జామాకులతో ఎన్ని లాభాలున్నాయో తెలుసా.. వేసవిలో చర్మ సమస్యలను క్షణాల్లో తగ్గించే ఔషదమే జామ..
ఎండాకాలంలో చర్మ సమస్యలు ప్రతి ఒక్కరికి సర్వ సాధారణం. కొందరిలో ఈ సమస్యలు అధికంగా ఉంటాయి. మరికొందరిలో తక్కువగా ఉంటాయి.
ఎండాకాలంలో చర్మ సమస్యలు ప్రతి ఒక్కరికి సర్వ సాధారణం. కొందరిలో ఈ సమస్యలు అధికంగా ఉంటాయి. మరికొందరిలో తక్కువగా ఉంటాయి. ఇక ఈ చర్మ సమస్యలను తగ్గించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్లో లభించే పలు రకాల కెమికల్ ప్రొడక్ట్స్, హోం రెమెడీస్ చాలా ఉపయోగిస్తుంటారు. అలాగే ముఖంపై మొటిమలు, బ్లాక్ హెడ్స్, చర్మ శుద్ది వంటి సమస్యలు అనేకం. అయితే మీ ఇంట్లో జామ చెట్టు చర్మ సమస్యలను తగ్గిస్తుంది. మొటిమలు, బ్లాక్ హెడ్స్ తగ్గించడంలో జామాకులు అధికంగా సహయపడతాయి. ఇందులో పుష్కలంగా ఆరోగ్యంగా విలువులు ఉంటాయి. ఇవి చర్మ నాణ్యతను మెరుగుపరుస్తాయి. సాధారణ చర్మ సమస్యలను నివారిస్తుంది. జామాకులతో చేసే ప్యాక్స్ ఎంతగానో సహయపడతాయి.
ఒక పది నుంచి పన్నెండు ఆకులు తీసుకోని బాగా కడగాలి. వాటన్నింటి మిక్సీలో వేసి ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసి పేస్ట్ లా మార్చాలి. వేడి వేసవి నెలల్లో చర్మశుద్ధి చాలా మందికి సాధారణ సమస్య. వైలెట్ చర్మం రంగు పాలిపోవడం ఏర్పడుతుంది. పెరైలా దీనికి పరిష్కారం. మీ చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి మరియు రంగు వేయడానికి ఈ ఫేస్ ప్యాక్‌ని ఉపయోగించండి. మీకు ఒక టేబుల్ స్పూన్ లీఫ్ పేస్ట్ మరియు 1 గుడ్డు తెలుపు అవసరం. ఒక గిన్నె తీసుకొని రెండు పదార్థాలను బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ ముఖం మీద బ్రష్ తో అప్లై చేసి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. దీనివల్ల ముఖం మీద పేరుకుపోయిన మృత కణాలు తొలగిపోతాయి. కెమికల్ ప్రొడక్ట్స్ కంటే ఈ సహజ ట్రీట్ మెంట్ ఎక్కువగా ఉపయోగపడుతుంది.
1 నుంచి 2 జామాకుల పేస్ట్, చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూన్ వేప ఆకుల పేస్ట్ అన్ని కలిపి ముఖంపై అప్లై చేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడగడం వలన ముఖంపై ఉండే మొటిమలు తగ్గుతాయి. అలాగే జామాకుల పేస్ట్ లో రోజ్ వాటర్ కలిపి ముఖంపై అప్లై చేయడం వలన బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి. దీనిని వారానికి రెండు సార్లు చేయాలి. జామాకుల పేస్ట్ లో కొద్దిగా నిమ్మరసం కలపడం వలన చర్మంపై ఉండే జిడ్డు తొలగిపోవడమే కాకుండా… ముఖంపై మచ్చలు తగ్గిపోతాయి.
Also Read: మహిళలకు గుడ్‌న్యూస్… కేంద్రం కీలక నిర్ణయం.. వారి అకౌంట్లోకి రూ.5000.. ఎలా అప్లై చేసుకోవాలంటే…