Beetroot Smoothie Recipe: రోగ నిరోధక శక్తిని పెంచే బీట్ రూట్ స్మూతీ తయారీ విధానం..
Beetroot Smoothie Recipe: ఆరోగ్యాన్ని శక్తినిచ్చే దుంపల్లో బీట్‌రూట్‌ది స్పెషల్ ప్లేస్. ఇది కనులకు ఇంపుగా కనిపించడమే కాదు. ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా ఎంతో మంచిది. ముఖ్యంగా..
Beetroot Smoothie Recipe: ఆరోగ్యాన్ని శక్తినిచ్చే దుంపల్లో బీట్‌రూట్‌ది స్పెషల్ ప్లేస్. ఇది కనులకు ఇంపుగా కనిపించడమే కాదు. ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా ఎంతో మంచిది. ముఖ్యంగా రక్తహీనతతో బాధపడేవారు రోజూ తినే ఆహారంలో బీట్ రూట్ ని భాగంగా చేస్తుకుంటే మంచిది. ఈ బీట్ రూట్ ను గత రెండువేల సంవత్సరాలుగా కూరగా వాడుతున్నారు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో రోగనిరోధక శక్తిని అందరూ పెంచుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు బీట్ రూట్ స్మూతీని కూడా తినే ఆహార పదార్ధాల్లో చేర్చుకోవచ్చు. ఈరోజు బీట్ఉ రూట్ప స్మూతీని తయారు చేయాలి బీట్ రూట్ ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
కావల్సిన పదార్థాలు:
బీట్‌రూట్- 1 టమాటాలు – 2 నిమ్మకాయ – 1
తయారు చేసే విధానం: ముందుగా బీట్ రూట్ ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత టమాటని కూడా కడిగి.. విత్తనాలు లేకుండా చేసి.. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అనంతరం మిక్సీలో టమాటా, బీట్ రూట్ ముక్కలను మిక్సీలో వేసుకుని వాటర్ వేయకుండా స్మూతీలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాసులోకి తీసుకుని నిమ్మరసం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేస్తే స్మూతీ రెడీ. దీనిని రోజుకు రెండు సార్లు తీసుకుంటే ఇమ్మ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
ఆరోగ్య ప్రయోజనాలు:
ఈ బీట్‌రూట్ స్మూతీని తాగడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
బీట్‌రూట్‌లో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
హైబీపీ తగ్గుతుంది. బీట్‌రూట్‌లలో ఫైబర్, ఫోలేట్, మాంగనీస్, పొటాషియం, ఐరన్, విటమిన్ సి ఉంటాయి. అందువల్ల రక్త సరఫరా మెరుగు పడుతుంది.
బ్లడ్ లో హిమోగ్లోబిన్ స్థాయి కూడా పెరుగుతుంది.
నీరసంతో బాధపడేవారికి తక్షణ శక్తి వస్తుంది.
Also Read: Ap Weather Alert: ఏపీలో రాగాల మూడురోజులల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
Most Expensive Soap: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సబ్బు.. దీనిని ఎలా తయారు చేస్తారో తెలుసా