Gaining Weight: రాత్రి భోజనానికి, బరువు పెరగడానికి లింకేంటి? ఈ తప్పులు చేస్తున్నారేమో? వెంటనే సరిదిద్దుకోండి..
సాధారణంగా బరువు అదుపు చేయడానికి అందరూ చెప్పేది ఉదయం సమయంలో అల్పాహారం సక్రమంగా తీసుకోవాలని. కానీ మీరు చేసే రాత్రి భోజనం శరీర బరువుపై చాలా ఎక్కువ ప్రభావం చూపుతుందని చాలా మందికి తెలీదు.

ప్రస్తుత సమాజం అనుభవిస్తున్న అతి పెద్ద సమస్యల్లో ఊబకాయం కూడా ఒకటి. అనేక మంది ఉండాల్సిన దాని కన్నా అధికంగా బరువు పెరిగిపోతున్నారు. ఇది వ్యక్తుల జీవనశైలి, నిద్ర విధానాలు, తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి బరువు పెరిగితే దానిని అదుపు చేయడానికి చాలా కష్టపడాలి. వర్క్ అవుట్లు, డైట్లు అంటూ చాలా శ్రమించాల్సి ఉంటుంది. అప్పటికీ ఫలితం అంతంతమాత్రంగానే ఉంటుంది. సాధారణంగా బరువు అదుపు చేయడానికి అందరూ చెప్పేది ఉదయం సమయంలో అల్పాహారం సక్రమంగా తీసుకోవాలని. కానీ మీరు చేసే రాత్రి భోజనం శరీర బరువుపై చాలా ఎక్కువ ప్రభావం చూపుతుందని చాలా మందికి తెలీదు. ఇప్పుడు మీకు రాత్రి సమయంలో ఏం తినాలి? ఏం తినకూడదు? ఎంత తినాలి? ఏ సమయంలో తినాలి? వంటి అనుమనాలు, సందేహాలు వచ్చి ఉంటాయి. బరువు తగ్గడానికి అల్పాహారం సమయంలో మాత్రమే కాకుండా రాత్రి భోజనం సమయంలో కూడా స్మార్ట్ ఎంపికలు అవసరం. ఈ నేపథ్యంలో సాధారణంగా చాలా మంది రాత్రి ఆహారం విషయంలోచేసే తప్పులు, వాటి వల్ల కలిగే నష్టాలు, నివారణ పద్ధతులను మీకు ఇప్పుడు తెలుసుకుందాం..
రాత్రి భోజనం ఇలా ఉండకూడదు..
ఎక్కువగా తినొద్దు.. రాత్రి భోజనాన్ని వీలైనంత వరకూ లైట్ గా ఉంచడం మేలు. వాస్తవానికి రోజు గడిచేకొద్దీ, మన జీవక్రియ మందగిస్తుంది. నిజానికి జీర్ణ క్రియను ప్రోత్సహించే ప్రతి ఆహారం బరువు తగ్గడానికి ఉపకరిస్తుంది. ఈ విషయాన్ని పోషకాహార నిపుణులు సైతం చెబుతుంటారు. అందుకే రాత్రి భోజనంలో సలాడ్‌లు, సూప్‌లు లేదా కాల్చిన కూరగాయలు వంటి తేలికపాటి ఆప్షన్లు ఎంచుకోవడం వలన మీ బరువు అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది.
ఆలస్యంగా తినొద్దు.. త్వరగా రాత్రి భోజనం చేయడం వల్ల రాత్రిపూట ఎక్కువసేపు కడుపు ఖాళీగా ఉంటుంది, ఇది కొవ్వు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. రాత్రిపూట మన జీవక్రియ మందగిస్తూనే ఉంటుంది కాబట్టి, రాత్రి భోజనం ఎంత త్వరగా తీసుకుంటే, జీర్ణక్రియ పెరగడానికి అదే సమయంలో బరువు తగ్గడానికి అంత ఉపయుక్తంగా ఉంటుంది. అర్ధరాత్రి విందులు బరువు పెరగడానికి ప్రధాన కారణం.
నియంత్రణ అవసరం.. మీరు తినే ఆహారంలో నియంత్రణ అవసరం. కోర్కెలు చాలానే ఉంటాయి. కానీ ప్రతి దానికి పరిమితి ఉంటుంది. మీకు ఆరోగ్యకరమైనా వాటినే రాత్రి సమయంలో ఆహారంగా తీసుకోవాలి. తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తీసుకోవాలి. అధిక కేలరీలు ఉన్న ఆహారం తీసుకుంటే బరువు పెరిగేందుకు కారణమవుతుంది. అందుకోసం చిన్న ప్లేట్లను ఉపయోగించడం ఒక తెలివైన ట్రిక్. మీ ప్లేట్ పరిమాణం తగ్గినప్పుడు, మీ మెదడు దానిని పూర్తి ప్లేట్‌గా గ్రహిస్తుంది. మీరు తగినంతగా తినలేదనే భ్రమను నివారిస్తుంది. ఇది మీ అవసరాలకు తగిన భాగాన్ని తినమని మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది.
ప్రోటీన్, ఫైబర్ ఉండాలి.. సులభంగా బరువు తగ్గడానికి ప్రోటీన్, ఫైబర్ బాగా ఉపయోగపడతాయి. ఈ పోషకాలను నిర్లక్ష్యం చేయడం వల్ల మీ జీవక్రియ మందగిస్తుంది. ప్రోటీన్ థర్మిక్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది, అంటే కార్బోహైడ్రేట్లు, కొవ్వులతో పోలిస్తే ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని జీర్ణం చేయడానికి శరీరం అధిక శక్తిని వినియోగిస్తుంది. ప్రొటీన్, ఫైబర్ రెండూ మీకు ఎక్కువ కాలం కడుపు నిండుగా ఉండే అనుభూతిని కలిగిస్తాయి, అతిగా తినే సంభావ్యతను తగ్గిస్తాయి.
ఉప్పు తక్కువ తినండి.. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల రాత్రి సమయంలో శరీరంలో నీరు సక్రమంగా సర్కులేట్ కాదు. అందుకే అవకాశం ఉన్నంత వరకూ సోడియంను శరీరంలో తగ్గించాలి. దానికి ప్రత్యామ్నాయం ఎంచుకోవడం మేలు.
క్రీము సూప్‌లు వద్దు.. క్రీమీ సూప్‌లకు దూరంగా ఉండటం మంచిది. వెయిట్ లాస్ కోసం వెనిగర్ లేదా ఆలివ్ ఆయిల్ డ్రెస్సింగ్‌తో కూడిన గ్రీన్ సలాడ్‌తో కూడిన క్లియర్ వెజిటబుల్ లేదా చికెన్ సూప్‌లు మంచివి. ఇవి అధిక కేలరీలు లేకుండా పోషణను అందిస్తాయి.
పుల్లటి పదార్థాలతో నష్టం.. రాత్రి భోజనం సమయంలో పుల్లని ఆహార పదార్థాలతో జాగ్రత్తగా ఉండండి. రాత్రిపూట వెనిగర్, సాంబార్, కడి లేదా వేడి, పుల్లని సూప్ వంటి ఆహారాలు నీరు నిలుపుదలని కలిగిస్తాయి. బదులుగా, మితిమీరిన పులుపు లేదా ఉప్పు లేకుండా రుచుల సమతుల్య కలయికను అందించే ఆహారాలను ఎంచుకోండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..