తినే ఆహారంలో ఎన్నో రకాలున్నాయి. అలాగే విభిన్న రుచులను ఇష్టపడేవారు ఉంటారు. కొందరు మాంసాహారులు మరికొందరు శాఖాహారులు ఇలా భిన్నమైన ఆహారపు అలవాట్లు కలవారు ఉన్నారు. అయితే శాఖాహారులు కూడా ఇష్టంగా తినే ఆహారంలో పుట్టగొడులు కూడా ఒకటి. ఇవి మాంసాహారంతో సమానం.. ఎన్నో పోషక విలువలు కలిగి ఉన్న పుట్టగొడుగుల్లో మాంసకృత్తులు అధికంగా ఉన్నాయి. దీంతో పోషక లోపముతో బాధపడుతున్న మహిళలకు, చిన్న పిల్లలకు ముఖ్యంగా మధుమేహం వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారం పుట్టగొడులు..వీటితో కూరలు, బిర్యానీ వంటి వాటిని తయారు చేస్తారు. ఈ రోజు రుచికరమైన పుట్టగొడులు జీడిపప్పు బిర్యానీ తయారీ గురించి తెల్సుకుందాం..
పుట్టగొడుగులు-
బాస్మతీ బియ్యం – 1 కప్పు
జీడిపప్పు –
కొబ్బరి పాలు – 1 / 2 కప్పు
పెరుగు – కొంచెం
ఉల్లిపాయలు – 2
పచ్చి మిర్చి – నిలువుగా కట్ చేసిన ముక్కలు
టొమాటోలు – 2
అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం
జీలకర్ర పొడి
ధనియాల పొడి
మిరియాల పొడి
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – తగినంత
నెయ్యి – 4 స్పూన్లు
పసుపు – కొంచెం
కారం – సరిపడా
సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేయించినవి
పుదీనా కొంచెం
కొత్తిమీర కొంచెం
మసాలా దినుసులు
దాల్చిన చెక్క
లవంగాలు
యాలకులు
అనాసపువ్వు
బిర్యానీ ఆకు
జాపత్రి
సోంపు
బిర్యానీ తయారు చేసే విధానం: ముందుగా పుట్టగొడుగులను శుభ్రం చేసి నీటితో కడిగి నాలుగు భాగాలుగా కట్ చేయండి. తర్వాత ఆ పుట్ట గొడుగు ముక్కలను ఒక గిన్నెలో వేసి అందులో పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ చేయండి. తర్వాత వేయించిన ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన కొత్తిమీర వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ఒక పక్కన పెట్టాలి. ఒక అరగంట నానబెట్టాలి. ఇపుడు కొబ్బరి ముక్కలను పాలు తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఒక కప్పు రైస్ కు రెండు కప్పుల కొబ్బరి పాలు రెడీ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ తీసుకుని అందులో నెయ్యి , నూనె వేసి వేడి చేసి .. ముందుగా మసాలా దినుసులు వేసుకుని వేయించుకోవాలి. అందులో జీడిపప్పు వేసి వేయించి నిలువగా కట్ చేసిన పచ్చి మిర్చి ముక్కలు, నిలువుగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. అనంతరం కట్ చేసిన టామాటా ముక్కలు వేసి బాగా వేయించాలి. ఇప్పుడు కొంచెం కారం, మ్యారినేట్ పక్కన పెట్టుకున్న పుట్టగొడుగు ముక్కలను వేసి వేయించి పాన్ పై మూత పెట్టి కొంచెం సేపు ఉడికించాలి. అనంతరం తీసుకుని పెట్టుకున్న కొబ్బరి పాలను ఈ మిశ్రమంలో వేసుకోవాలి. పాలు మరిగిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుని ఉప్పు సరి చూసుకోవాలి. స్టౌ మంట స్విమ్ లో పెట్టుకుని పాన్ మీద మూత పెట్టి..రైస్ ఉడికించాలి. 20 నిమిషాల తర్వాత బిర్యానీ రెడీ.. కట్ చేసిన కొత్తిమీర, వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసి అలంకరించండి. అంతే టేస్టీ టేస్టీ పుట్టగొడుగు జీడిపప్పు బిర్యానీ రెడీ. ఈ బిర్యానీని రైతాతో వడ్డించండి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..