ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి, సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే తినే ఆహార పదార్థాలు నిజంగా ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. వాస్తవానికి మార్కెట్లో అనేక రకాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆరోగ్యకర మైన పదార్ధాలు అని భావించే ప్రజలు వెనుక ముందు ఈ ఆహారాలను తినేస్తున్నారు. అంతేకాదు బలం ఆరోగ్యం అంటూ పిల్లలకు కూడా తినిపిస్తున్నారు. అయితే మార్కెట్ లో దొరికే కొన్ని రకాల ఆహార పదార్ధాలను తినడం వలన ఆరోగ్య ప్రయోజనాలకు బదులుగా.. మనకు తెలియకుండానే ఆరోగ్యం దెబ్బతినడం ప్రారంభమవుతుంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక ఆహారాలు ఆరోగ్యంగా కనిపిస్తాయి. కానీ అవి మీ ఆరోగ్యానికి పూర్తిగా ఆరోగ్యకరమైనవి కావు. కనుక ఈ రోజు ప్రజలు ఆరోగ్యంగా భావించి తినే కొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం.
క్యాన్డ్ జ్యూస్‌లు
ఆరోగ్యంగా ఉండటానికి ఎక్కువ మంది తమ రోజువారీ ఆహారంలో టీ, కాఫీకి బదులుగా పండ్ల జ్యూస్‌ని తాగడం ఆరోగ్యకరమైన ఎంపికగా భావిస్తారు. దీంతో చాలా మంది ప్రజలు మార్కెట్లో లభించే క్యాన్డ్ జ్యూస్‌లను తాగడం బెస్ట్ అని అనుకుంటారు. అయితే క్యాన్డ్ జ్యూస్‌లతో పాటు మార్కెట్లో చాలా ఎనర్జీ డ్రింక్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని సహజ పదార్థాలతో తయారు చేస్తారని చెబుతున్నారు. అయితే ఈ పానీయాలు, జ్యూస్‌లు అధిక చక్కెర కంటెంట్‌ను కలిగి ఉండటమే కాదు.. వీటి జీవితాన్ని పెంచడానికి కొన్ని రకాల రసాయనాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని కనుక వీటిని తాగడం ఆరోగ్యానికి ముప్పు అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
బ్రౌన్ బ్రెడ్
ఫిట్‌నెస్ కోసం శ్రద్ధ పెట్టె వ్యక్తులు తరచుగా తమ ఆహారంలో వైట్ బ్రెడ్‌లకు బదులుగా బ్రౌన్ బ్రెడ్‌లను చేర్చుకుంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో లభిస్తున్న చాలా బ్రౌన్ బ్రెడ్‌లలో..మైదా పిండిని కూడా ఉపయోగిస్తున్నారు. ఇది గోధుమ రంగులో కనిపించినా మార్కెట్‌లో లభించే బ్రౌన్ బ్రెడ్‌ను హెల్తీ అని పొరబడకండి.
వేరుశెనగ వెన్న
వేరుశెనగ వెన్న ప్రోటీన్ అద్భుతమైన మూలంగా పరిగణించబడుతుంది. అయితే దీనిని తయారు చేసేటప్పుడు.. నూనెను ఉపయోగిస్తారు. ఎక్కువ కాలం సురక్షితంగా నిల్వ ఉంచడం కోసం సంరక్షణ ఇచ్చే రసాయనాలను కూడా ఉపయోగిస్తారు. అటువంటి పరిస్థితిలో మార్కెట్లో లభించే వేరుశెనగ వెన్న ఆరోగ్యానికి హాని చేస్తుంది.
మార్కెట్‌లో లభించే తేనె
బరువు తగ్గడానికి ప్రజలు సాధారణ తేనెను గోరువెచ్చని నీటితో తీసుకుంటారు లేదా చక్కెరకు బదులుగా తేనెను మంచి ఎంపికగా భావిస్తారు. అయితే మార్కెట్లో లభించే తేనెలో చక్కెర కూడా ఉంటుంది. ఇది ఆరోగ్య ప్రయోజనానికి బదులుగా హానిని కలిగిస్తుంది.
యోగర్ట్
వర్కవుట్ చేసే వ్యక్తులు పెరుగుకు బదులుగా గ్రీకు పెరుగును ప్రోటీన్ కోసం తీసుకుంటారు. దీని రుచిని మెచ్చిన ప్రజలు ఆహారంలో యోగర్ట్ ను తినే ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటారు. అయితే అందులో ఫుడ్ కలర్‌తో పాటు చక్కెర కలుపుతారు. అందువల్ల ఫ్లేవర్డ్ పెరుగుకు బదులుగా.. సాధారణ పెరుగును ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమ ఎంపిక.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..