Most Expensive Soap: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సబ్బు.. దీనిని ఎలా తయారు చేస్తారో తెలుసా

Most Expensive Soap: చర్మ సౌందర్యం కోసం మీరు ఈ సబ్బులను వాడండి.. ఈ సబ్బువడితే మీ వయసు తెలియదు.. అంటూ రకరకాల యాడ్స్ ను మనం చూస్తూనే ఉంటాం.. అయితే ఈ సబ్బుల..

Most Expensive Soap: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సబ్బు.. దీనిని ఎలా తయారు చేస్తారో తెలుసా
Diamond Infused Soap
Follow us
Surya Kala

|

Updated on: Oct 01, 2021 | 2:16 PM

Most Expensive Soap: చర్మ సౌందర్యం కోసం మీరు ఈ సబ్బులను వాడండి.. ఈ సబ్బువడితే మీ వయసు తెలియదు.. అంటూ రకరకాల యాడ్స్ ను మనం చూస్తూనే ఉంటాం.. అయితే ఈ సబ్బుల ధరలు సామాన్యులకు అందుబాటు ధ్రలో వంద రూపాయల వరకూ ఉంటాయి.  అయితే  ఒక సబ్బు ఖరీదు వంద కాదు.. వేలు కాదు ఏకంగా లక్షల రూపాయలు.. మరి లక్షల రూపాయలు చేసే ఈ సబ్బు గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..

లెబనాన్‌లోని ట్రిపోలీలో ఒక చిన్న కుటుంబ ఇటువంటి సబ్బులు తయారు చేస్తున్నారు. ఈ ఖరీడైన సబ్బులను బదెర్ హసన్ అండ్ సన్స్ కుటుంబం తయారు చేస్తుంది. ఈ సబ్సులను ది ఖాన్ అల్ సాబూన్ పేరుతో విక్రయిస్తుంటారు.  ఈ సబ్బుల  వ్యాపార చరిత్ర 15 వ శతాబ్దానికి చెందింది. బాడర్ హాసెన్ అండ్ సన్స్  ఈ సబ్బులను చేతులతో తయారు చేస్తారు.  వీటిని నూనెలు, సహజ సువాసనలతో ఉంటాయి. ఈ రకాల లగ్జరీ సబ్బులు చర్మ సంరక్షణకు ఉపయోగిస్తారు. ఈ లగ్జరీ సబ్బులు UAE లోని కొన్ని ప్రత్యేకమైన దుకాణాలలో అమ్ముతారు. అయితే,  ఈ సబ్బులు ముఖ్యమైన వ్యక్తులకు  ఇతర ప్రత్యేక అతిథులకు మాత్రమే అందించబడతాయి. ఈ ఖరీదైన సబ్బులను 2013 లో మొదటిసారిగా తయారు చేశారు. దీనిని ఖతార్ ప్రథమ మహిళకు బహుమతిగా ఇచ్చారు. అత్యంత ఖరీదైన సబ్బు బార్ బంగారం మరియు డైమండ్ పౌడర్‌తో నింపబడి ఉంటుంది.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సబ్బు బార్ మొదట్లో చాలా ఖరీదైన జున్ను ముక్కలా ఉండేది, కానీ ఇప్పుడు అది మెరుగుపరచబడింది. ది ఖాన్ అల్ సాబూన్ కుటుంబానికి చెందిన వారు ఈ ఖరీదైన్ సోప్స్‌తో పాటు స్కిన్ కేర్ ఉత్పత్తులను కూడా తయారు చేస్తుంటారు. ఈ సబ్బు తయారీలో 17 గ్రాముల బంగారపు పౌడర్ వినియోగిస్తారు. ఈ సబ్బుల తయారీకి వజ్రాల పొడి, సేంద్రీయ తేనె, స్వచ్ఛమైన ఆలివ్ నూనె,  ఖర్జూరం మొదలైనవాటిని కూడా జోడిస్తారు.  బంగారపుపొడి, వజ్రాల పౌడర్ వాడినందునే ఈ సబ్బు ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన సబ్బుగా పేరొందింది. ఈ సబ్బు ధర 2.800 డాలర్లు. మన కరెన్సీలో 2 లక్షలకు పైగా ఉంటుంది. ఈ సబ్బు ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించడంతో పాటు, మానసిక ప్రశాంతత చేకూరుస్తుందని తయారీదారులు చెప్పారు.

Also Read: Ap Weather Alert: ఏపీలో రాగాల మూడురోజులల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం