AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guava vs Amla: జామ.. ఉసిరి.. వీటిల్లో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందో తెలుసా?

అన్ని కాలాల్లో ఆరోగ్యంగా ఉండాలంటే సీజనల్ పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా చలికాలంలో రోగాలు ఎక్కువగా దాడి చేస్తాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ఈ కాలంలో వచ్చే పండ్లు ఆహారంలో తప్పని సరిగా తీసుకోవాలి. ముఖ్యంగా జామ, ఉసిరి వీటిని ఆహారంలో భాగంగా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చు..

Guava vs Amla: జామ.. ఉసిరి.. వీటిల్లో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందో తెలుసా?
Guava Vs Amla
Srilakshmi C
|

Updated on: Jan 24, 2025 | 1:46 PM

Share

చలికాలంలో కొన్ని రకాల ఆహారాలు తప్పనిసరిగా తినడం ఆరోగ్యానికి చాలా అవసరం. అటువంటి వాటిల్లో జామ, ఉసిరి ముందు వరుసలో ఉంటాయి. వీటిల్లో అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రెండూ సూపర్ ఫుడ్స్. పురాతన కాలం నుంచి వివిధ ఆరోగ్య సమస్యలను నయం చేయడానికి వీటిని ఉపయోగిస్తున్నారు. అయితే వీటిలో ఒకటి ఎంచుకోవలసి వస్తే, ఏది ఆరోగ్యకరమైనది అనే సందేహం కలుగుతుంది. ఆ విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..

ఎందులో ఏయే పోషకాలు ఉంటాయంటే..

జామలో విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఉసిరిలో ఐరన్, కాల్షియం, టానిన్లు, ఫ్లేవనాయిడ్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి ఉపయోగపడతాయి. ఇవి రెండింటిలోనూ విటమిన్ సి కంటెంట్‌ అధికంగా ఉంటుంది. అయితే అధిక యాంటీఆక్సిడెంట్ స్థాయిల కారణంగా జామను ఎక్కువగా తీసుకోమని నిపుణులు చెబుతుంటారు.

రోగనిరోధకత శక్తిని పెంచే కారకాలు

జామ, ఉసిరి..ఇవి రెండూ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జామలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఉసిరి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా సహజమైన నిర్విషీకరణగా కూడా పనిచేస్తుంది. ఇది టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉసిరిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక సమస్యలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది సాధారణ జలుబు లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మొత్తం రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

జీర్ణక్రియకు ఏది మంచిది?

జామల ఫైబర్ అధికంగా ఉండే పండు. ఇది జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. గట్‌లో ఆరోగ్యకరమైన మైక్రోబయోటాను నిర్వహించడానికి ఇది చాలా మంచిది. ఉసిరి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది. జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఉసిరిని అజీర్ణం, ఉబ్బరం చికిత్సకు ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. జామలోని పీచు పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉసిరి జీర్ణవ్యవస్థను నియంత్రిస్తుంది. కాబట్టి ఈ రెండూ జీర్ణక్రియకు మంచి ఎంపిక.

గుండె ఆరోగ్యానికి మేలు

జామ డయాబెటిస్ ఫ్రెండ్లీ ఫ్రూట్. ఎందుకంటే ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, అధిక ఫైబర్ కంటెంట్ కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర శోషణను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా ఇది అద్భుతమైన ఎంపిక. 2016 అధ్యయనం ప్రకారం, రక్తంలో చక్కెరను తగ్గించడంలో జామ మరింత ప్రభావవంతంగా ఉంటుంది. రక్తంలో చక్కెరను నిర్వహించడానికి ఉసిరి కూడా ఒక అద్భుతమైన ఎంపిక. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి కంటెంట్ రక్త నాళాలను బలోపేతం చేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. రెండూ గుండె ఆరోగ్యానికి, మధుమేహానికి అనుకూలమైనవి. ఉసిరి కొలెస్ట్రాల్ సమస్యకు కూడా చక్కని పరిష్కారం చూపుతుంది.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.