Gulab Tea Recipe: ఒక కప్పు గులాబ్ టీతో క్లైమెట్‌ను ఎంజాయ్ చేయండి.. ఘుమఘుమలాడే రెసెపి మీకోసం..

| Edited By: Ravi Kiran

Jun 21, 2022 | 6:34 AM

అల్లం, యాలకులు, లవంగం, దాల్చినచెక్క, తులసి ఇలా అనేక రకాల టీలను మీరు ఇప్పటి వరకు ప్రయత్నించే ఉంటారు. కానీ ఈ టీ భిన్నంగా ఉంటుంది.

Gulab Tea Recipe: ఒక కప్పు గులాబ్ టీతో క్లైమెట్‌ను ఎంజాయ్ చేయండి.. ఘుమఘుమలాడే రెసెపి మీకోసం..
Rose Tea
Follow us on

Gulab Tea Recipe: పని ఒత్తిడి లేదా తలనొప్పి, అలసట సమయాల్లో, ఇంకా బోర్ కొట్టినప్పుడల్లా చాలామంది టీ తాగుతారు. చాయ్ ప్రియులు టీ తాగడానికి కారణం కూడా అవసరం లేదు. ఇద్దరు స్నేహితులు కలిసినా.. చలికాలం, వర్షాకాలంలో వేచ్చగా ఉండలన్నా ఒక కప్పు టీతో ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి టీ ప్రియులకు ఈ రోజు పూర్తిగా భిన్నమైన టీ రెసిపీని పరిచయం చేస్తున్నాం.. దీనిని మీరు ఇంట్లో కూడా ప్రయత్నించవచ్చు. అల్లం, యాలకులు, లవంగం, దాల్చినచెక్క, తులసి ఇలా అనేక రకాల టీలను మీరు ఇప్పటి వరకు ప్రయత్నించే ఉంటారు. కానీ ఈ టీ భిన్నంగా ఉంటుంది. మీ ఇంట్లో గులాబీ మొక్క ఉంటే, మీరు ఈ టీ రిసిపిని ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. కాబట్టి గులాబీతో తయారు చేసే టీ రెసిపీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రోజ్ టీ తయారీకి కావలసిన పదార్థాలు

  • నీరు ఒకటిన్నర కప్పు
  • కొంచెం తురిమిన అల్లం
  • దాల్చిన చెక్క
  • లవంగాలు 3
  • గులాబీ రేకులు 6
  • టీ పొడి 3 టేబుల్ స్పూన్లు
  • స్వీటెనర్ 2 టేబుల్ స్పూన్లు
  • యాలకులు 3
  • పాలు 2 కప్పులు
  • తులసి ఆకులు 6
    (లేకపోతే మీకు కావాల్సినంత పరిమాణంలో వీటిని తీసుకోవాలి)

రోజ్ టీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ఇవి కూడా చదవండి

రోజ్ టీ చేయడానికి ముందుగా టీ గిన్నెలో నీటిని వేడి చేయండి. నీళ్లల్లో అల్లం, దాల్చిన చెక్క, యాలకులు, గులాబీ ఆకులు వేసి మరిగించాలి. మరిగేటప్పుడు అందులో టీ పొడి , పంచదార వేయాలి. అది మంచిగా మరిగిన తర్వాత.. అందులో పాలు వేయాలి. ఆ తర్వాత చివరగా తులసి ఆకులను వేసి కాసేపు టీని మరిగించాలి. దీని తర్వాత రుచికరమైన గులాబ్ టీని ఆస్వాదిస్తూ తాగవచ్చు. దీంతోపాటు ఇంటికి వచ్చిన అతిథులకు కూడా ఇవ్వవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..