Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Biryani Day: మన భాగ్యనగరం…బిర్యానీ కేపిటల్ ఆఫ్‌ ఇండియా..!

హైదరాబాద్ బిర్యానీకి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. దేశ విదేశాల నుంచి సెలబ్రిటీలు ఎవరు వచ్చినా హైదరాబాద్ బిర్యానీ రుచి చూడకుండా వెళ్లరు. సరైన రీతిలో చేసి, మితంగా తింటే బిర్యానీతో ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయని డైటీషియన్లు చెబుతున్నారు.

World Biryani Day: మన భాగ్యనగరం...బిర్యానీ కేపిటల్ ఆఫ్‌ ఇండియా..!
Hyderabad Biryani
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 07, 2024 | 6:34 PM

ఘుమఘుమలాడే హైదరాబాద్‌ బిర్యానీ వాసన గుప్పుమని తగిలితే.. రాహుల్‌ గాంధీ రాజకీయాలు మరిచిపోతారు. కింగ్‌ కోహ్లీ బ్యాటింగ్‌ మర్చిపోయి ఈటింగ్‌ కోసం పరుగులు పెడతాడు. హైదరాబాద్‌ బిర్యానీ అంటే సెలబ్రిటీలకే సెలబ్రిటీ. గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. బిర్యానీకి ఉండే క్రేజు, మోజు నెక్ట్స్‌ లెవెల్‌. అది రోజురోజుకు మరింత పెరుగుతోంది. ఇండియన్‌ ఈట్‌ స్ట్రీట్‌లో హైదరాబాద్‌ బిర్యానీ… రారాజుగా వెలుగుతోంది. బిర్యానీ డే సందర్భంగా…ప్రపంచానికే నోరూరించే మన భాగ్యనగరం బిర్యానీ కహానీని లొట్టలేస్తూ తెలుసుకుందాం పదండి…

దేశంలో అత్యధికంగా ఆస్వాదిస్తోన్న ఆహారంలో ఫస్ట్‌ ప్లేస్‌ బిర్యానీదే. ఇక దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇస్తున్న ప్రతి ఐదు బిర్యానీల్లో ఒకటి మన హైదరాబాద్‌దేనట. అంటే మన భాగ్యనగరాన్ని…బిర్యానీ కేపిటల్ ఆఫ్‌ ఇండియా అనొచ్చు. గత ఏడాది నగరంలో 13 మిలియన్ల బిర్యానీలు…అంటే కోటి 30 లక్షల బిర్యానీలను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేశారు. ఇక భాగ్యనగరంలో అమ్ముడయ్యే బిర్యానీల్లో తొలి స్థానం చికెన్‌ బిర్యానీది కాగా, రెండో స్థానం వెజ్‌ బిర్యానీది కావడం మరో విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో చికెన్‌ దమ్‌ బిర్యానీ, మటన్‌ బిర్యానీలు ఉన్నాయి. బిర్యానీ అనే పదం పర్షియన్‌ భాషలోని బిరింజ్‌ నుంచి పుట్టింది. దీని అర్థం రైస్‌. బిర్యానీ మన దేశానికి 1398లో పరిచయం అయ్యిందట. హైదరాబాద్‌ నిజామ్స్, లక్నో నవాబులు బిరియానీ అంటే లొట్టలేసేవారట. మొఘలుల కాలంలో తరచూ యుద్ధాల్లో పాల్గొనే సైనికుల కోసం చేసిన ప్రత్యేక వంటకం ఇదని చెబుతారు.

ఇక మన హైదరాబాదీ బిర్యానీ…దేశంలోని అత్యంత ప్రసిద్ధ, ఐకానిక్ బిర్యానీల్లో ఒకటి. ఇది అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. పొడవైన బాస్మతి బియ్యం, సుగంధ ద్రవ్యాల సంపూర్ణ సమ్మేళనంతో తయారయ్యే హైదరాబాద్‌ బిర్యానీ వరల్డ్‌ ఫేమస్‌గా మారింది. హైదరాబాద్‌ బిర్యానీని చికెన్ లేదా మటన్‌తో తయారు చేస్తారు. వేయించిన ఉల్లిపాయలు, ఉడికించిన గుడ్లతో బిర్యానీని తయారుచేస్తారు. ఈ బిర్యానీ రుచి చూడడానికి ఆహార ప్రియులు లొట్టలేస్తారు.

ఇక లక్నో బిర్యానీ, కోల్‌కతా బిర్యానీ, మలబార్ బిర్యానీ, సింధీ బిర్యానీ లాంటివి దేశంలో చాలా ఉన్నా…బిర్యానీల్లో కింగు, టేస్టులో బెస్టు మాత్రం మన హైదరాబాద్‌దే అంటారు ఫుడ్‌ లవర్స్‌. ఇక బిర్యానీ డే సందర్భంగా నగరంలోని చాలా ప్రాంతాల్లో స్పెషల్ డిష్‌ బిర్యానీని పేదలకు ఉచితంగా అందించాయి కొన్ని హోటల్స్‌. ఈ డిష్‌కు క్రేజ్‌ పెరగడంతో గల్లీ హోటల్స్‌ నుంచి ఫైవ్‌ స్టార్‌ రెస్టారెంట్స్‌ వరకు బిర్యానీ అమ్మకాలు అమాంతంగా పెరిగిపోయాయంటున్నారు వ్యాపారులు. అనేక రకాల బిర్యానీలను జనం టేస్టుకు తగ్గట్లు తీసుకొస్తున్నామంటున్నారు పిస్తా హౌస్‌ ఓనర్‌ మహ్మద్ అబ్దుల్‌ మజీద్‌.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..