భార్యలూ బీ కేర్‌ఫుల్.! భర్తల్లో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలెర్ట్ అవ్వాల్సిందే..

Ravi Kiran

19 April 2026

భర్త ప్రవర్తనలో వచ్చే కొన్ని మార్పుల వెనుక అసలు కారణాలను ఎలా గుర్తించాలో.. వాటిని ఎలా ఎదుర్కోవాలో సైకాలజిస్ట్ వివరించారు. భర్త పరాయి స్త్రీ పట్ల ఆకర్షితుడైనప్పుడు ప్రాథమికంగా ఫోన్ వినియోగంలో విపరీతమైన మార్పులు కనిపిస్తాయి.

ఫోన్ వస్తే పక్కకు వెళ్లి మాట్లాడటం, భార్య రాగానే కాల్ కట్ చేయడం లేదా ఫోన్ లోపల దాచిపెట్టడం వంటివి గమనించవచ్చు. అలాగే ఫోన్‌కు కొత్త లాక్‌లు వేయడం, గంటల తరబడి చాటింగ్ చేయడం వంటివి అనుమానాలను బలపరుస్తాయి.

గతంలో సమయానికి ఇంటికి వచ్చే వ్యక్తి, ప్రస్తుతం ఆఫీసు పని అని లేదా ఇతర కారణాలు చెప్పి ఆలస్యంగా రావడం, బయట భోజనాలు చేయడం వంటివి కూడా ఒక సంకేతంగా భావించవచ్చు.

కొంతమంది భర్తలు తమలోని తప్పును దాచడానికి భార్యపై అకస్మాత్తుగా ఎక్కువ ప్రేమను, శ్రద్ధను చూపిస్తుంటారు. ఇదివరకు పట్టించుకోని విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపడం ద్వారా భార్యకు అనుమానం రాకుండా జాగ్రత్త పడతారు.

దీనితో పాటు తన బాహ్య రూపాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించడం, అంటే కొత్త దుస్తులు, ఫిట్‌నెస్, జుట్టు, అలంకరణపై మునుపెన్నడూ లేని విధంగా శ్రద్ధ పెట్టడం కూడా మరొక ముఖ్యమైన మార్పు. ఆర్థికంగా కూడా ఇంటి అవసరాలకు కాకుండా బయట ఖర్చులు పెరగడం గమనించవచ్చు.

 ముఖ్యంగా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు లేదా డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళినప్పుడు దంపతుల మధ్య దూరం పెరుగుతుంది. ఈ సమయం కొందరు పురుషులు తప్పుదారి పట్టడానికి అవకాశంగా మారవచ్చు.

అయితే, ఈ సంకేతాలు కనిపించిన వెంటనే భర్తను నేరుగా నిందించడం లేదా గొడవ పడటం సరైన పరిష్కారం కాదని హెచ్చరించారు. భర్త అహం దెబ్బతినకుండా, అతను మారే అవకాశం ఇచ్చేలా సామరస్యంగా వ్యవహరించాలి.

నేరుగా నిలదీయడం వల్ల అతను మరింత మొండిగా మారే ప్రమాదం ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నిపుణులైన సైకాలజిస్టులను సంప్రదించి కౌన్సిలింగ్ తీసుకోవడం ఉత్తమం. సరైన మార్గదర్శకత్వం ద్వారా దంపతుల మధ్య ఉన్న మనస్పర్థలను తొలగించి, మళ్ళీ ఆ బంధాన్ని చిగురింపజేయవచ్చు.