Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మామిడి పండ్లు మిస్‌ చేసుకోకండి..! అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..

మామిడి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్నాయి. ఇది ఫ్రీ రాడికల్స్ ప్రభావాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. చర్మ కణాలు దెబ్బతినకుండా నివారిస్తుంది. మామిడి పండ్లలో ఉండే ఫైబర్ కంటెంట్ మిమ్మల్ని ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచడంలో సహాయ పడుతుంది. ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ మామిడి పండ్లను ఎల్లప్పుడూ మితంగా తినటం మంచిది అంటున్నారు నిపుణులు.

మామిడి పండ్లు మిస్‌ చేసుకోకండి..! అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..
Mangoes
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 09, 2025 | 8:52 PM

వేసవి అంటేనే మామిడి పండ్లకు సీజన్‌..నోరూరించే మామిడి పండ్ల కోసం ఏడాది అంతా ఎదురు చూస్తుంటారు చాలా మంది. అందుకే మామిడి పండును పండ్లలో రారాజుగా పిలుస్తారు. మామిడి పండ్లు రుచికరంగా ఉండటమే కాకుండా శరీరానికి కూడా అనేక ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి. కేవలం రుచి కోసం మాత్రమే కాదు.. మామిడి పండ్ల వల్ల బోలెడన్నీ లాభాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

మామిడి పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఉబ్బరం, మలబద్ధకం, అజీర్ణం వంటి జీర్ణ రుగ్మతల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మామిడి పండ్లలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి. మామిడి పండ్లలో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించడానికి, ఆరోగ్యకరమైన హృదయనాళ వ్యవస్థకు తోడ్పడతాయి.

మామిడి పండ్లలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది మంచి దృష్టికి అవసరం. వయస్సు సంబంధిత కంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. మామిడి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్నాయి. ఇది ఫ్రీ రాడికల్స్ ప్రభావాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది. చర్మ కణాలు దెబ్బతినకుండా నివారిస్తుంది. మామిడి పండ్లలో ఉండే ఫైబర్ కంటెంట్ మిమ్మల్ని ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచడంలో సహాయ పడుతుంది. ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ మామిడి పండ్లను ఎల్లప్పుడూ మితంగా తినటం మంచిది అంటున్నారు నిపుణులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…