AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: తిన్న వెంటనే.. ఈ పనులు చేస్తున్నారు.. అయితే మీ బాడీ షెడ్డుకెళ్ళినట్టే!

మన దయనందిన జీవనంలో మనం సాధారణంగా తెలిసో తెలికో కొన్ని అలవాట్లను పాటిస్తూ ఉంటాం వాటి వల్ల కొన్ని అనారోగ్య సమస్యలను కూడా ఎదర్కొంటుంటాం. వీటిలో ఎక్కవ శాతం మంది చేసే తప్పులు ఏవో తెలుసా.. భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం, స్నానం చేయడం, పండ్లు లేదా టీ/కాఫీ తాగడం. ఇలాంటి అలవాట్లు మన జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయి. ఇలా మనం అనారోగ్యం బారిన పడకుండా ఉండేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం పదండి.

Lifestyle: తిన్న వెంటనే.. ఈ పనులు చేస్తున్నారు.. అయితే మీ బాడీ షెడ్డుకెళ్ళినట్టే!
Lifestyle
Anand T
|

Updated on: Jul 26, 2025 | 5:14 PM

Share

మన దయనందిన జీవనంలో మనం సాధారణంగా తెలిసో తెలికో కొన్ని అలవాట్లను పాటిస్తూ ఉంటాం వాటి వల్ల కొన్ని అనారోగ్య సమస్యలను కూడా ఎదర్కొంటుంటాం. వీటిలో ఎక్కవ శాతం మంది చేసే తప్పులు భోజనం తర్వాత నిద్రపోవడం, స్నానం చేయడం, పండ్లు లేదా టీ/కాఫీ తాగడం. ఇలా తిన్న తర్వాత మనకున్న కొన్ని అలవాట్లు మన జీర్ణవ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండా దీని వల్ల పలు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా, రాత్రి భోజనం తర్వాత చేసే తప్పుల వల్ల మన నిద్రలేమి సమస్యలతో పాటు, మరుసటి రోజు ఉదయం మన తాజాదనాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. మన జీర్ణవ్యవస్థను కాపాడుకోవడానికి, ఆరోగ్యంగా ఉండేందుకు భోజనం తర్వాత నివారించాల్సిన కొన్ని ముఖ్యమైన అలవాట్ల గురించి పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భోజనం తర్వాత అలవాట్ల జీర్ణవ్యవస్థపై ఎలా ప్రభావితం చూపుతాయి.

మన జీర్ణవ్యవస్థ మనం తినే ఆహారం నుండి పోషకాలను గ్రహించి శరీరానికి శక్తిని అందిస్తుంది. ఈ క్రమంలో జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలిగించే ఏదైనా అలవాటు మనం నిత్యం పాటిస్తూ ఉంటే అది అజీర్ణం, ఆమ్లత్వం, ఉబ్బరం, గ్యాస్, తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల, తిన్న తర్వాత చేసే చిన్న తప్పులు కూడా పెద్ద ప్రభావాన్ని చూపుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

భోజనం తర్వాత నివారించాల్సిన ముఖ్యమైన అలవాట్లు:

భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం: దీన్ని ఎందుకు నివారించాలి? అంటే భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల మన జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయదు. ఇది అజీర్ణం, గుండెల్లో మంట (GERD), ఆమ్లత్వం, ఉబ్బరం వంటి వాటికి కారణమవుతుంది. ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత దీనిని నివారించడం చాలా ముఖ్యం. అందుకోసం మనం నిద్రపోవడానికి 2-3 గంటల ముందే భోజనం చేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే తిన్న ఆహారం మంచిగా జీర్ణయం అయి శరీరానికి పోషకాలు అందుతాయట.

భోజనం చేసిన వెంటనే పండ్లు తినడం

భోజనం చేసిన వెంటనే పండ్లు తినడం ఎందుకు నివారించాలంటే.. సాధారణంగా పండ్లు ఒక్కటే తింటే అవి త్వరగా జీర్ణయం అవుతాయి. కానీ ఇతర ఆహార పదార్థాలతో పాటు వాటిని తీసుకున్నప్పుడు, జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుంది. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి భోజనానికి ఒక గంట ముందైనా లేదా భోజనం చేసిన 2-3 గంటలు తర్వాతైన పండ్లు తీసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

భోజనం చేసిన వెంటనే నీరు త్రాగడం

మనకు ఉండే ఇంకో చెడ్డ అలవాటు ఏంటంటే భోజనం చేసిన వెంటనే నీరు ఎక్కువగా తాగడం.. దీని వల్ల జీర్ణ ఎంజైములు పలుచబడి జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీన్ని నివారించడానికి భోజనానికి అరగంట ముందు లేదా భోజనం తర్వాత 30-45 నిమిషాల తర్వాత నీరు త్రాగడం ఉత్తమం.

భోజనం చేసిన వెంటనే టీ, కాఫీ, సిగరెట్‌, బీడి తాగడం

భోజనం తర్వాత టీ, కాఫీలు కూడా తాగడం మంచిది కాదు.. వాటిలో ఉండే టానిన్లు ఇనుము శోషణను అడ్డుకుంటాయి. ఇది రక్తహీనతకు దారితీస్తుంది. దీన్ని నివారించేందకు భోజనం చేసిన గంట తర్వాత టీ లేదా కాఫీ తాగడం మంచిది. అలాగే భోజనం చేసిన వెంటనే సిగరెట్,బీడీలు తాగడం కూడా మంచింది కాదు.. తిన్న తర్వాత ధూమపానం చేయడం వల్ల జీర్ణవ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. ఇది పెద్దప్రేగు శోథ, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్, క్యాన్సర్ వంటి జబ్బులకు దారి తీస్తుంది. కాబట్టి ఈ ధూమపానం అలవాటును పూర్తిగా మానేయడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.

భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం

భోజనం చేసిన తర్వాత స్నానం చేయడం వల్ల కూడా జీర్ణవ్యవస్థ నుండి చర్మానికి రక్త ప్రవాహం మళ్లుతుంది. ఇది జీర్ణ ప్రక్రియను నెమ్మదిస్తుంది. భోజనం చేసిన కనీసం 30-45 నిమిషాల తర్వాత స్నానం చేయడం మంచిది. ఈ సాధారణ అలవాట్ల మార్పులు మీ జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడటానికి మరియు మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే