ఇంట్లో ఎలాంటి స్పెషల్స్ అయినా స్వీట్స్ ముందుగా చేస్తూ ఉంటారు. వాటిల్లో గులాబ్ జామ్ కూడా ఉంటుంది. గులాబ్ జామ్ అంటే పిల్లలకు బాగా ఇష్టం. తియ్యగా ఉంటుంది కాబట్టి.. ఒకదాని తర్వాత మరొకటి లాగించేస్తారు. ఎప్పుడూ చేసే గులాబ్ జామూన్ కాకుండా.. ఈ సారి వెరైటీగా పన్నీర్‌తో చేయండి. చాలా రుచిగా ఉంటుంది. డిఫరెంట్ టేస్ట్ ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ డిష్ డ్రై చేయండి. పిల్లలు, పెద్దలు అందరూ ఇష్ట పడి మరీ ఈ స్వీట్ తింటారు. మరి ఈ పన్నీర్ గులాబ్ జామ్ ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూడండి.
పన్నీర్ తురుము, పాల పొడి, బాదం పాలు, రవ్వ, బేకింగ్ సోడా, గుడ్డు, ఆయిల్, పంచదార, యాలకుల పొడి.
ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో.. పన్నీర్ తురుము కప్పు, రవ్వ కొద్దిగా, పాల పొడి రెండు కప్పులు, చిటికెడు బేకింగ్ సోడా వేసి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొద్ది కొద్దిగా బాదం మిల్క్ వేస్తూ పిండి ముద్దలా ఉండేలా వేసుకోండి. ఆ తర్వాత గుడ్డు కూడా వేసి మిక్స్ చేయండి. మీరు పాల పొడి, రవ్వకు బదులు గులాబ్ జామ్ పౌడర్ కూడా ఉపయోగించవచ్చు. ఇవన్నీ మిక్స్ చేసి ఓ పది నిమిషాలు పక్కన పెట్టండి.
ఈ లోపు డీప్ ఫ్రైకి సరి పడా ఆయిల్ వేసి వేడి చేయండి. అలాగే పంచదార పాకన్ని కూడా తయారు చేసి పక్కన పెట్టాలి. పంచదార పాకంలోనే కలుపుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేయాలి. ఇవన్నీ ఆయిల్‌లో వేసి ఎర్రగా వేగేలా ఫ్రై చేయాలి. వేయించిన ఉండలను పంచదార పాకంలో వేసి అన్నీ కలిసేలా మిక్స్ చేయండి. కనీసం అరగంట సేపు అయినా ఉంచాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పన్నీర్ గులాబ్ జామ్ సిద్ధం.