష్కరిస్తుంది.

బరువు తగ్గుతారు..

గోధుమ గడ్డి జ్యూస్‌ తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి, కొవ్వు కూడా ఉండదు. ఇది తాగిన తర్వాత కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. వీట్‌ గ్రాస్‌ జ్యూస్‌ చక్కెర, కొవ్వు అధికంగా ఉండే.. ఆహారాల పట్ల కోరికను తగ్గించడంలో సహాయపడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..