Child care: పిల్లల ఆహారంలో ఈ పొరపాట్లు చేస్తున్నారా?.. అయితే ఊబకాయం సమస్యలు తప్పవు..
Parenting tips: తల్లిదండ్రులు తమ పిల్లలను శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. ఇందులో భాగంగా పిల్లలకు మంచి పోషకాహారం అందిస్తారు.
Parenting tips: తల్లిదండ్రులు తమ పిల్లలను శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. ఇందులో భాగంగా పిల్లలకు మంచి పోషకాహారం అందిస్తారు. పండ్లు, డ్రై ఫ్రూట్స్ తదితర ఆహార పదార్థాలను పిల్లలకు అందజేస్తుంటారు. అయితే కొన్ని సార్లు తెలిసో తెలియక పిల్లల ఆహారం విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఇది పిల్లల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపతుంది. ముఖ్యంగా ఊబకాయం లాంటి సమస్యలు వేధించే ప్రమాదం ఉంది. అందుకే పిల్లల ఆహారం విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయద్దంటున్నారు నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందాం రండి.
పండ్ల రసాలకు బదులుగా…
చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు వివిధ రకాల పండ్ల జ్యూస్‌లు ఇస్తుంటారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం మోతాదుకు మించి పండ్ల జ్యూస్‌లను అందిస్తే పిల్లలు బరువు పెరుగుతారట. ఇందుకు బదులుగా సరైన సమయంలో సరైన పరిమాణంలో పండ్లు కట్ చేసి తినిపిస్తే మంచిది. మరికొందరు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ప్యాక్డ్ జ్యూస్‌లు ఇస్తుంటారు. ఈ జ్యూస్ ప్యాకెట్లలో చక్కెర మోతాదుకు మించి ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా పిల్లలు బరువు పెరుగుతుంటారు. అందుకే ప్యాక్ట్ జ్యూస్‌లను కూడా పిల్లలకు దూరంగా పెట్టాలని సూచిస్తారు నిపుణులు.
ఆలివ్ నూనె వద్దు..
ఇంట్లో ఆహారాన్ని తయారు చేయడానికి పలు రకాల నూనెలను ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఆలివ్ ఆయిల్‌తో ఆహారాన్ని వండడం బాగా ట్రెండ్ అయింది. చాలామంది తల్లిదండ్రులు ఆలివ్ ఆయిల్ తో తయారుచసిన ఆహారాన్ని పిల్లలకు ఇవ్వడం ద్వారా వారు ఆరోగ్యంగా ఉంచవచ్చని తల్లిదండ్రులు భావిస్తున్నారు. అయితే ఈ నూనెను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు కేలరీలు వచ్చి చేరతాయి. ఫలితంగా పిల్లలు బరువు పెరుగుతారు. అందుకు పిల్లల ఆహారంలో ఆలివ్ నూనె బదులు ఆవాల నూనెను వాడొచ్చు.
ఆ అలవాట్లను దూరం చేయండి..
తల్లిదండ్రులు తమ పిల్లవాడిని ఆరోగ్యంగా ఉంచడానికి ఆహారంతో పాటు స్నాక్స్‌లంటూ ఏదో ఒకటి నిత్యం వారికి తినిపిస్తుంటారు. అయితే ఈ రోటీన్ అలవాట్ల వల్ల పిల్లలు అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అదనపు ఆహారాన్ని తినిపించడం ద్వారా పిల్లల శరీరంలో అదనపు కేలరీలు చేరతాయని, ఇది ఊబకాయానికి కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా ఆహారం తీసుకోవడం, అతిగా తినడం వల్ల కూడా పిల్లలకు జీర్ణసంబంధ సమస్యలు తలెత్తుతాయంటున్నారు. వీటికి బదులు తేలికైన స్నాక్స్‌ను పిల్లలకు ఇవ్వడం మేలు.
Also Read:Lalu Prasad Yadav: అస్వస్థతకు గురైన ఆర్జేడీ అధినేత లాలూ.. ఆస్పత్రిలో చికిత్స..
Ottawa: కెనడా రాజధాని ఒట్టావాలో ఆందోళనలు ఉధృతం.. నిరసనకారులపై లాఠీచార్జ్..