బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగుతున్నారా..? అయితే, ఈ విషయాలు తెలుసుకోండి..
గుమ్మడికాయ దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుమ్మడిలోని విటమిన్లు, ఖనిజాలు, ఆహార ఫైబర్‌తో నిండిన బూడిద గుమ్మడికాయ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. బూడిద గుమ్మడికాయలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, ఇది పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అయితే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే..

బూడిద గుమ్మడికాయ.. కేవలం దిష్టి నివారిణి మాత్రమే కాదు.. ఇది సర్వరోగ నివారిణి అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు.. బూడిద గుమ్మడిలో అనేక ఔషధ గుణాలు నిండివున్న అత్యంత పోషకమైన ఆహారంగా చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడానికి బూడద గుమ్మడికాయను జ్యూస్ రూపంలో తీసుకోవటం ఎంతో మంచిది అంటున్నారు. బూడిద గుమ్మడికాయ జ్యూస్‌ను తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉండొచ్చు. షుగర్‌ను కంట్రోల్ చేయడానికి ఈ జ్యూస్ బాగా హెల్ప్ చేస్తుంది. షుగర్ ఉన్న వాళ్లు రెగ్యులర్‌గా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
ప్రతి రోజు ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య రాదు. రెగ్యులర్‌గా తీసుకుంటే అనేక ప్రయోజనాలు పొందవచ్చు. నిద్రలేమితో బాధపడే వాళ్లకి బూడిద గుమ్మడికాయ జ్యూస్ మంచి ఎంపిక. ఈ జ్యూస్‌ను రెగ్యులర్‌గా తీసుకుంటే నిద్రలేమి నుంచి బయిటపడొచ్చు. గుమ్మడికాయ రసాన్ని తెలుసుకోవడం వలన వాత, పిత్త దోషాలు బ్యాలెన్స్ అవుతాయి. హెల్తీగా ఉండొచ్చు. బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే కిడ్నీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ జ్యూస్ తాగితే కిడ్నీ సమస్యలు దూరం అవుతాయి. కిడ్నీలో రాళ్లు తగ్గుతాయి.
మూత్ర సంబంధిత సమస్యలకు దూరంగా ఉండడానికి ఈ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్ తాగితే యూటిఐ తగ్గుతుంది. ఈ జ్యూస్ ని తీసుకుంటే మంచి ఎనర్జీని ఇస్తుంది. క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్ ఇందులో సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ సి, బి కాంప్లెక్స్ కూడా ఉంటాయి. రెగ్యులర్‌గా దీన్ని తీసుకోవడం వలన ఒంట్లో ఉన్న మలినాలు బయటకు వెళ్లిపోతాయి. సైనస్ సమస్యలు ఉంటే కూడా దీనిని తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








