Winter Health: వింటర్‌లో హెల్దీగా, హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా..? అయితే, ఈ సూపర్ ఫుడ్స్ తినండి చాలు..
శీతాకాలంలో మానసిక మార్పులు, బద్దకం సర్వసాధారణం. చలికాలంలొ ఒళ్ళు బద్దకంగా మారుతూ ఉంటుంది. దీన్నే మూడ్ చేంజింగ్ అంటారు. మిగతా కాలలతో పోలిస్తే వింటర్ (శీతాకాలం)లో ఎక్కువ మంది ఉదయాన్నే మూడు స్వింగ్స్ ఎదుర్కొంటారు. అలాంటి వారు ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా.. ఈ సమస్యలను అధిగమించవచ్చు..
చలికాలం వచ్చిందంటే ఒళ్ళు బద్దకంగా మారుతూ ఉంటుంది. దీన్నే మూడ్ చేంజింగ్ అంటారు. మిగతా కాలలతో పోలిస్తే వింటర్ (శీతాకాలం)లో ఎక్కువ మంది ఉదయాన్నే మూడు స్వింగ్స్ ఎదుర్కొంటారు. ఎక్సర్‌సైజ్ చేయకపోవడం లేదా చేస్తున్న వ్యాయామాన్ని తగ్గించడం, మార్నింగ్ ఎండ తగలకపోవడంతో విటమిన్ డి లోపించడం దీనికి కారణాలు.. ఒంటరిగా ఉండే వారైతే మరింత ఎక్కువగా మానసిక ఇబ్బందులను ఎదుర్కొనే ఛాన్సెస్ ఉంటాయి. దిగాలుగా అనిపించడం, చిన్న విషయానికి అతిగా ఊహించుకొని బాధపడటం.. ఆందోళన, కోపం లాంటివి కనిపిస్తాయి.. ఇలాంటివన్నీంటికి చెక్ పెట్టడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం బెటర్ అంటున్నారు మానసిక ఆరోగ్య నిపుణులు. వింటర్ లో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫ్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల్లో డార్క్ చాక్లెట్ ఒకటి. దీనిని తినడం వల్ల బాడీలో సెరటోనిన్ హార్మోన్ లెవెల్ పెరుగుతుంది. ముఖ్యంగా చలికాలంలో తినడం వల్ల ఒత్తిడి ఆందోళన ఒంటరితనం వంటి భావాల నుంచి బయటపడవచ్చు. నేరుగా తినడానికి ఇష్టపడని వారు కోచ్ కాఫీ హెల్తీ డ్రింక్స్ లలో దీనిని కలుపుకొని తీసుకోవచ్చు. దీనివల్ల మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా మారుతుంది.
శరీరానికి మేలు చేసే పోషకాలకు మూలమైన బాదం, జీడిపప్పు వాల్నట్స్, గుమ్మడి విత్తనాలు, సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇతర తినగలిగే కాయగూరల గింజలు ఆహారంలో భాగంగా తీసుకుంటే మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ మినరల్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి హ్యాపీనెస్ ని పెంచుతాయి.
ప్రతి సీజన్లో అందుబాటులో ఉండటంతోపాటు.. పోషకాలు కలిగిన అరటిపండులో విటమిన్ B6 ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో తరచుగా తినడం వల్ల ఫీల్ గుడ్ హార్మోన్లు ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో సంతోషంగా ఉండగలుగుతారు.
ఓట్స్‌లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి దీనిని ఆహారంగా తీసుకుంటే నీరసం, బద్ధకం తొలిగిపోతుంది. మానసిక పరిస్థితి మెరుగుపడుతుంది.
బ్యాడ్ మోడ్ స్వింగ్స్ ను పోగొట్టే ముఖ్యమైన ఆహారాల్లో చేపలు (సీ ఫుడ్ -ఫిషెస్) కూడా ముఖ్యమైనవి. ముఖ్యంగా సాల్మన్, టూనా వంటి చేపల్లో ఒమేగా3ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..