AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఖర్జూరంతో ఇది కలిపి తినండి.. ఆ తరువాత ఫలితం చూసి అవాక్కవుతారు..

Health News: ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ అనారోగ్యం బారిన పడుతున్నారు. సరైన జీవనశైలి పాటించని కారణంగా 30 ఏళ్లకే ముసలి వాళ్లలా మారిపోతున్నారు. తరచూ అనారోగ్యం బారిన పడుతూ అవస్థలు ఎదుర్కొంటున్నారు. అయితే, ఆరోగ్యంగా ఉండాలంటే.. కొన్ని తప్పనిసరిగా పోషకాహరం తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. శరీర శక్తిని పెంచుకోవాలనుకుంటే, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకుంటే.. ఖర్జూరం తప్పక తినాలని సూచిస్తున్నారు నిపుణులు.

Health Tips: ఖర్జూరంతో ఇది కలిపి తినండి.. ఆ తరువాత ఫలితం చూసి అవాక్కవుతారు..
Dates
Shiva Prajapati
|

Updated on: Sep 05, 2023 | 6:26 AM

Share

Health News: ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ అనారోగ్యం బారిన పడుతున్నారు. సరైన జీవనశైలి పాటించని కారణంగా 30 ఏళ్లకే ముసలి వాళ్లలా మారిపోతున్నారు. తరచూ అనారోగ్యం బారిన పడుతూ అవస్థలు ఎదుర్కొంటున్నారు. అయితే, ఆరోగ్యంగా ఉండాలంటే.. కొన్ని తప్పనిసరిగా పోషకాహరం తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. శరీర శక్తిని పెంచుకోవాలనుకుంటే, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకుంటే.. ఖర్జూరం తప్పక తినాలని సూచిస్తున్నారు నిపుణులు. అంతేకాదండోయ్.. ఖర్జూరంతో పప్పు కలిపి తింటే మరింత బెనిఫిట్ ఉంటుందని చెబుతున్నారు. పోషకాలన్నీ సమృద్ధిగా ఉన్న ఈ రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చాలా మంది పప్పు, ఖర్జూరం విడివిడిగా తింటారు. అయితే, రెండింటిని కలిపి తింటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. మరి ఆ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఓసారి చూద్దాం..

విటమిన్ ఎ, బి, ఫైబర్, ఐరన్, ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు శనగలు, ఖర్జూరం రెండింటిలోనూ ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల శరీరానికి శక్తి అందడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వీటిని తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు.

ఎముకలు బలంగా ఉంటాయి..

శనగలు, ఖర్జూరం రెండూ కలిపి తింటే ఎముకలు దృఢంగా ఉంటాయి. ఈ రెండింటిలోనూ కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. శరీరంలో కాల్షియం పెరిగితే ఎముకలు దృఢంగా తయారవుతాయి. వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల కీళ్లకు సంబంధించిన సమస్యలను అధిగమించవచ్చు.

మలబద్ధకం..

ఉదర సంబంధిత సమస్యలు ఎదుర్కొంటుంటే, మలబద్ధకం సమస్య ఉన్నట్లయితే.. శనగలు, ఖర్జూరం ఈ సమస్యను నయం చేస్తాయి. ఈ రెండింటిలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. శనగలు, ఖర్జూరం కలిపి తింటే కడుపు సంబంధిత సమస్యలన్నీ నయమవుతాయి.

రక్తహీనత..

రక్తహీనత సమస్య ఉన్నవారు పప్పు, ఖర్జూరం తినాలి. ఈ రెండింటిలో ఐరన్ ఉంటుంది, ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. రక్తహీనతను సమస్యను తగ్గిస్తుంది.

రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి..

తరచూ అనారోగ్యం బారిన పడటానికి కారణం.. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ. అదే రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటే.. ఎలాంటి వ్యాధులు రావు. అందుకే శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి శెనగలు, ఖర్జూరం తినాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. నిత్యం శనగలు, ఖర్జూరం తినడం వల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. నిజానికి, ఈ రెండింటిలోనూ ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ రెంటినీ కలిపి తింటే మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండొచ్చు. అంతేకాదు.. ఖర్జూరం తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇది అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంచుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్‌ చేయండి..