Guntur Vankaya Bajji: ఫేమస్ గుంటూరు వంకాయ బజ్జీ ఇలా చేస్తే.. ఆహా అంటారు!

| Edited By: Ravi Kiran

Sep 25, 2024 | 11:00 PM

గుంటూరు స్పెషల్ వంకాయ బజ్జీ చాలా ఫేమస్. పలు సినిమాల్లో కూడా దీని గురించి టాపిక్ వచ్చే ఉంటుంది. అలాగే ఇప్పుడు పలు ఫుడ్ వ్లాగ్స్‌లో కూడా గుంటూరు వంకాయ బజ్జీ గురించి చెబుతూనే ఉంటున్నారు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. దీన్ని మనం ఇంట్లో కూడా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ రెసిపీ చేయడం చాలా సులభం. మీ ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు ఒక్కసారి చేసి పెట్టండి.. ఖచ్చితంగా ఆహా అంటారు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇవి చేసుకుని ఎంజాయ్..

Guntur Vankaya Bajji: ఫేమస్ గుంటూరు వంకాయ బజ్జీ ఇలా చేస్తే.. ఆహా అంటారు!
Guntur Vankaya Bajji
Follow us on

గుంటూరు స్పెషల్ వంకాయ బజ్జీ చాలా ఫేమస్. పలు సినిమాల్లో కూడా దీని గురించి టాపిక్ వచ్చే ఉంటుంది. అలాగే ఇప్పుడు పలు ఫుడ్ వ్లాగ్స్‌లో కూడా గుంటూరు వంకాయ బజ్జీ గురించి చెబుతూనే ఉంటున్నారు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. దీన్ని మనం ఇంట్లో కూడా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ రెసిపీ చేయడం చాలా సులభం. మీ ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు ఒక్కసారి చేసి పెట్టండి.. ఖచ్చితంగా ఆహా అంటారు. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇవి చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ వంకాయ బజ్జీలను ఎలా తయారు చేసుకుంటారు? ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

గుంటూరు వంకాయ బజ్జీకి కావాల్సిన పదార్థాలు:

వంకాయలు, చనగ పిండి, పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఆయిల్, బియ్యం పిండి, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు, చింత పండు, కొత్తి మీర.

గుంటూరు వంకాయ బజ్జీ తయారీ విధానం:

వంకాయ బజ్జీ చేయడానికి ముందుగా మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని.. అందులో పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చి మిర్చి, కొద్దిగా చింత పండు, జీలకర్ర, పసుపు, ఉప్పు, కొత్తి మీర వేసి మిక్సీ పట్టుకుని.. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి.. స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలను శుభ్రంగా కడిగి.. వాటికి గాట్లు పెట్టి.. మిక్సీ పట్టిన మిశ్రమాన్ని స్టఫ్ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు మరో లోతు గిన్నె తీసుకుని అందులో చనగ పిండి, బియ్యం పిండి, ఉప్పు, జీలకర్ర, పసుపు, సరిపడా వేసి.. ఉండలు లేకుండా కలుపుకోవాలి. దోశ పిండిలా పిండిని కలుపుకోవాలి. నెక్ట్స్ వంకాయలను చనగ పిండి మిశ్రమంలో ముంచి.. కాగే నూనెలో వేసి మీడియం మంట మీద వేయించుకోవాలి. వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. కావాలంటే ఇందులో ఉల్లిపాయల నిమ్మ కాయ రసం పిండి సర్వ్ చేసుకోవచ్చు. అంతే ఎంతో టేస్టీ వంకాయ బజ్జీలు సిద్ధం. ఇంకెందుకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.