గ్యాస్, ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. బెస్ట్ వంటింటి టిప్స్ ఇవే!
ఈరోజుల్లో చాలా మంది గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. యువకుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే చాలా మంది ఎదర్కొనే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఈ వంటింటి చిట్కాలు పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.
Updated on: Sep 22, 2025 | 9:56 AM

మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువసేపు ఉపవాసం ఉండటం, బయట తినడం, జంక్ ఫుడ్ తినడం వల్ల నేడు చాలా మంది గ్యాస్ , ఎసిడిటీ సమస్య బారిన పడుతున్నారు. అయితే ఇది చాలా తీవ్రమైన సమస్య, అయితే గ్యాస్ ఎసిడిటీ సమస్యతో బాధపడే వారు ప్రతి సారీ మెడిసన్ తీసుకోకుండా కొన్ని వంటింటి చిట్కాలు ఫాలో అవ్వడం వలన ఈ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చునంట. అవి ఏవి అంటే?

గ్యాస్ ఎసిడిటీ సమస్య ఉన్నవారికి విపరీతమైన కడుపు నొప్పి, కడుపులో లేదా ఛాతిలో మంట, వికారం, నోటిలో పుల్లని నీరు, తేన్పులు రావడం,ఏం తిన్నా కడుపు నొప్పి, ఆకలి తగ్గడం, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట,మలబద్ధకం వంటి సమస్యలు అధికంగ ఉంటాయంట.

అయితే ఇలా గ్యాస్ ఎసిడిటీ సమస్యతో బాధపడే వారు కొన్నిరకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిదంటున్నారు నిపుణులు. పచ్చి, చల్లటి లేదా పచ్చిమిర్చీతో చేసిన ఆహారపదార్థాలను తీసుకోకూడదంట. అలాగే తిన్న తర్వాత తప్పకుండా వంద అడుగులు నడవాలి. వీలైతే భోజనం తర్వాత క్రమంగా మజ్జిగ తీసుకోవడం మంచిది. అలాగే మాంసాహారం, ఎక్కువ మసాలాలు ఉండే ఆహార పదార్థాలు అస్సలే తసుకోకూడదంట.

గ్యాస్ , ఎసిడిటీ సమస్యతో బాధపడే వారు రోజూ పడుకునే ముందు ఒక టీ స్పూన్ త్రిఫలపొడిని గోరు వెచ్చటి నీటిలో కలిపి తీసుకోవడం వలన కడుపు క్లియర్ అవ్వడమే కాకుండా శరీరం తేలికగా ఉంటుందంట. గ్యాస్, ఎసిడిటీ సమస్య కూడా తగ్గుతుందంట. అలాగే చిటికెడు ఇంగువ గోరు వెచ్చటి నీటిలో తీసుకోవడం వలన కూడా గ్యాస్ సమస్య తగ్గుతుందంట.

తాజా అల్లం ముక్కలను నీటిలో మరిగించి అల్లం టీ లేదా అల్లం నీరు తాగడం వలన కూడా జీర్ణక్రియ మెరుగు పడటమే కాకుండా కడుపు సంబంధ సమస్యల నుంచి త్వరగా బయటపడతారంట.



