మామిడి పండ్లను చూస్తే క్షణమైనా ఆగలేం.. వాటి రుచిని ఆస్వాదించే దాకా మనసు మనసులో ఉండదు. అయితే ఆ ఆతృతే వద్దంటున్నారు నిపుణులు. ఈ పండ్లను తినే ముందు కొన్ని విషయాలు తప్పక గుర్తుకోవాలట
TV9 Telugu
మామిడిలో ‘ఎ’, ‘సి’, ‘ఇ’, ‘కె’, ‘బి6’ విటమిన్లతో పాటు ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. బాగా పండిన మామిడి పండ్లు అద్భుతమైన రుచులతో అలరిస్తుంటాయి
TV9 Telugu
అయితే కొందరికి ఎక్కువగా మామిడి పండ్లు తినడం హానికరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్రీ-డయాబెటిస్ ఉన్న మధుమేహం ఉన్నవారు ఎక్కువగా మామిడిపండ్లు తినడం మానుకోవాలి
TV9 Telugu
మామిడిపండ్లలో సహజ చక్కెరలు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగడానికి కారణమవుతాయి. మధుమేహం ఉన్నవారు ఎక్కువగా మామిడిపండ్లు తినడం మానుకోవాలి
TV9 Telugu
అలాగే బరువు తగ్గాలనుకునేవారు మామిడి పండ్లను మితంగా తినాలి. ఎక్కువగా మామిడి పండ్లు తినడం వల్ల కేలరీల వినియోగం పెరిగి, బరువు పెరగడానికి దారితీస్తుంది
TV9 Telugu
మామిడి పండు తిన్న తర్వాత కొంతమందికి దురద, దద్దుర్లు, గొంతులో చికాకు వంటి అలెర్జీ ప్రతిచర్యలు కలగవచ్చు. అటువంటి వారు వైద్యుడిని సంప్రదించకుండా మామిడి పండును తినకూడదు
TV9 Telugu
గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పితో బాధపడేవారు ఎక్కువగా మామిడి పండ్లు తినడం మానుకోవాలి. ఎక్కువగా మామిడి పండ్లు తినడం వల్ల జీర్ణ సమస్యలు పెరగవచ్చు
TV9 Telugu
మూత్రపిండాల వ్యాధి ఉన్నవారు కూడా మామిడి పండ్లను పరిమితంగా తినాలి. మామిడి పండ్లలో ఉండే పొటాషియం కిడ్నీ రోగులకు హానికరం. అలాగే అధిక శరీర వేడి, నోటి పుండ్లు, మొటిమలతో బాధపడేవారికి, మామిడి పండ్లను ఎక్కువగా తినడం వల్ల వారి సమస్యలు మరింత తీవ్రమవుతాయి. అందువల్ల, వాటిని మితంగా తినాలి