Recipe: మిగిలిపోయిన అన్నాన్ని పడేస్తున్నారా.? వేడి వేడి రైస్ సమోసా చేశారంటే ఎవరైనా ఇష్టపడాల్సిందే.
సాధారణంగా ఇంట్లో మిగిలిపోయిన అన్నాన్ని పడేస్తుంటారు. లేదా ఫ్రైడ్ రైస్‌గా చేసుకొని తింటుంటారు. అయితే రైస్‌తో సమోసాలు చేస్తే ఎలా ఉంటుంది.? అదేంటి సమోసాలు ఆలుతోతో చేస్తారు కానీ రైస్‌తో ఎలా అనేగా మీ సందేహం. అయితే మనసుండాలే కానీ..
సాధారణంగా ఇంట్లో మిగిలిపోయిన అన్నాన్ని పడేస్తుంటారు. లేదా ఫ్రైడ్ రైస్‌గా చేసుకొని తింటుంటారు. అయితే రైస్‌తో సమోసాలు చేస్తే ఎలా ఉంటుంది.? అదేంటి సమోసాలు ఆలుతోతో చేస్తారు కానీ రైస్‌తో ఎలా అనేగా మీ సందేహం. అయితే మనసుండాలే కానీ మిగిలిపోయిన అన్నంతో కూడా వేడి వేడి సమోసాలు చేసుకోవచ్చు. అసలే చలికాలం, సాయంత్రం పూట కరకరమనే సమోసాలు తింటే ఆ మజానే వేరుగా ఉంటుంది. ఇంతకీ రైస్ సమోసాలను ఎలా తయారు చేసుకోవాలి.? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకోసం..
కావాల్సిన పదార్థాలు..
* మైదా పిండి ఒక కప్పు
* వండిన అన్నం ఒక కప్పు
* వెన్న 1/2 టేబుల్ స్పూన్
* నెయ్యి – ఒక టేబుల్ స్పూన్
* తరిగిన పచ్చి ఉల్లిపాయలు 1/4 కప్పు
* చిల్లీ సాస్ – ఒక టేబుల్ స్పూన్
* నూనె వేయించడానికి
* ఉప్పు రుచికి తగినంత
తయారీ విధానం..
* ముందుగా వండించిన అన్నాని పక్క పెట్టుకోవాలి.
* అనంతరం పచ్చి ఉల్లిపాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కులగా కట్ చేసుకోవాలి.
* తర్వాత బాణీలో వెన్న వేసుకొని మీడియం మంట మీద వేడి చేయాలి.
* వెన్న కరిగిన తర్వాత అందులో తరిగిన ఉల్లిపాయలు వేసి 1.30 నిమిషం వరకు వేయించాలి.
* అనంతరం ఉడికించిన అన్నం, చిల్లీసాస్, ఉప్పు వేసి బాగా కలపాలి. అన్నం మెత్తగా మారేంత వరకు కలుపుతూ ఉండాలి. దీంతో సమోసాలో స్టఫింగ్ సిద్ధమైనట్లే.
* అనంతరం సమోసాలను తయారు చేయడానికి ఒక గిన్నెలో మైదా పిండి తీసుకొని చెటికెడు ఉప్పు, కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలపాలి.
* పిండి మెత్తగా అయిన తర్వాత దానిపై కాటన్ క్లాత్‌ను వేసి 15 నిమిషాలు అలాగే ఉండనివ్వాలి.
* అనంతరం పిండిని సమోసాలకు వీలుగా కోన్ ఆకారంలో సిద్ధం చేసుకోవాలి.
* చివరిగా అందుకు ముందు రైస్‌తో తయారు చేసుకున్న స్టఫింగ్‌ను నింపేయాలి.
* సమోసాను పైభాగంలో నీటిని అంటించి అన్ని వైపులు మూసేయాలి.
* తర్వాత ఒక బాణీలో నూనె వేసుకొని వేడి చేయాలి. అనంతరం సమోసలను అందులో వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయిస్తే సరి. రుచికరమైన సమోసలు రడీ అయినట్లే.
మరిన్ని ఫుడ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..