రాఖీ స్పెషల్.. పాలు పంచదార లేని రవ్వ లడ్డుతో సోదరుడి నోరు తీపి చెయ్యండి.. రెసిపీ మీ కోసం

|

Aug 07, 2024 | 12:44 PM

వ్వ లడ్డు అంటే పంచదార తప్పని సరిగా ఉండాలని భావిస్తారు. దీంతో ఎంత ఇష్టమైన స్వీట్ అయినా సరే తినడానికి ఆలోచిస్తారు. పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే స్వీట్స్ లో రవ్వ లడ్డులు ఒకటి. వీటిని ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అయితే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు.. అయితే పంచదార వద్దు, నిల్వ ఉండాలని అనుకునేవారు రవ్వ లడ్డులను పాలు, పంచదార లేకుండా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ సమయంలోనే టేస్టీ టేస్టీ రవ్వలడ్డులను తయారు చేసుకోవడం ఈ రోజు తెలుసుకుందాం..

రాఖీ స్పెషల్.. పాలు పంచదార లేని రవ్వ లడ్డుతో సోదరుడి నోరు తీపి చెయ్యండి.. రెసిపీ మీ కోసం
Ravva Laddu
Follow us on

కొంత మందికి స్వీట్స్ అంటే బాగా ఇష్టం. ఏ మాత్రం సమయం దొరికినా ఇంట్లో దొరికే పదార్ధాలతో చకచకా రవ్వ లడ్డూలు తయారు చేస్తారు. అయితే పంచదారతో చేసిన స్వీట్స్ తింటే జలుబు, దగ్గు వంటి సమస్యలతో ఇబ్బంది పడతారు. ముఖ్యంగా పిల్లలు, పెద్దలకు పంచదారకు బదులుగా బెల్లం, పటిక బెల్లంతో చేసిన ఆహారాన్ని అందిస్తారు. అయితే రవ్వ లడ్డు అంటే పంచదార తప్పని సరిగా ఉండాలని భావిస్తారు. దీంతో ఎంత ఇష్టమైన స్వీట్ అయినా సరే తినడానికి ఆలోచిస్తారు. పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే స్వీట్స్ లో రవ్వ లడ్డులు ఒకటి. వీటిని ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అయితే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు.. అయితే పంచదార వద్దు, నిల్వ ఉండాలని అనుకునేవారు రవ్వ లడ్డులను పాలు, పంచదార లేకుండా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ సమయంలోనే టేస్టీ టేస్టీ రవ్వలడ్డులను తయారు చేసుకోవడం ఈ రోజు తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు

  1. సుజీ రవ్వ- ఒక కప్పు
  2. పటిక బెల్లం పొడి – ఒకటిన్నర కప్పు
  3. జీడి పప్పు
  4. కిస్ మిస్
  5. ఇవి కూడా చదవండి
  6. యాలకుల పొడి
  7. నెయ్యి- ఐదు స్పూన్లు
  8. పచ్చి కొబ్బరి తురుము – అరకప్పు
  9. నీరు – అర కప్పు
  10. పాల పొడి – రెండు స్పూన్లు

తయారీ విధానం: ముందుగా పటిక బెల్లం ముక్కలను మిక్సిలో వేసు గ్రైండ్ చేసి పొడిగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టకుని నెయ్యి వేసి వేడి ఎక్కిన తర్వాత జీడిపప్పు, కిస్ మిస్ లను వేసుకుని దోరగా వేయించుకుని వాటిని ఓ ప్లేట్ లో తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో రవ్వ వేసి వేయించుకోవాలి. కొంచెం రంగు మారిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించుకోవాలి. రెండు బాగా వేగే వరకూ వేయించుకుని .. చక్కగా గోల్డెన్ కలర్ లో కి వచ్చి మంచి వాసన వచ్చే వరకూ వేయించుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ, కొబ్బరిని పక్కకు పెట్టుకుని అందులో పటిక బెల్లం పొడిని వేసి అరకప్పు నీరు పోయాలి. బెల్లం పొడి నీరుతో కలిసి పాకం వచ్చిన తర్వాత అందులో రవ్వ, కొబ్బరి మిశ్రమాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత జీడిపప్పు, కిస్ మిస్ లు వేసి బాగా కలుపుకుని అందులో రెండు స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకుని బాగా కలిపి ఉండలు చుట్టుకోవాలి. అంతే పాలు, పంచదార లేకుండా రవ్వలడ్లు రెడీ.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..