AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్ వండేటప్పుడు మీరు చేసే పెద్ద తప్పు ఇదే.. ఏం జరుగుతుందో తెలిస్తే మైండ్ బ్లాంకే..

మీరు నాన్‌వెజ్ ప్రియులా? మార్కెట్ నుండి తెచ్చిన చికెన్‌ను వండే ముందు రెండు మూడు సార్లు కడిగితేనే కానీ మనసు ఒప్పదా? అయితే ఆగండి.. మీరు చేస్తున్న ఆ పనే మీ కుటుంబ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తోంది. చికెన్‌ను కడగడం వల్ల బ్యాక్టీరియా నశించకపోగా, అది మీ వంటగది అంతా విషపూరితంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చికెన్ వండేటప్పుడు మీరు చేసే పెద్ద తప్పు ఇదే.. ఏం జరుగుతుందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
Washing Raw Chicken Side Effects
Krishna S
|

Updated on: May 09, 2026 | 8:18 AM

Share

చాలామంది ఇళ్లలో మార్కెట్ నుండి చికెన్ తీసుకురాగానే, దానిని రెండు మూడు సార్లు నీళ్లతో శుభ్రంగా కడగడం ఒక అలవాటు. ఇలా చేయడం వల్ల మాంసంపై ఉన్న బ్యాక్టీరియా నశిస్తుందని, చికెన్ శుభ్రపడుతుందని భావిస్తారు. కానీ ఆరోగ్య నిపుణులు, అంతర్జాతీయ సంస్థలు చెబుతున్న నిజం దీనికి భిన్నంగా ఉంది. వండే ముందు చికెన్‌ను కడగడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని, ఇది ప్రాణాంతక బ్యాక్టీరియా వ్యాప్తికి కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు.

కడగడం వల్ల వచ్చే ముప్పు ఏమిటి..?

పచ్చి చికెన్‌లో క్యాంపిలోబాక్టర్, సాల్మొనెల్లా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. మీరు చికెన్‌ను పారే నీటి కింద పెట్టి కడిగినప్పుడు, ఆ నీటి తుంపర్లు మీ వంటగదిలోని సింక్, పాత్రలు, కౌంటర్ టాప్‌లు మరియు పక్కనే ఉన్న ఇతర ఆహార పదార్థాలపై పడతాయి. ఈ ప్రక్రియ వల్ల బ్యాక్టీరియా చనిపోకపోగా, వంటగది అంతా వ్యాపిస్తుంది.

CDC ఏమంటోంది..?

CDC నివేదికల ప్రకారం, పచ్చి కోడి మాంసాన్ని కడగడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.

  • పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులకు ఇది మరింత హానికరం.
  • ఇది ఫుడ్ పాయిజనింగ్, కడుపునొప్పి మరియు విరేచనాలకు దారితీస్తుంది.
  • నీరు బ్యాక్టీరియాను చంపలేదు, కేవలం వ్యాప్తి మాత్రమే చేస్తుంది.

మరి బ్యాక్టీరియాను వదిలించుకోవడం ఎలా?

చికెన్‌లోని బ్యాక్టీరియా నశించాలంటే దానికి నీరు కాదు, అధిక ఉష్ణోగ్రత అవసరం.

సరైన ఉష్ణోగ్రత: చికెన్‌ను కనీసం 75°C ఉష్ణోగ్రత వద్ద పూర్తిగా ఉడికించాలి. ఈ వేడికి మాంసంలోని బ్యాక్టీరియా పూర్తిగా నశిస్తుంది.

నిల్వ జాగ్రత్తలు: పచ్చి చికెన్‌ను ఫ్రిజ్‌లో ఇతర ఆహార పదార్థాలకు తగలకుండా, విడిగా మూత ఉన్న పాత్రలో భద్రపరచాలి.

ఒకవేళ కడగాల్సి వస్తే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

మీరు తప్పనిసరిగా చికెన్ కడగాలి అనుకుంటే, ఈ కింది పద్ధతులు పాటించండి..

శుభ్రత: చికెన్ కడిగిన వెంటనే సింక్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలను వేడి నీరు, సబ్బుతో క్షుణ్ణంగా శుభ్రం చేయండి.

చేతుల శుభ్రత: చికెన్‌ను తాకిన తర్వాత కనీసం 20 సెకన్ల పాటు మీ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.

క్రాస్ కంటామినేషన్: చికెన్ కోసం వాడే చాకులను, కటింగ్ బోర్డులను ఇతర కూరగాయలకు వాడకండి.

ఆరోగ్యం కోసం చికెన్ తింటున్నప్పుడు, అది అనారోగ్యానికి కారణం కాకుండా చూసుకోవడం మన బాధ్యత. వండే ముందు కడగడం కంటే, సరిగ్గా ఉడికించడమే అసలైన శుభ్రత అని గుర్తించండి.

Follow Us
చికెన్ వండేటప్పుడు మీరు చేసే పెద్ద తప్పు ఇదే.. ఏం జరుగుతుందో..
చికెన్ వండేటప్పుడు మీరు చేసే పెద్ద తప్పు ఇదే.. ఏం జరుగుతుందో..
పార్ట్నర్‌షిప్‌లో బిజినెస్‌.. ఈ విషయాల్లో జాగ్రత్త!
పార్ట్నర్‌షిప్‌లో బిజినెస్‌.. ఈ విషయాల్లో జాగ్రత్త!
ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా
ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా
షాకింగ్.. ఇక్కడ కేజీ జీడిపప్పు కేవలం రూ. 50 మాత్రమే..ఎక్కడంటే
షాకింగ్.. ఇక్కడ కేజీ జీడిపప్పు కేవలం రూ. 50 మాత్రమే..ఎక్కడంటే
శనివారం ఇలా చేస్తే ఇంట్లోకి శుభాలు వస్తాయి.. కానీ ఇవి అస్సలు..
శనివారం ఇలా చేస్తే ఇంట్లోకి శుభాలు వస్తాయి.. కానీ ఇవి అస్సలు..
బుధుడు అనుగ్రహంతో వీరికి అష్టకష్టాలు తొలిగి గుడ్ న్యూస్‎లు..
బుధుడు అనుగ్రహంతో వీరికి అష్టకష్టాలు తొలిగి గుడ్ న్యూస్‎లు..
SBI షేర్లు ఎందుకు పడిపోయాయి?
SBI షేర్లు ఎందుకు పడిపోయాయి?
గ్యాస్ స్టవ్ మంట తక్కువగా వస్తోందా.. ఇలా చేస్తే నిమిషాల్లో..
గ్యాస్ స్టవ్ మంట తక్కువగా వస్తోందా.. ఇలా చేస్తే నిమిషాల్లో..
మే 11 నుంచి నిజకర్తరి.. శుభకార్యాలకు బ్రేక్..! ఈ తప్పులు చేయకండి
మే 11 నుంచి నిజకర్తరి.. శుభకార్యాలకు బ్రేక్..! ఈ తప్పులు చేయకండి
బీట్‌రూట్ జ్యూస్ వీరికి విషంతో సమానం.. తాగితే ఆ సమస్యలు..
బీట్‌రూట్ జ్యూస్ వీరికి విషంతో సమానం.. తాగితే ఆ సమస్యలు..
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌