AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. జస్ట్ 5 నిమిషాల్లోనే స్పెషల్ స్నాక్స్.. సింపుల్ రెసిపీ ఇదిగో

వామాకు బజ్జీ రుచికరమైన స్నాక్. వాము ఆకులతో తయారుచేసే ఈ బజ్జీలు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. శనగపిండి, సుగంధ ద్రవ్యాలతో కలిపి, గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించాలి. ఇంట్లో సులభంగా పెంచుకోగల ఈ వామాకులతో ఎప్పుడంటే అప్పుడు వేడివేడి బజ్జీలను సిద్ధం చేసుకోవచ్చు.

రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. జస్ట్ 5 నిమిషాల్లోనే స్పెషల్ స్నాక్స్.. సింపుల్ రెసిపీ ఇదిగో
Easy Ajwain Leaves Bajji
Shaik Madar Saheb
|

Updated on: Apr 19, 2026 | 6:28 PM

Share

వాము ఆకుల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి. వాము ఆకులు (Ajwain Leaves) విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లకు నిలయం. విటమిన్ ఎ, బీ, సీ, ఇ తోపాటు.. కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం.. పుష్కలంగా ఉన్నాయి.. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు, అమినో ఆమ్లాలు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు కూడా ఉన్నాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడం, జలుబు, దగ్గును తగ్గించడం, రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి.. వాము ఆకులతో ఎన్నో వంటలను తయారు చేస్తారు.. అయితే.. వాము ఆకు బజ్జీ అనేది భారతీయుల సాంప్రదాయ స్నాక్ వంటకాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందింది. వాము ఆకులను ఉపయోగించి తయారుచేసే ఈ బజ్జీలు కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తాయి. ఈ వంటకాన్ని ఇంట్లో సులభంగా, తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. వాము ఆకులను ఇంట్లో కుండీల్లో లేదా పెరట్లో పెంచుకోవడం చాలా సులభం. ఒక చిన్న కొమ్మ నాటితే గుబురుగా పెరుగుతుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు తాజా ఆకులను సేకరించవచ్చు.

అవసరమైన పదార్థాలు:

1. వాము ఆకులు

2. శనగపిండి – 1 కప్పు లేదా అవసరం అయినంత..

3. ఉప్పు – 1/4 టీ స్పూన్ (రుచికి సరిపడినంత)

4. పసుపు పొడి – చిటికెడు

5. కారం – 1/2 టీ స్పూన్ (రుచికి సరిపడినంత)

6. అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1/4 టీ స్పూన్

7. వంట సోడా (కుకింగ్ సోడా) – చిటికెడు

8. డీప్ ఫ్రై కోసం నూనె

తయారీ విధానం:

ముందుగా, ఒక గిన్నెలో శనగపిండిని తీసుకోవాలి. ఆ తర్వాత దీనిలో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. వాము ఆకులలో సహజంగానే వాము ఫ్లేవర్ ఉండడం వలన అదనంగా వాము గింజలను కలపాల్సిన అవసరం లేదు. పొడి పదార్థాలన్నీ బాగా కలిసిన తర్వాత, కొద్దికొద్దిగా నీటిని కలుపుతూ ఉండలు లేకుండా సెమీ-థిక్ బ్యాటర్‌ను తయారుచేసుకోవాలి. పిండి మరీ పల్చగా లేదా మరీ గట్టిగా ఉండకూడదు. ఆకులను చక్కగా కోట్ చేసే కన్సిస్టెన్సీకి రావాలి. ఒకవేళ పిండి పల్చగా అయితే కొంచెం శనగపిండిని, గట్టిగా అయితే కొంచెం నీటిని కలిపి సర్దుకోవచ్చు.

ఇప్పుడు, బజ్జీలను వేయించడానికి సరిపడా నూనెను ఒక కడాయిలో వేసి బాగా వేడి చేయాలి. నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు, మంటను మధ్యస్థ స్థాయికి తగ్గించాలి. నూనె తగినంత వేడిగా లేకపోతే బజ్జీలు అడుగున అంటుకుపోయే అవకాశం ఉంది. నూనె వేడిగా ఉందో లేదో తెలుసుకోవడానికి చిన్న చుక్క పిండి వేసి అది వెంటనే పైకి తేలితే నూనె సరైన ఉష్ణోగ్రతలో ఉన్నట్టు.

తరువాత, ఒక్కొక్క వాము ఆకును సిద్ధం చేసుకున్న పిండిలో ముంచి, పిండి ఆకును అన్ని వైపుల నుండి సమానంగా కప్పేలా చూసుకోవాలి. పిండిలో ముంచిన ఆకులను జాగ్రత్తగా వేడి నూనెలో వేయాలి. కడాయిలో ఎక్కువ బజ్జీలు ఒకేసారి వేయకుండా, వాటికి సరిపడా ఖాళీ ఉండేలా చూసుకోవాలి. చిన్న కడాయి అయితే 3 లేదా 4 బజ్జీలు మాత్రమే పడతాయి. ఆకులు పెద్దవైతే 2 లేదా 3 మాత్రమే సరిపోతాయి.

బజ్జీలను మధ్యస్థ మంటపై గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేవరకు, అప్పుడప్పుడు తిప్పుతూ వేయించాలి. అవి బాగా వేగిన తర్వాత, నూనె నుంచి తీసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్‌లోకి మార్చుకోవాలి, అదనపు నూనెను పీల్చుకోవడానికి ఇది సహాయపడుతుంది.

వాము ఆకు బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి.. వాము ఆకులో ఉండే ఔషధ గుణాల వల్ల జీర్ణశక్తికి కూడా మంచిది. వీటిని సాదాగా తినవచ్చు లేదా కారప్పొడి, చట్నీలతో కూడా ఆస్వాదించవచ్చు. ప్రత్యేకించి చలికాలంలో వేడివేడిగా ఈ బజ్జీలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇంట్లో సులభంగా పెంచుకోగల ఈ మొక్కతో ఎప్పుడు కావాలంటే అప్పుడు తాజా స్నాక్‌ను సిద్ధం చేసుకోవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us