AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Masala Oats Uttapam: డయాబెటిక్ రోగులకు ఆరోగ్యకరమైన ఎంపిక.. మసాలా ఓట్స్ ఊతప్పం.. రెసిపీ ఏమిటంటే..

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన పోషకాహారం ఓట్స్. ఈ ఓట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో ఫైబర్‌, ప్రోటీన్, విటమిన్లు, మెగ్నిషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలతో పాటు ఎన్నో పోషకాలు ఉంటాయి. ఓట్స్ తినడం ఇష్టమైన వారు దీనితో రకరకాల ఆహారపదార్ధాలను తయారు చేసుకోవచ్చు. ఈ రోజు సాంప్రదాయ రుచికి ఆరోగ్యకరమైన అదనపు రుచిని జోడించే అల్పాహారం మసాలా ఓట్స్ ఉత్తపం తయారీ గురించి తెలుసుకుందాం..

Masala Oats Uttapam: డయాబెటిక్ రోగులకు ఆరోగ్యకరమైన ఎంపిక.. మసాలా ఓట్స్ ఊతప్పం.. రెసిపీ ఏమిటంటే..
Masala Oats Uttapam
Surya Kala
|

Updated on: Jun 24, 2025 | 8:03 PM

Share

ఆరోగ్యకరమైన ఆహారం ట్రెండ్ అవుతున్న నేటి కాలంలో.. రుచి విషయంలో ఎవరూ రాజీ పడడానికి ఇష్టపడరు. అటువంటి పరిస్థితిలో.. మీరు రుచికరమైన , ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవాలని భావిస్తే.. ఓట్స్ తో ట్రై చేయండి. అది ఎలా ఉంటుంది? మసాలా ఓట్స్ ఉత్తపం అటువంటి ఫ్యూజన్ వంటకం. ఇది పోషకాలతో నిండి ఉండటమే కాదు ఉదయం అల్పాహారం లేదా సాయంత్రం స్నాక్ సమయానికి కూడా సరైనది. దీనిని పెద్దలు మాత్రమే కాదు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారు కూడా తినడానికి ఇష్టపడే వంటకం. ఈ రోజు సులభమైన అల్పాహారమైన మసాలా ఓట్స్ ఊతప్పం రెసిపీ గురించి తెలుసుకుందాం.

మసాలా ఓట్స్ ఊతప్పంకి కావలసిన పదార్థాలు

  1. ఓట్స్ – 1 కప్పు( మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి)
  2. సెమోలినా(సుజీ రవ్వ) – అర కప్పు
  3. పెరుగు – అర కప్పు
  4. నీరు – అవసరమైనంత
  5. ఇవి కూడా చదవండి
  6. ఉప్పు – రుచి సరిపడా
  7. ఈనో లేదా బేకింగ్ సోడా – 1/2 టీస్పూన్
  8. ఉల్లిపాయ – 1 సన్నగా తరిగినది
  9. టమోటా – 1 సన్నగా తరిగినది
  10. పచ్చిమిర్చి – 1 సన్నగా తరిగినది
  11. కాప్సికమ్ – అర కప్పు సన్నగా తరిగినది
  12. కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు
  13. చాట్ మసాలా – రుచికి తగినంత
  14. నూనె – వేయించడానికి సరిపడా

మసాలా ఓట్స్ ఉత్తపం తయారీ విధానం:

  1. ఒక గిన్నెలో ఓట్స్ పొడి, సెమోలినా, పెరుగుని వేసి బాగా కలపండి. కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ చిక్కటి పిండిని సిద్ధం చేయండి. ఈ మిశ్రమంపై మూత పెట్టి ఒక పక్కకు పెట్టండి.
  2. సుమారు 15 నుంచి 20 నిముషాలు మూత పెట్టి పక్కకు పెడితే పిండి ఉబ్బుతుంది.
  3. ఈలోగా ఉల్లిపాయ, టమోటా, క్యాప్సికమ్, పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి. మీకు కావాలనుకుంటే క్యారెట్ లేదా ఉడికించిన మొక్కజొన్న గింజలను కూడా జోడించవచ్చు.
  4. ఇప్పుడు ఓట్స్ మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పు కలిపి, ఈనో లేదా బేకింగ్ సోడా వేయండి. ఈనో కలిపిన వెంటనే పిండి ఉబ్బుతుంది..
  5. వెంటనే స్టవ్ మీద పాన్ పెట్టి పాన్ వేడి చేసి.. దానిపై కొంచెం నూనె వేయండి. ఇప్పుడు ఒక చెంచాతో పిండిని గుండ్రంగా వేసి.. ఆ పిండిపై తరిగిన కూరగాయలను వేసి ఆపై కొంచెం చాట్ మసాలా చల్లుకోండి.
  6. పాన్ కి మూతపెట్టి మీడియం మంట మీద 2-3 నిమిషాలు ఉడికించి.. ఆపై దోశను తిప్పి రెండు వైపులా బంగారు రంగులోకి మారే వరకు కాల్చండి.
  7. అంతే మసాలా ఓట్స్ ఉత్తప్పం రెడీ. దీనిని కొబ్బరి చట్నీ, కొత్తిమీర చట్నీ లేదా టమోటా సాస్ తో వేడి వేడిగా వడ్డించండి. ఈ టిఫిన్ పిల్లల టిఫిన్, డైట్ పాటించే వ్యక్తులు లేదా డయాబెటిక్ రోగులకు కూడా ఆరోగ్యకరమైన ఎంపిక.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. మెట్రో రైళ్లకు లగ్జరీ కోచ్‌లు.. లగ్జరీ క్యాబ్‌లు!
గుడ్‌న్యూస్‌.. మెట్రో రైళ్లకు లగ్జరీ కోచ్‌లు.. లగ్జరీ క్యాబ్‌లు!
కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్..!
కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్..!
నువ్వు జీవితంలో గెలవాలంటే ఈ 3 విషయాలు ఎవరికీ చెప్పకు..
నువ్వు జీవితంలో గెలవాలంటే ఈ 3 విషయాలు ఎవరికీ చెప్పకు..
ఈ సినిమాకు నేను ఎమోషనల్ అటాచ్ అయ్యాను..
ఈ సినిమాకు నేను ఎమోషనల్ అటాచ్ అయ్యాను..
రోటీ, చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్.. ఆలూ బెండీ ఇలా చేయండి
రోటీ, చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్.. ఆలూ బెండీ ఇలా చేయండి
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..