పండుగలు వచ్చినా.. ఇంట్లో ఎలాంటి ఫంక్షన్స్ జరిగినా మొదటగా చేసేది స్వీట్స్. స్వీట్లను శుభసూచికంగా భావిస్తారు. ఇలా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా చేసే స్వీట్ ఐటెమ్స్‌లో కజ్జికాయలు కూడా ఒకటి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. పెళ్లిల్లు, ఫంక్షన్స్‌కి ఎక్కువగా చేస్తారు. ఒకటి తినే సరికి కడుపు నిండిపోతుంది. తక్కువ సమయంలోనే రుచిగా చేసుకోవచ్చు. పెద్దగా సమయం కూడా పట్టదు. ఈ పండక్కి ఒక వేళ మీరు కజ్జికాయలు చేయాలి అనుకుంటే ఈ టిప్స్‌తో చేయండి. చాలా రుచిగా ఉంటాయి. మరి కజ్జికాయలకు కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకోండి.
గోధుమ పిండి, నెయ్యి, నూనె, ఉప్పు, కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్ తరుగు, బెల్లం లేదా పంచదార, యాలకుల పొడి.
కజ్జికాయలకు ముందు స్టఫింగ్ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ తీసుకుని అందులో నెయ్యి వేసి.. జీడిపప్పు, బాదం, వేరు శనగ పప్పులు వేసి వేయించి పక్కకు తీసుకోవాలి. వీటిని మిక్సీలో వేసి బరకగా చేసి పక్కకు తీసుకోండి. ఆ తర్వాత కొబ్బరి తురుము, బెల్లం, పొడి, యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఓ గిన్నె తీసుకుని అందులో కొద్దిగా గోధుమ పిండి, ఉప్పు, కొద్దిగా నెయ్యి, నీళ్లు వేసి చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న పిండిని ఓ పావు గంట సేపు పక్కన పెట్టండి. ఈ పిండిని చిన్న ముద్దలుగా చేసి.. చపాతీల్లా చేసుకోవాలి. ఇప్పుడు కజ్జికాయలు చేసే దానిలో అద్దుకున్న చపాతీని ఉంచి.. దాని మధ్యలో స్టఫింగ్ ఉంచి.. ప్రెస్ చేయాలి. అంతే ఇలా అన్నీ చేసుకోవాలి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి.. అందులో వేయించి తీసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే కజ్జికాయలు సిద్ధం.