Prawns Pepper Fry: ఇంట్లోనే ఈజీగా రొయ్యల పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే వదలరు!

|

Jun 08, 2024 | 7:16 PM

మాంసాహార ప్రియులకు ఇష్టమైన ఆహారాల్లో రొయ్యలు కూడా ఒకటి. రొయ్యలతో అనేక రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. ఎక్కువగా చాలా మంది రొయ్యల బిర్యానీ లేదంటే ఫ్రై చేసుకుంటారు. ఇవి కూడా రుచిగానే ఉంటాయి. కానీ ఇప్పుడు మీకు పరిచయం చేసే ఈ రెసిపీ మాత్రం ఒక్కసారి ఇంట్లో చేశారంటే.. ఎప్పుడూ ఇలానే చేయమని అందరూ అడుగుతారు. అదే రొయ్యల పెప్పర్ ఫ్రై. ఈ డిష్ రెస్టారెంట్లలో..

Prawns Pepper Fry: ఇంట్లోనే ఈజీగా రొయ్యల పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే వదలరు!
Prawns Pepper Fry
Follow us on

మాంసాహార ప్రియులకు ఇష్టమైన ఆహారాల్లో రొయ్యలు కూడా ఒకటి. రొయ్యలతో అనేక రకాల వంటలు తయారు చేసుకోవచ్చు. ఎక్కువగా చాలా మంది రొయ్యల బిర్యానీ లేదంటే ఫ్రై చేసుకుంటారు. ఇవి కూడా రుచిగానే ఉంటాయి. కానీ ఇప్పుడు మీకు పరిచయం చేసే ఈ రెసిపీ మాత్రం ఒక్కసారి ఇంట్లో చేశారంటే.. ఎప్పుడూ ఇలానే చేయమని అందరూ అడుగుతారు. అదే రొయ్యల పెప్పర్ ఫ్రై. ఈ డిష్ రెస్టారెంట్లలో చాలా ఫేమస్. మరి ఇంత రుచిగా ఉండే రొయ్యల పెప్పర్ ఫ్రైని ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రొయ్యల పెప్పర్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు:

రొయ్యలు, వెల్లుల్లి తరుగు, కారం, ఉప్పు, పసుపు, కరివేపాకు, కొత్తి మీర, మిరియాల పొడి, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, సోంపు, మిరియాలు, జీలకర్ర, అనాస పువ్వు, ఆయిల్.

రొయ్యల పెప్పర్ ఫ్రై తయారీ విధానం:

ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి.. సోంపు, మిరియాలు, జీలకర్ర, అనాస పువ్వు, కరివేపాకు కొద్దిగా వేసి వేయించాలి. ఇవి చల్లారాక.. మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింత పండు గుజ్జు ఒక బౌల్‌లోకి తీసుకుని.. ఇందులో పొడి చేసిన మసాలా పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఇందులో కొద్దిగా ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. ఆ తర్వాత కరివేపాకులు, వెల్లుల్లి తరుగు వేసి వేయించాక.. ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు వేసి బాగా కలపాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు చింత పండు గుజ్జు, ఉప్పు వేసి కలపాలి. ఇంత చిన్న మంట మీద ఓ పది నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత ఉప్పు వేసి రొయ్యల్ని, కారం, ఉప్పు, పసుపు కూడా వేసి వేయించాలి. ఇది కూడా సిమ్ మంట మీదే చేయాలి. మసాలా అంతా ముక్కలు బాగా పట్టిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసి ఓ ఐదు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే రొయ్యల ఫ్రై సిద్ధం.