AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spring Rolls: బజ్జీ, పకోడీలు బోర్ కొట్టాయా.. స్వీట్ కార్న్ స్ప్రింగ్ రోల్స్ ట్రై చేయండి.. రెసిపీ ఏమిటంటే..

వర్షాకాలంలో చల్ల చల్లని వాతారణంలో వేడి వేడి టీ తాగుతూ టేస్టీ టేస్టీ స్నాక్స్ తినడం చాలా మందికి ఇష్టం. ఈవినింగ్ స్నాక్స్ వేడి వేడి బజ్జీలు, పకోడీ, సమోసా, కారపూస వంటి వాటిని తింటారు. అయితే, ఎప్పుడూ ఇవేనా అంటూ మనసు మారం చేస్తుంది. అటువంటి సమయంలో ఈ సీజన్ లో కారం కారంగా ఏదైనా తినాలనుకుంటే స్ప్రింగ్ రోల్స్ ని ట్రై చేయండి. వీటి రుచి అందరికీ నచ్చుతుంది. రెసిపీ ఏమిటంటే..

Spring Rolls: బజ్జీ, పకోడీలు బోర్ కొట్టాయా.. స్వీట్ కార్న్ స్ప్రింగ్ రోల్స్ ట్రై చేయండి.. రెసిపీ ఏమిటంటే..
Sweet Corn Spring Rolls
Surya Kala
|

Updated on: Sep 02, 2025 | 3:58 PM

Share

చైనీస్ సంప్రదాయం ఆహారం స్ప్రింగ్ రోల్స్. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆదరణ సొంతం చేసుకున్నాయి. స్ప్రింగ్ రోల్స్ ను వెజ్ , నాన్ వెజ్ రెండు రకాలుగా చేసుకోవచ్చు. స్ప్రింగ్ రోల్ ని కూరగాయలు, మాంసం లేదా రొయ్యల ఫిల్లింగ్ తో చేసుకునే ఒక క్రంచీ స్నాక్. ఇది చైనీస్ వసంతకాల పండుగతో ముడిపడి ఉంది. దీనిని డీప్ ఫ్రై చేసి లేదా వేయించకుండా కూడా తయారు చేసుకోవచ్చు. అంతేకాదు లంచ్ లేదా డిన్నర్‌లో సైడ్ డిష్‌గా వడ్డించవచ్చు, ఫ్రైడ్ రైస్, స్టైర్-ఫ్రైడ్ నూడుల్స్ లేదా లైట్ సూప్ వంటి వంటకాలతో పాటుగా తినొచ్చు. వర్షాకాలంలో స్ప్రింగ్ రోల్స్ ను టీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. రెసిపీ ఏమిటంటే..

కావాల్సిన పదార్దాలు:

  1. మైదా పిండి- ఒక కప్పు
  2. కార్న్‌ఫ్లోర్ – రెండు టేబుల్ స్పూన్లు
  3. స్వీట్ కార్న్ – ఒక కప్పు (ఉడికించి)
  4. క్యాబేజీ – 1 కప్పు (తురిమినది)
  5. క్యారెట్- అర కప్పు (తురిమినది)
  6. కాప్సికమ్ -అర కప్పు (సన్నగా తరిగినది)
  7. ఉల్లిపాయ (సన్నగా తరిగినది) 1 మీడియం
  8. అల్లం-వెల్లుల్లి పేస్ట్- ఒక టీస్పూన్
  9. సోయా సాస్- ఒక టేబుల్ స్పూన్
  10. పచ్చిమిర్చి సాస్- ఒక టీస్పూన్
  11. టమాటా సాస్- ఒక టేబుల్ స్పూన్
  12. మిరియాల పొడి- అర టీస్పూన్
  13. నూనె- రెండు టేబుల్ స్పూన్లు
  14. ఉప్పు- రుచికి సరిపడా
  15. నూనె- వేయించడానికి సరిపడా

తయారీ విధానం:

  1. ముందుగా మైదా, మొక్కజొన్న పిండి, కొంచెం ఉప్పు కలిపి కొంచెం నీరు పోసి పిండి సిద్ధం చేయండి.
  2. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ పాన్ మీద కొంచెం పిండి పోసి సన్నని చపాతీగా కాల్చండి.
  3. ఇలా 8 నుంచి 10 షీట్లను సిద్ధం చేయండి.
  4. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేసి వేడి చేయండి.
  5. వేడి నూనెలో అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి తేలికగా వేయించాలి.
  6. ఇప్పుడు వేయించిన స్వీట్ కార్న్, క్యారెట్లు, క్యాబేజీ, క్యాప్సికమ్ వేసి రెండు మూడు నిమిషాలు హై ఫ్లేమ్ మీద వేయించాలి.
  7. సోయా సాస్, పచ్చిమిర్చి సాస్, టమాటో సాస్, ఉప్పు, కారం వేసి కలపాలి.
  8. ఇప్పుడు గ్యాస్ ఆపివేసి ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోండి.
  9. దీని తరువాత ఒక షీట్ తీసుకొని దాని మధ్యలో స్టఫింగ్ ఉంచండి.
  10. ఆ తర్వాత ఆ షీట్ ని రోల్ చేసి.. చివర అంచులను తడి చేసి స్టఫింగ్ బయటకు రాకుండా మూసివేసి, రోల్ చేయండి. ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి.
  11. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి.. నూనె పోసి వేడి చేయండి. ఆ నూనెలో స్టఫింగ్ చేసిన రోల్స్ ను వేసి బంగారు రంగు వచ్చేవరకు.. క్రిస్పీగా అయ్యేవరకు వేయించండి.
  12. అంతే కార్న్ స్ప్రింగ్ రోల్స్‌ రెడీ. వీటిని చిల్లీ సాస్ లేదా టమోటా సాస్‌తో సర్వ్ చేయండి. పిల్లలు , పెద్దలు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తింటారు.
ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..