
జనపనార గింజలు చాలా పోషకమైనవి. జనపనార గింజల్లో ఒమేగా-3, ఒమేగా-6, GLA, ప్రోటీన్, మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉన్నాయి. గుండె ఆరోగ్యం, కొలెస్ట్రాల్ నియంత్రణ, జీర్ణక్రియ, చర్మం–జుట్టు సంరక్షణకు ఇవి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజుకు 1–2 టీస్పూన్లు ఆహారంలో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
జనపనార విత్తనాలలో రెండు ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు, ఒమేగా 3 యాసిడ్స్, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్‌లతో సమృద్ధిగా ఉంటాయి. జనపనార గింజల్లో నైట్రిక్ ఆక్సైడ్ వుంటుంది. ఇది రక్త నాళాలు విస్తరిస్తుండటం వల్ల రక్తపోటు తగ్గడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని నిరోధిస్తుంది.
జనపనార గింజలు, జనపనార నూనె చర్మ రుగ్మతల నుండి కాపాడుతాయి. జనపనార విత్తనాలు మొక్కల ఆధారిత ప్రోటీన్ యొక్క గొప్ప మూలం. జనపనార విత్తనాలు మహిళల్లో మెనోపాజ్ దశను త్వరగా రాకుండా చేస్తాయి. జనపనార విత్తనాలు జీర్ణక్రియకు సహాయపడతాయి. ఇవి బరువు తగ్గటానికి కూడా దోహదపడతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…