Honey: చలికాలం రోజూ ఒక స్పూన్ తేనె తీసుకుంటే ఏమవుతుందో తెలుసా.?
తేనె ఆరోగ్యానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే చలికాలంలో తేనెను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మరెన్నో ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఇంతకీ రోజూ క్రమం తప్పకుండా ఒక స్పూన్ తేనె తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఎన్ని రోజులు అయినా ఎక్స్పైరీ కానీ వస్తువు ఏదైనా ఉందా అంటే అది తేనె ఒకటేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తేనెలోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మరీ ముఖ్యంగా చలికాలంలో తేనె తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చలికాలం రోజు ఒక స్పూర్ తేనె తీసుకుంటే శరీరంలో జరిగే మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చలికాలం చాలా మందిలో వచ్చే సర్వసాధారణమైన సమస్య జలుబు, దగ్గు. రోజూ తేనె తీసుకుంటే ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తేనె తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో చిన్న చిన్న వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు అంటున్నారు. అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేయడంలో కూడా తేనె కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే రక్తంలో హిమోగ్లోబిన్ పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇక చలికాలంలో వచ్చే గుండె పోటు ప్రమాదాల నుంచి బయటపడొచ్చు.
తేనెలో మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది. రక్త హీనతతో బాధపడేవారికి ఐరన్ బాగా పనిచేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక గోరు వెచ్చని నీటిలో తేనె కలుపుకొని తీసుకోవడం వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యల నుంచి బయటపడొచ్చని నిపుణులు అంటున్నారు. వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ ఆక్సిడెంట్ గుణాలు గొంతు సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి.
మానసిక ఆరోగ్యాన్ని కాపాడడడంలో కూడా తేనె కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ రోజూ మార్నింగ్ తేనె తీసుకుంటే హైపర్ టెన్షన్ దూరమవుతుంది. మరీ ముఖ్యంగా తేనెలో దాల్చిన చెక్క పొడి, అల్లం రసం కలిపి పరగడుపు తీసుకుంటే ఒత్తిడి దూరమై మంచి నిద్ర సొంతమవుతుంది.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..