Vellulli Karam Chicken Fry: వెల్లుల్లి కారంతో ఒక్కసారి చికెన్ ఫ్రై చేసి చూడండి.. సూపర్ అంతే!

| Edited By: Ravi Kiran

Sep 27, 2024 | 5:30 PM

చికెన్ అంటే చాలా మందికి ఇష్టం. చికెన్‌కి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. చికెన్ ఫ్రై పేరు వింటేనే నాన్ వెజ్ లవర్స్‌కి నోరు ఊరిపోవడం ఖాయం. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా.. చికెన్ వేపుడు, కర్రీ, బిర్యానీ చేయడం కంటే కొత్తగా వెల్లుల్లి కారంతో చికెన్ ఫ్రై చేసి చూడండి. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అంతే కాదు దీని రుచి కూడా కొత్తగా ఉంటుంది. వెల్లుల్లి కారం విడిగా తిన్నా.. చాలా రుచిగా ఉంటుంది. అలాంటిది చికెన్‌లో వేస్తే.. మరింత రుచిగా ఉంటుంది. ఇది చేసుకోవడం కూడా..

Vellulli Karam Chicken Fry: వెల్లుల్లి కారంతో ఒక్కసారి చికెన్ ఫ్రై చేసి చూడండి.. సూపర్ అంతే!
Vellulli Karam Chicken Fry
Follow us on

చికెన్ అంటే చాలా మందికి ఇష్టం. చికెన్‌కి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. చికెన్ ఫ్రై పేరు వింటేనే నాన్ వెజ్ లవర్స్‌కి నోరు ఊరిపోవడం ఖాయం. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా.. చికెన్ వేపుడు, కర్రీ, బిర్యానీ చేయడం కంటే కొత్తగా వెల్లుల్లి కారంతో చికెన్ ఫ్రై చేసి చూడండి. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. అంతే కాదు దీని రుచి కూడా కొత్తగా ఉంటుంది. వెల్లుల్లి కారం విడిగా తిన్నా.. చాలా రుచిగా ఉంటుంది. అలాంటిది చికెన్‌లో వేస్తే.. మరింత రుచిగా ఉంటుంది. ఇది చేసుకోవడం కూడా చాలా సులభం. మరి ఈ వెల్లుల్లి కారరం చికెన్ ఫ్రై ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదర్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

వెల్లుల్లి కారం చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు:

చికెన్, టమాటా, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర తరుగు, నిమ్మ రసం, ఆయిల్.

వెల్లుల్లి కారానికి కావాల్సిన పదార్థాలు:

యాలకులు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, కారం, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, దాల్చిన చెక్క.

ఇవి కూడా చదవండి

వెల్లుల్లి కారం చికెన్ ఫ్రై తయారీ విధానం:

ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా.. దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, మిరియాలు, ధనియాలు అన్నీ ఒకసారి వేయించాలి. చల్లారాక.. మిక్సీ జార్‌లో వేసుకోవాలి.. అందులోనే కారం, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు కూడా వేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి.. ఆయిల్ వేడి చేసుకోవాలి. పైన మూత పెట్టి కాసేపు ఉంచితే చికెన్‌లోని నీరంతా దిగిపోతుంది.

నీరంతా ఇంకిపోయాక.. ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఇదంతా చిన్న మంట మీద పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి. ఆ తర్వాత వెల్లుల్లి కారం పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చివర్లో కొత్తి మీర, కరివేపాకు వేసి అంతా ఒకసారి కలుపుకుని.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే వెల్లుల్లి కారం చికెన్ ఫ్రై సిద్ధం.