AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coconut Water Benefits: నూనె మాత్రమే కాదు.. కొబ్బరి నీళ్లు కూడా జుట్టును ఆరోగ్యంగా, దృఢంగా మారుస్తాయి.. ఇలా ట్రై చేయండి..

కొబ్బరి నీళ్లు శారీరక ఆరోగ్యంతో పాటు.. చర్మం, జుట్టుకు కూడా చాలా మంచిది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. దీనిని హెయిర్‌కేర్ రొటీన్‌లో కూడా చేర్చుకోవచ్చు. ఇది జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలను అధిగమించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లను సరైన విధానంలో ఉపయోగించడం వలన జుట్టు బలంగా మారుతుంది. జుట్టు చిట్లిపోకుండా కాపాడుకోవచ్చు. జుట్టు వేగంగా పెరగడానికి కొబ్బరి నీరు కూడా సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లను జుట్టుకు ఏయే మార్గాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Coconut Water Benefits: నూనె మాత్రమే కాదు.. కొబ్బరి నీళ్లు కూడా జుట్టును ఆరోగ్యంగా, దృఢంగా మారుస్తాయి.. ఇలా ట్రై చేయండి..
Coconut Water Benefits
Shiva Prajapati
|

Updated on: Sep 05, 2023 | 7:15 AM

Share

కొబ్బరి నీళ్లు శారీరక ఆరోగ్యంతో పాటు.. చర్మం, జుట్టుకు కూడా చాలా మంచిది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. దీనిని హెయిర్‌కేర్ రొటీన్‌లో కూడా చేర్చుకోవచ్చు. ఇది జుట్టుకు సంబంధించిన అనేక సమస్యలను అధిగమించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లను సరైన విధానంలో ఉపయోగించడం వలన జుట్టు బలంగా మారుతుంది. జుట్టు చిట్లిపోకుండా కాపాడుకోవచ్చు. జుట్టు వేగంగా పెరగడానికి కొబ్బరి నీరు కూడా సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లను జుట్టుకు ఏయే మార్గాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

షాంపూతో కొబ్బరి నీరు..

దీని కోసం అరకప్పు కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. కొబ్బరి నీళ్లను షాంపూతో కలపండి. ఇప్పుడు జుట్టు ఈ షాంపూ ఉపయోగించండి. ఆ తరువాత కాసేపటికి జుట్టును శుభ్రంగా కడగాలి. ఇది మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. జుట్టు సాఫ్ట్‌గా, మెరుస్తూ ఉంటుంది.

కొబ్బరి నీళ్లతో జుట్టుకు స్ప్రే చేయండి..

మీరు జుట్టుకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నలయితే.. కొబ్బరి నీటిని ఉపయోగించవచ్చు. కొబ్బరి నీళ్లను స్ప్రే బాటిల్‌లో పోయాలి. ఆ తరువాత ఆ వాటర్‌ని జుట్టుకు స్ప్రే చేయండి. కొబ్బరి నీళ్లతో మీ జుట్టు్కు స్ప్రే చేస్తే, అది స్కాల్ప్, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.

కొబ్బరి నీరు, పెరుగు పేస్ట్..

జుట్టు సంబంధిత సమస్యల నివారణకు, జుట్టు సంరక్షణకు కొబ్బరి నీరు, పెరుగు మిశ్రమాన్ని వినియోగించొచ్చు. ఒక కప్పు పెరుగులో కొన్ని కొబ్బరి నీళ్లు కలపాలి. దానిని బాగా పేస్ట్‌లా కలపాలి. ఆ పేస్ట్‌ని జుట్టు, స్కాల్ప్‌కు మంచిగా అప్లై చేయాలి. ఆ తరువాత కొన్ని నిమిషాల పాటు తలకు మసాజ్ చేయాలి. దాదాపు అరగంట పాటు అలాగే వదిలేయాలి. ఆ తరువాత మంచి నీటితో శుభ్రంగా కడగాలి. పెరుగు, కొబ్బరి నీళ్ల మిశ్రమాన్ని వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఇలా చేయడం వలన జుట్టుకు మరింత మేలు జరుగుతుంది.

మందార, కొబ్బరి నీళ్లు..

జుట్టు సంరక్షణ కోసం మందార పువ్వులు, కొబ్బరి నీళ్ల మిశ్రమాన్ని కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం మిక్సీలో దాదాపు 8 మందార పువ్వులను వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌లో కొబ్బరి నీళ్లు కలపండి. ఈ రెండు పదార్థాల పేస్ట్‌ని జుట్టు, తలపై కాసేపు అప్లై చేయండి. ఆ తర్వాత జుట్టును కవర్ చేయండి. ఒక గంట తర్వాత జుట్టును మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే మేలు జరుగుతుంది.

కొబ్బరి నీళ్లు, అలోవెరా జెల్..

ఒక గిన్నెలో 2 స్పూన్ల అలోవెరా జెల్ తీసుకోండి. అందులో దాదాపు 2 నుంచి 3 చెంచాల కొబ్బరి నీళ్లను కలపండి. ఈ రెండు పదార్థాలను మిక్స్ చేసి తల మొత్తానికి పట్టించాలి. కాసేపు చేతులతో తలను మసాజ్ చేయాలి. కలబంద, కొబ్బరి నీళ్ల పేస్ట్‌ని జుట్టుపై అప్లై చేసి, అరగంట పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత తలని నీటితో శుభ్రం చేసుకోవాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..