సమ్మర్‌లో కూల్ కూల్‌గా బటర్ మిల్క్
వేసవి వచ్చిందంటే చాలు. మధ్యాహ్నం అలా బయటికి వెళ్లి వస్తే భానుడి ప్రతాపానికి అడ్డం పడాల్సిందే. ఈ సారి వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. భగ భగలాగే సూర్యడి దెబ్బకు.. మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. అలా బయటికి వెళ్లి వస్తే చాలు.. వడదెబ్బ బారిన పడుతున్నారు. ఆ సమయంలో శరీరానికి ఉపశమనం కోసం శీతలపానీయాల వైపు మొగ్గుచూపుతారు. అయితే వీటిలొ మజ్జిగ కూడా శరీరాన్ని వేసవితాపం నుంచి ఉపశమనం కల్గిస్తుంది. మజ్జిగను వేసవిలో చల్లచల్లగా […]

వేసవి వచ్చిందంటే చాలు. మధ్యాహ్నం అలా బయటికి వెళ్లి వస్తే భానుడి ప్రతాపానికి అడ్డం పడాల్సిందే. ఈ సారి వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. భగ భగలాగే సూర్యడి దెబ్బకు.. మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. అలా బయటికి వెళ్లి వస్తే చాలు.. వడదెబ్బ బారిన పడుతున్నారు. ఆ సమయంలో శరీరానికి ఉపశమనం కోసం శీతలపానీయాల వైపు మొగ్గుచూపుతారు. అయితే వీటిలొ మజ్జిగ కూడా శరీరాన్ని వేసవితాపం నుంచి ఉపశమనం కల్గిస్తుంది. మజ్జిగను వేసవిలో చల్లచల్లగా తాగితే మనకు అనేక లాభాలు ఉన్నాయి. అవేంటో చూడండి.
1. వేసవిలో చల్లని మజ్జిగను తాగడం వల్ల శరీరం చల్లబడటమే కాకుండా.. వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. ఎండకు వెళ్లి వచ్చే వారు ఇంటికి చేరుకోగానే చల్లని మజ్జిగలో నిమ్మకాయ రసాన్ని కలిపి తాగితే ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. అంతేకాదు డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు.
3. మజ్జిగను తాగడం వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంతేకాదు దీనిలోలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. అందువల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
4. కాల్షియం సమస్యతో బాదపడుతున్నవారు మజ్జిగను తీసుకోవడం వల్ల శరీరానికి కాల్షియం అందుతుంది. తద్వారా ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి.
5. మజ్జిగను తాగడం వల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది.
6. జీర్ణ సమస్యలను కూడా నివారించవచ్చు. అలాగే గ్యాస్ట్రిక్, ఎసిడిటీ ప్రభావం తగ్గుతాయి. పైగా చర్మం కాంతివంతంగా మారుతుంది.