AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: ఒకసారి ఉపయోగించిన నూనెను పడేస్తున్నారా.. ఇలా చేస్తే చాలా డబ్బు ఆదా..

Kitchen Hacks To Reuse Leftover Cooking Oil: పాన్‌లో పూరీ-పకోడీలను చేసుకున్న తర్వాత నూనె మిగిలిపోతుంది. ఇది మహిళలకు పెద్ద సమస్యగా మారుతుంది. ఎందుకంటే మిగిలిన నూనెను తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మిగిలిపోయిన నూనెను మళ్లీ ఉపయోగించడం ఆరోగ్యానికి చాలా హానికరం. అటువంటి పరిస్థితిలో ఏం చేస్తే ఆ నూనెను తిరిగి ఉపయోగించవచ్చు.

Kitchen Hacks: ఒకసారి ఉపయోగించిన నూనెను పడేస్తున్నారా.. ఇలా చేస్తే చాలా డబ్బు ఆదా..
Leftover Cooking Oil
Sanjay Kasula
|

Updated on: Aug 02, 2023 | 10:55 PM

Share

వర్షాకాలం ప్రారంభమైన వెంటనే, పకోడీలు, పూరీలు తినాలనే కోరిక కూడా కలుగుతుంది. ఎందుకంటే వాతావరణం అలా ఉంటుంది. అయితే పాన్‌లో పూరీ-పకోడీలను చేసుకున్న తర్వాత నూనె మిగిలిపోతుంది. ఇది మహిళలకు పెద్ద సమస్యగా మారుతుంది. ఎందుకంటే మిగిలిన నూనెను తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మిగిలిపోయిన నూనెను మళ్లీ ఉపయోగించడం ఆరోగ్యానికి చాలా హానికరం. అటువంటి పరిస్థితిలో ఏం చేస్తే ఆ నూనెను తిరిగి ఉపయోగించవచ్చు. ఆ స్మార్ట్ కిచెన్ హక్స్ ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం..

ఇలా వంటకు ఉపయోగించి మిగిలన నూనెను తిరిగి ఉపయోగించకుండా పడేస్తుంటాం. ఇలా చేయడం మనకు అస్సలు నచ్చదు. మిగిలిన నూనెను పారేసే బదులు ఇలా వాడండి.. తుప్పు సమస్యను దూరం చేసుకోండి . వర్షాకాలంలో డోర్ లాచెస్, లాచెస్ , తాళాలు తుప్పు పడుతుంటాయి. వర్షాకలంలో ఇలాంటి చాలా సమస్యలు వస్తుంటాయి. వాటిని తిరిగి పనిచేసేలా చేసేందుకు ఈ నూనెను ఉపయోగించవచ్చు. తలుపు నుంచి వచ్చే సౌండ్ కూడా తగ్గించుకచ్చు.

తోటపని కోసం –

మీరు తోటపని కోసం మిగిలిన నూనెను కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం, మిగిలిన నూనెను మొక్క దగ్గర ఒక గిన్నెలో ఉంచండి. దాని చుట్టూ చాలా కీటకాలు వస్తాయి. ఈ కీటకాలు చెట్టుకు కూడా చాలాసార్లు హాని చేస్తాయి. ఇలా చేయడం వల్ల క్రిములు నూనె గిన్నె దగ్గరికి వెళ్లవు.. చెట్టుకు హాని కలగదు.

మెరినేషన్ కోసం-

మీరు చికెన్, చేపలు లేదా వంట చేసేటప్పుడు ఏదైనా మెరినేట్ చేయడానికి మిగిలిపోయిన నూనెను ఉపయోగించవచ్చు. మెరినేషన్ కోసం నూనె వేడి చేయవలసిన అవసరం లేదు.

ఊరగాయ-

బాణలిలో మిగిలిన నూనెను ఊరగాయలో వేసి ఉపయోగించవచ్చు. దీని కోసం, మీరు ఈ నూనెను కారం, అల్లం, వెల్లుల్లి వంటి ఊరగాయలలో వేయవచ్చు.

ఇంట్లోకి కీటకాలు రాకుండా..

వర్షం పడిందంటే చాలు సాయంత్రం ఇంట్లోకి చిన్న దోమలు వస్తుంటాయి. వాటికి చెక్ పెట్టాలంటే ఓ కాగితం తీసుకుని దానికి ఆ నూనెను రాసి విండోల వద్ద కానీ.. లైట్ కింద కాని వేలాడ దీయండి.

లెదర్ ప్రిజర్వేటివ్..

ఉపయోగించిన వంట నూనెను మీ తోలు ఫర్నిచర్‌ను మృదువుగా చేయడానికి.. సంరక్షించడానికి కూడా ఉపయోగించవచ్చు. దీన్ని తోలుపై రుద్దండి.పొడిగా ఉండటానికి ఉపయోగించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం