AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GMOs: జన్యు మార్పిడి గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..

Myths vs Reality of GMOs: జన్యు రూపాంతర మొక్కలతో కొత్త వంగడాలను సృష్టించేందుకు వేలాది సంవత్సరాలుగా సహజమైన క్రాస్ బ్రీడింగ్ పద్దతిని అనుసరిస్తున్నారు. అలాంటి జాతికే చెందిన అరటి, గోధుమ, మొక్కజొన్న లాంటి పంటల్లో

GMOs: జన్యు మార్పిడి గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు..
Gmos
Shaik Madar Saheb
|

Updated on: Feb 27, 2022 | 11:57 AM

Share

Myths vs Reality of GMOs: జన్యు రూపాంతర మొక్కలతో కొత్త వంగడాలను సృష్టించేందుకు వేలాది సంవత్సరాలుగా సహజమైన క్రాస్ బ్రీడింగ్ పద్దతిని అనుసరిస్తున్నారు. అలాంటి జాతికే చెందిన అరటి, గోధుమ, మొక్కజొన్న లాంటి పంటల్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. అరటిపండ్లు విత్తనాలతో నిండి ఉంటున్నాయి. గోధుమలు సరైన పరిమాణంలో కంకుల్లో కనిపించడం లేదు. మొక్కజొన్న తినకూడని పదార్థంగా మారింది.. అనే విషయాలు పలు అధ్యయనాల్లో తేలాయి. అయితే.. ప్రాచీన కాలంలోని రైతులు ప్రపంచంలో మొట్టమొదటి మొక్కల జన్యు మార్పిడి శాస్త్రవేత్తలుగా నిలిచారు.

రైతులు అనుసరించింది సంప్రదాయ క్రాస్ బ్రీడింగ్ అని మనందరికీ తెలుసు. అయితే అప్పట్లో ఫలితాలు ఆశించినంత మేర లేకపోవడంతో ఈ ప్రక్రియ అసంపూర్తిగా జరిగింది. ఈ సహజమైన ప్రక్రియ జన్యుపరమైన మార్పునకు సంబంధించినది కాదు. ఇదంతా ప్రయోగశాలలో అధిక శాతం విజయవంతం అయ్యేలా శాస్త్రీయంగా చేసే కచ్చితమైన ప్రక్రియ. జన్యుపరంగా మార్పు చెందిన జీవి (GMO) అనేది ఒక జంతువు, మొక్క లేదా సూక్ష్మజీవి. వీటి DNAకు ఉపయోగకరమైన లక్షణాలను జోడించడానికి సవరిస్తారు. ఒక జాతీ డీఎన్ఏ‌ను మరో జాతిలో ప్రవేశపెడతారు. మొక్కలలో ఇలా చేస్తే.. వాటిని జన్యు రూపాంతర మొక్కలుగా పేర్కొంటారు.

ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే.. పురాతన కాలం నుంచి వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడంలో జన్యుపరమైన అభివృద్ధి ప్రధాన కేంద్రంగా కొనసాగుతూ వస్తోంది. మొక్కల జన్యు మార్పిడి వల్ల పంటల మనుగడ రేటు మరింత మెరుగుపడుతుంది. దీనికోసం శాస్త్రవేత్తలు పలు మార్గాలను కనుగొన్నారు. ఉదాహరణకు.. మట్టి బాక్టీరియా DNA ద్వారా గొంగళి పురుగులకు విషపూరితం.. కానీ మానవులకు విషపూరితమయ్యే ప్రోటీన్, వాటి తెగుళ్లను నిరోధించడానికి దీనిని మొక్కజొన్న విత్తనాలకు జోడించారు. ఇది రసాయన పురుగుమందుల వాడకాన్ని తగ్గించడంతోపాటు పంట మనుగడను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా హెక్టారుకు సగటు దిగుబడిని అందిస్తుంది.

సాధారణంగా మొక్కల అంటుకట్టుట అనేది కూడా జన్యు మార్పిడి ప్రక్రియ. అయితే.. జన్యు పరమైన మార్పు అనేది కేవలం పంట మనుగడ దశలో మాత్రమే జోక్యం చేసుకుంటుంది. అయితే.. ఆహారం, మానవుల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం లేదు. కొన్ని సందర్భాల్లో.. ఇది పోషకాలను అందించడంతోపాటు ఆహారం రుచిని కూడా పెంచుతుంది. ఉదాహరణకు కొన్ని జన్యు మార్పిడి (GMO) సోయాబీన్ నూనెలు సాంప్రదాయ నూనెల కంటే ఆరోగ్యకరమైనవిగా తేలింది.

అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ప్రకృతిలో ఇప్పటికే అందుబాటులో ఉన్న లక్షణాలకు అనుగుణంగా జన్యు మార్పిడి జరుగుతుంది. జన్యు మార్పిడి (GM) పంటలు ప్రపంచంలో అత్యధికంగా పరీక్షించిన పంటలలో ఒకటిగా పరిగణిస్తారు. వాస్తవానికి ఇవి సాంప్రదాయ పంటల కంటే మెరుగైనవి. అయితే.. ఆహార పరిశ్రమ తమ ఉత్పత్తుల ఆమోదం పొందే ముందు తమ అంచనాలకు లోబడి జన్యు మార్పిడి పంటలపై కఠినమైన భద్రతా పరీక్షలు చేపడుతుంది. ఆ తర్వాత వ్యవసాయం, మానవ వినియోగం కోసం ఉత్పత్తులను విడుదల చేస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ఆహార డిమాండ్‌తో.. వ్యవసాయ ఉత్పత్తి 2050 నాటికి 70 శాతానికి విస్తరించాలి. అయితే.. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) అంచనా ప్రకారం.. ప్రతి ఏటా ప్రపంచంలోని దాదాపు 40 శాతం పంటలు తెగుళ్ల వల్ల నాశనం అవుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావంతో ఇది మరింత తీవ్రమయ్యే అవకాశం కూడా ఉంది. అయితే.. మొక్కల్లో జన్యు మార్పిడి అనేది అధిక వ్యవసాయ ఉత్పాదకతకు, ఆహార భద్రతను కల్పించడానికి, పంట వృధాను తగ్గించడానికి ప్రయోజనకరంగా మారనుంది. దీనివల్ల ఆహారోత్పత్తి ఖర్చులు కూడా తగ్గి.. ప్రజలకు మరింత అందుబాటులోకి వస్తాయి.

అధిక పంటల మనుగడ పర్యావరణానికి ప్రయోజనం చేకూరుస్తుంది. అంతేకాకుండా సాగు నీరు, రసాయన ఎరువులు వంటి వనరుల అవసరం కూడా తక్కువ అవుతుంది. దీంతో ఆహార కొరతను కూడా తీర్చవచ్చు. GMOలలో భవిష్యత్తు బయోమెడికల్ పరిశోధనలు.. మారుతున్న వాతావరణ పరిస్థితులు, కొత్త రకాల వ్యాధులు, వ్యాధికారక దాడుల ప్రభావాన్ని తట్టుకోగల పంట రకాలను ఆవిష్కరించగల సామర్థ్యాలను జోడించనున్నాయి.

ఇలాంటి సమయంలో భయపడకుండా.. వివేకంతో సైన్స్ పరంగా అభివృద్ధి చెందిన జన్యు మార్పిడి ఆహార పంటలపై నిర్ణయాలు తీసుకోవాలి. దీంతోపాటు జీవ సాంకేతిక (జెనోమిక్స్) రంగం అత్యంత సురక్షితమైనదని నిరూపించే సమయం కూడా ఆసన్నమైంది. జన్యు మార్పిడి భవిష్యత్తులో తగినంత ఆహారం సమకూర్చుకోవడంలో కీలక పాత్ర పోషించనుంది.

మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి.. 

(Sponsored Content)