Rice Pakoda: టీతో పర్ఫెక్ట్ స్నాక్స్.. మిగిలిపోయిన అన్నంతో అదిరిపోయే పకోడీ రెసిపీ..
చాలా ఇళ్లలో మిగిలిపోయిన అన్నం చెత్తబుట్టలో చేరుతుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో దీన్నే ఒక టేస్టీ వంటకంగా మార్చేవారు. క్రిస్పీ స్నాక్ గా మారుస్తుంది. అది వేడి టీ, చట్నీతో చాలా బాగా ఉంటుంది. దీనిని రైస్ పకోడీ అని పిలుస్తారు. రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ వంటకం వర్షాకాలంలో చాలామందికి ఇష్టం. పెద్దగా కుకింగ్ స్కిల్స్ అవసరం లేకుండానే వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు.

సాయంత్రం టీతో పాటుగా వేడి వేడి స్నాక్స్ ఏదైనా తినాలనిపిస్తోందా? ఎప్పుడూ బోరింగ్ గా బజ్జీలే కాకుండా ఇలా ఓసారి పకోడి చేసుకోండి. ఇందుకు శనగపిండి లాంటి పదార్థాలేమీ అవసరం లేదు. కేవలం ఇంట్లో మిగిలిపోయిన రైస్ ఉంటే చాలు. అప్పటికప్పుడు కమ్మనైనా రైస్ పకోడి చేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు
మిగిలిపోయిన అన్నం: 2 భాగాలు
రవ్వ (సూజీ): 1 భాగం
పెరుగు: 1 భాగం
నీళ్లు: కొద్దిగా
తరిగిన అల్లం: రుచికి సరిపడా
ఉల్లిపాయలు: చిన్నగా తరిగినవి
పచ్చిమిర్చి: చిన్నగా తరిగినవి
ఉప్పు: రుచికి సరిపడా
వేయించడానికి సరిపడా నూనె
తయారుచేసే విధానం
మొదట మిగిలిపోయిన అన్నం, రవ్వ, పెరుగు, కొద్దిగా నీళ్లు కలిపి మెత్తటి మిశ్రమంగా చేయండి.
ఈ మిశ్రమం మరీ గట్టిగా, మరీ పల్చగా లేకుండా చూసుకోండి.
ఇప్పుడు ఈ మిశ్రమానికి తరిగిన అల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు కలపండి.
మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చుట్టండి.
ఒక కడాయిలో నూనె వేడి చేయండి.
నూనె బాగా వేడి అయిన తర్వాత, ఆ ఉండలను వేసి ఎక్కువ మంట మీద వేయించండి.
రెండు నుండి మూడు నిమిషాలు వేయించిన తర్వాత అవి బంగారు రంగులోకి వస్తాయి.
అవి క్రిస్పీగా మారిన తర్వాత నూనెలోంచి తీసి సర్వ్ చేయండి.




