
జుట్టు అందంగా, ఒత్తుగా పెరగాలని ఆడవారికే కాదు మగవారికి కూడా ఉంటుంది. చాలా మంది జెంట్స్ బట్టతలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. జుట్టు పెరగాలని కోరుకోవడమే కాదు.. దానికి తగ్గ పోషణ కూడా అందించాలి. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఒత్తిడిని తగ్గించుకోండి. ఒత్తిడిని కంట్రోల్ చేసుకుంటే.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు. అదే విధంగా జుట్టును శుభ్రంగా ఉంచుకోవాలి. వారానికి రెండు సార్లు తలకు బాగా ఆయిల్ పెట్టి, శుభ్రం చేసుకోవాలి. జుట్టు పెరగడం కోసం ఇప్పటికే రకరకాల చిట్కాలు ఫాలో అయి ఉండి ఉంటారు. ఈసారి ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా మీ జుట్టు పెరుగుతుంది. కొబ్బరి నీటితో కేవలం ఆరోగ్యమే కాకుండా.. జుట్టును కూడా సంరక్షించుకోవచ్చు. కొబ్బరి నీరు ఉపయోగించడం వల్ల జుట్టు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి నీటితో జుట్టును కడగడం వల్ల జుట్టుకి హైడ్రేషన్ అందుతుంది. డ్రై హెయిర్‌తో ఇబ్బంది పడేవారు కొబ్బరి నీటిని ఉపయోగించడం వల్ల హెయిర్ స్మూత్‌గా, సాఫ్ట్‌గా తయారవుతుంది. అంతే కాకుండా జుట్టు మూలాలకు కూడా తేమ అందుతుంది. చుండ్రు, జుట్టు తెల్లబడటానికి చెక్ పడుతుంది. తలలో దురద కూడా తగ్గుతుంది.
కొబ్బరి నీటితో జుట్టును కడగటం వల్ల జుట్టుకు కొత్త మెరుపు సంతరించుకుంటుంది. జుట్టు మెరుస్తూ కనిపిస్తుంది. తల పీహెచ్‌ని బ్యాలెన్స్ చేయడంలో కొబ్బరి నీరు బాగా సహాయ పడతాయి.
కొబ్బరి నీటితో జుట్టును అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల.. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. కొబ్బరి నీటిని తీసుకుని స్కాల్ఫ్‌పై మర్దనా చేయాలి. దీని వల్ల రక్త ప్రసరణ జరుగుతుంది. ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటే.. జుట్టు రాలడం అనేది అదుపు అవుతుంది. అంతే కాకుండా జుట్టు చిట్లడం కూడా తగ్గుతుంది.
జుట్టు అనేది ఒత్తుగా కనిపించేలా చేయడంలో కొబ్బరి నీరు బాగా సహాయ పడతాయి. కొబ్బరి నీటితో తలను కడుగుతూ ఉండటం వల్ల జుట్టుకు చిక్కులు అనేవి తక్కువగా పడతాయి. ఇది మాడును చల్లబరుస్తుంది. జుట్టుకు క్లెన్సింగ్‌గా పని చేస్తుంది. కొబ్బరి నీటిలో పొటాషియం, మెగ్నీషియంలు అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఎదిగేందుకు హెల్ప్ చేస్తాయి. కెమికల్స్ వల్ల కలిగే నష్టాన్ని దూరం చేస్తుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)