Kothimeera Vadalu: వేడి వేడిగా కొత్తిమీర వడలు.. ఇలా చేశారంటే ప్లేట్ ఖాళీ..
కొత్తిమీరతో చేసే వంటల్లో వడలు కూడా ఒకటి. కొత్తిమీర వడలు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఈజీగా జీర్ణ సమస్యలు కూడా నయం అవుతాయి. ఈ రెసిపీని కూడా చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. వేడి వేడిగా తింటూ ఉంటే.. ఎన్ని తిన్ని ఇంకా తినాలనిపిస్తాయి..
కొత్తిమీర తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కొత్తిమీర తింటే పొట్ట, చర్మ, జుట్టు, ఇతర సమస్యలను తగ్గించుకోవచ్చు. ఏ కూర అయినా చివర్లో కొత్తిమీర వేస్తే వచ్చే రుచే వేరు. కొత్తిమీరతో ఎలాంటి వంటలు చేసినా చాలా రుచిగా ఉంటాయి. కొత్తిమీరలో అనేక పోషకాలు ఉంటాయి. ఇలా కొత్తిమీరతో చేసే వంటల్లో వడలు కూడా ఒకటి. కొత్తిమీర వడలు కూడా చాలా రుచిగా ఉంటాయి. ఈజీగా జీర్ణ సమస్యలు కూడా నయం అవుతాయి. ఈ రెసిపీని కూడా చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. వేడి వేడిగా తింటూ ఉంటే.. ఎన్ని తిన్ని ఇంకా తినాలనిపిస్తాయి. ఈ చలికాలంలో ఈ స్నాక్ బెస్ట్ అని చెప్పొచ్చు. మరి కొత్తిమీర వడలకు కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్తిమీర వడలకు కావాల్సిన పదార్థాలు:
కొత్తిమీర, ఉప్పు, అల్లం తరుగు, శనగ పిండి, బియ్యం పిండి, పచ్చి మిర్చి పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, చింత పండు గుజ్జు, జీలకర్ర, కారం, జీరా పొడి, ధనియా పొడి, నువ్వులు, బేకింగ్ సోడా, గరం మసాలా, ఆయిల్.
కొత్తిమీర వడలు తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలోకి శనగ పిండి, బియ్యం పిండి, కొత్తిమీర తరుగు వేసి అన్నీ కలపాలి. ఇందులోనే ఉప్పు, అల్లం తరుగు, పచ్చి మిర్చి పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, చింత పండు గుజ్జు, జీలకర్ర, కారం, జీరా పొడి, ధనియా పొడి, నువ్వులు, బేకింగ్ సోడా, గరం మసాలా అన్నీ రుచికి సరిపడగా వేసి వడలు వేసుకునేందుకు వీలుగా ఉండేలా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి.
ముందుగా కలిపి పెట్టిన మిశ్రమాన్ని వడల మాదిరిగా చేసి వేయాలి. అన్ని వైపులా ఎర్రగా వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఈ వడలను టమాటా సాస్, పుదీనా చట్నీ, ఇతర ఏ చట్నీలతో తిన్నా చాలా రుచిగా ఉంటాయి. వేడి వేడిగా తింటే ఒకదాని తర్వాత మరొకటి లాగించేస్తూ ఉంటారు. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కూడా ఓ సారి ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చుతాయి.