ప్రస్తుత కాలంలో ఆరోగ్య సమస్యలనేవి వయసుతో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తున్నాయి. ఇందుకు మనం పాటిస్తున్న కొన్ని రకాల ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమని చెప్పుకోవాలి. అయితే మనల్ని వెంటాడుతున్న ఆరోగ్య సమస్యలలో అధిక రక్తపోటు కూడా ఒకటి. గుండె ధమనులను దెబ్బతీయడం, గుండెకు రక్తం, ఆక్సిజన్ ప్రసరణను తగ్గించడంతోపాటు ప్రసరణ వ్యవస్థపై అధిక రక్తపోటు అనేది ప్రభావం చూపుతుంది. మూత్రపిండాలతో అనుసంధానమై ఉండే రక్త నాళాలను కూడా అధిక రక్తపోటు దెబ్బతీస్తుంది. హైబీపికి సరైన ట్రీట్‌మెంట్ లేనప్పటికీ మన ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో కొన్ని రకాల మార్పులను చేసుకోవడం ద్వారా దీనిని నియంత్రించవచ్చు. అంతకంటే ముందే ఈ సమస్యను నిరోధించవచ్చు.
ఆరోగ్యవంతమైన జీవన విధానం, చక్కని డైట్‌ను పాటించడం వల్ల హైబీపీని నిరోధించవచ్చు. రక్తపోటు సమస్య నుంచి బయటపడేందుకు లేదా నిరోధించేందుకు కొందరు ఆహార పదార్థాల్లో ఉప్పును తగ్గించుకుంటుంటారు. ఈ విధంగా చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. అలాగే కొన్ని ఆహార పదార్థాలు అధిక రక్తపోటును నిరోధించడమే కాక నియంత్రిస్తాయి. పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల హైబీపీ నియంత్రణలోకి వస్తుంది. ఈ క్రమంలో హైబీపీని నిరోధించగలిగే ఆహారాలు కూడా కొన్ని ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..