Health Tips: ఎడిసిడిటి, మైగ్రేన్, వికారం సమస్యలు వేధిస్తున్నాయా? ఈ సింపుల్ రెసిపీతో చెక్ పెట్టండిలా..!
దునియా మొత్తంలో 100 కు 90 మంది ఉదయం లేవగానే టీ, కాఫీ తోనే తమ రోజును ప్రారంభిస్తారు. టీ తాగకపోతే ఆ రోజంతా అదోలా ఉంటుంది. అయితే, కాఫీ, టీ లో కెఫిన్ ఉంటుంది. ఇది పేగుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పైగా హార్మోన్ల అసమతుల్యతకు కారణం అవుతుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం సమస్యలకు దారితీస్తుంది.
దునియా మొత్తంలో 100 కు 90 మంది ఉదయం లేవగానే టీ, కాఫీ తోనే తమ రోజును ప్రారంభిస్తారు. టీ తాగకపోతే ఆ రోజంతా అదోలా ఉంటుంది. అయితే, కాఫీ, టీ లో కెఫిన్ ఉంటుంది. ఇది పేగుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పైగా హార్మోన్ల అసమతుల్యతకు కారణం అవుతుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం సమస్యలకు దారితీస్తుంది. అందుకే కెఫిన్ లేని టీ, కాఫీతో రోజును ప్రారంభించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితం, సరికాని జీవనశైలి కారణంగా అసిడిటీ, మైగ్రేన్, వికారం వంటి సమస్యలతో చాలామంది సతమతం అవుతున్నారు. ఈ సమస్యల నుంచి బయటపడేందు హెర్బల్ టీ అద్భుతంగా పని చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఈ హెర్బల్ టీ ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
హెర్బల్ టీ తయారీ విధానం..
1 గ్లాసు నీరు (300 ml)
15 కరివేపాకు ఆకులు
15 పుదీనా ఆకులు
1 టేబుల్ స్పూన్ సోంపు
2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర
పైన పేర్కొన్న అన్ని పదార్థాలను మిక్స్ చేసి పేస్ట్‌లా రెడీ చేసుకోవాలి. ఆ తరువాత ఒక గిన్నెలో నీరు పోసి, ఆ పేస్ట్‌ను అందులో వేసి మరిగించాలి. మీడియం మంట మీద 5-7 నిమిషాలు మరిగించాలి. ఆ తరువాత వడకట్టి తాగాలి. కెఫిన్ లేని హాట్ హాట్.. హెల్తీ హెర్బల్ టీ.. మీ ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా.. ఎసిడిటీ, మైగ్రేన్, వికారం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..