Watermelon: అమ్మబాబోయ్.. పుచ్చకాయ మీద ఉప్పు చల్లుకుని తింటున్నారా.. వారికి డేంజర్
సమ్మర్ లో పుచ్చకాయ తినడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. పుచ్చకాయ మీద కాసింత ఉప్పు, మిరియాల పొడి చల్లుకుని చల్లచల్లగా లాగించేస్తే ఆ మజానే వేరు. కానీ, ఈ పండును కొన్ని పదార్థాలతో అస్సలు కలిపి తినకూడదని నిపుణులు చెప్తున్నారు. ఉప్పు పుచ్చకాయ రుచిని పెంచేస్తుంది. ఈ పండులోని నీటిని పైకి వచ్చేలా చేసి దీని రుచిని మరింత పెంచేస్తుంది. కానీ, ఉప్పును ఈ ముక్కలపై చల్లడం డేంజరేనట. ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పుచ్చకాయను ఇలా తినకూడదని చెప్తున్నారు.

పుచ్చకాయ ప్రయోజనాలు తెలియనివారుండరు. మండే వేసవిలో కూడా కడుపులో చల్లదనాన్ని ఇచ్చే పుచ్చకాయలో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. రుచితో పాటు హెల్త్ బెనిఫిట్స్ కలిగిన పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. అలా అందరూ ఇష్టపడే ఈ పండు వేసవిలో వచ్చే ఎన్నో సమస్యలను నివారిస్తుంది. శరీరం డీహైడ్రేట్ కాకుండా చేస్తుంది. అయితే, డయాబెటిస్ ఉన్నవారు పుచ్చకాయ తినడం గురించి జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు పుచ్చకాయ తినవచ్చా లేదా అనేది తెలుసుకోవడానికి, పుచ్చకాయ పోషక విలువలు, గ్లైసెమిక్ ఇండెక్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు. అయితే దీనిని తినడం వల్ల వచ్చే పలురకాల సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా తెలుసుకోండి.
అధిక చక్కెర స్థాయిలు
పుచ్చకాయలో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. మధుమేహం, ఇన్సులిన్ నిరోధకత ఉన్నవారు ఎక్కువగా తింటే వారి రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికే షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు పుచ్చకాయను చాలా మితంగా మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఫైబర్ అధికంగా ఉంటుంది
పుచ్చకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అయితే, అతిగా తినడం వల్ల కొంతమందిలో విరేచనాలు, కడుపు నొప్పి మరియు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
కడుపు ఉబ్బరం
పుచ్చకాయలో 90% నీళ్లు ఉంటాయి. ఇది తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. పుచ్చకాయలో ఫ్రక్టోజ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. ఈ పండు తిన్న వెంటనే పాలు తీసుకోవడం మంచిది కాదు. ఇది కూడా పొట్టలో గ్యాస్ ను పెంచేస్తుంది.
ఇలా తింటే డేంజరే..
పుచ్చకాయలో ఉప్పు కలపడం వల్ల శరీరంలో సోడియం పరిమాణం పెరుగుతుంది. అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉన్నవారికి ఇది ఒక సమస్య కావచ్చు. బిపి ఉన్నవారు ఉప్పు తక్కువగా తీసుకోవడం మంచిది.
అతి చల్లదనం..
పుచ్చకాయ శరీరాన్ని చల్లబరుస్తుంది. కానీ కొంతమందికి ఇది పడకపోవచ్చు. ఇందులో ఉండే చల్లదనం కారణంగా జ్వరం, దగ్గు మరియు గొంతు నొప్పి వంటి జలుబు సంబంధిత సమస్యలను కలిగిస్తుంది.
రక్తపోటు..
పొటాషియం అధికంగా ఉండటం వల్ల, ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే, తక్కువ రక్తపోటు (లో బిపి) ఉన్నవారికి, ఇది తలనొప్పి, తలతిరగడానికి కారణమవుతుంది.
ఆమ్లత్వం..
పుచ్చకాయను కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే, అది కడుపులో చికాకు, ఆమ్లత్వం మరియు అజీర్ణం వంటి సమస్యలను కలిగిస్తుంది. అందుకే పుచ్చపండు తిన్న తర్వాత 30 నిమిషాల వరకు ఏమీ తినకూడదు. పాల లాంటి పదార్థాలు అస్సలు తీసుకోకూడదు.
అధిక హైడ్రేషన్ ప్రమాదం
పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి దీనిని ఎక్కువగా తినడం వల్ల రక్తంలో సోడియం స్థాయిలు తగ్గుతాయి. కొందరిలో దీనివల్ల తల తిరగడం, మూర్ఛపోవడం వంటి ప్రభావాలు ఏర్పడతాయి.




