AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks : కూరగాయల్లో పురుగులు దాక్కున్నాయా…అయితే వాటిని ఈ చిట్కాలతో…ఒక్క నిమిషంలో దూరం చేయండి

ఆకు కూరలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ, బఠానీలు వంటి ఆకుపచ్చ కూరగాయలలో చిన్న కీటకాలు తరచుగా కనిపిస్తాయి. కొన్నిసార్లు అవి కంటికి కనపడకుండా ఉంటాయి. దీంతో మనం చూసుకోకుండా వండేస్తాము. అప్పుడు అవి మన ఆహారంలో కనిపిస్తే చాలా అసహ్యంగా ఉంటుంది.

Kitchen Hacks : కూరగాయల్లో పురుగులు దాక్కున్నాయా...అయితే వాటిని ఈ చిట్కాలతో...ఒక్క నిమిషంలో దూరం చేయండి
Wash Greens
Madhavi
| Edited By: |

Updated on: Apr 03, 2023 | 8:15 AM

Share

ఆకు కూరలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ, బఠానీలు వంటి ఆకుపచ్చ కూరగాయలలో చిన్న కీటకాలు తరచుగా కనిపిస్తాయి. కొన్నిసార్లు అవి కంటికి కనపడకుండా ఉంటాయి. దీంతో మనం చూసుకోకుండా వండేస్తాము. అప్పుడు అవి మన ఆహారంలో కనిపిస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. ఈ కీటకాలు కూరగాయలలో వ్యవసాయ క్షేత్రం నుంచే వచ్చేస్తుంటాయి. అంతే కాదు ఇవి కూరగాయాలను పాడు చేస్తుంటాయి. ఈ కీటకాలు పరిమాణంలో చాలా చిన్నవిగా ఉంటాయి, కొన్నిసార్లు అవి కనిపించవు. కీటకాలు ఉన్న కూరగాయల వినియోగం మన ఆరోగ్యంపై చెడు ప్రభావాలను చూపుతుంది. ఆకుకూరలు , కాలీఫ్లవర్ వంటి ఆకుపచ్చ కూరగాయల నుండి కీటకాలను ఎలా తొలగించాలో తెలుసుకుందాం.

1. కాలీఫ్లవర్ నుండి కీటకాలను ఎలా తొలగించాలి:

కాలీఫ్లవర్ వంటి కూరగాయలలో దాగి ఉన్న కీటకాలు ఆరోగ్యానికి చాలా హానికరం. వంట చేయడానికి ముందు కీటకాలను తొలగించడం అవసరం. వంట చేయడానికి ముందు, కాలీఫ్లవర్ ప్రతి పొరను సరిగ్గా తనిఖీ చేయండి. కాలీఫ్లవర్‌లో అత్యధిక సంఖ్యలో కీటకాలు ఉంటాయి. అందుకే వినియోగించే ముందు క్షుణ్ణంగా పరీక్షించుకోవాలి. వాటిని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి, తద్వారా మీరు కీటకాలను9 సులభంగా గుర్తించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఒక పాత్రలో వేడి నీటిని తీసుకుని అందులో కనీసం ఒక టీస్పూన్ ఉప్పు వేయండి. దీని తర్వాత, ఈ నీటిలో క్యాబేజీ ముక్కలను వేసి, కాసేపు అలాగే ఉంచండి. కూరగాయలో పురుగులు ఉంటే, అప్పుడు మీరు నీటిలో చిన్న కీటకాలు పైకి రావడం చూస్తారు.

అంతే కాకుండా గోరువెచ్చని నీళ్లలో ఉప్పు, పసుపు కలిపి కాలీఫ్లవర్ వేసి కాసేపు ఉంచితే కీటకాలు బయట కనిపించడం ప్రారంభిస్తాయి.

2. ఆకు కూరల నుండి కీటకాలను ఎలా తొలగించాలి:

పాలకూర వంటి ఆకులను కత్తిరించడం కడగడం చాలా కష్టమైన పని అయినప్పటికీ. కొన్నిసార్లు చిన్న కీటకాలు ఆకులపై దాగి ఉంటాయి, అవి సులభంగా కనిపించవు.ఆకు కూరలను ఉప్పు నీటిలో కొంత సమయం పాటు ఉంచండి. కూరగాయలను ఉప్పు నీటిలో కనీసం 10-15 నిమిషాలు ఉంచండి. దీని తరువాత, సాధారణ నీటితో రెండు మూడు సార్లు బాగా కడిగి ఉడికించాలి.

3. క్యాబేజీ నుండి కీటకాలను ఎలా తొలగించాలి:

క్యాబేజీలో ఉండే కీటకాలు ఆరోగ్యానికి చాలా హానికరం. ఈ కీటకాలు మెదడుకు హాని కలిగించేలా పనిచేస్తాయి. అందుకే క్యాబేజీని కట్ చేసేటప్పుడు, దాని పై రెండు పొరలను తొలగించేలా చూసుకోండి. క్యాబేజీని కట్ చేసి పసుపు ఉన్న గోరువెచ్చని నీటిలో ముంచి కాసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత 15 నిమిషాల తర్వాత మరో పాత్రలో తీసి 1-2 సార్లు సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా కూరగాయల నుండి అన్ని మురికి తొలగిపోతుంది కీటకాలు కూడా తొలగిపోతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్  కోసం ఇక్కడ క్లిక్ చేయండి..