Gongura Prawns Pickle: గోంగూర రొయ్యల నిల్వ పచ్చడి.. ఇలా చేశారంటే ఆహా అదుర్స్..

రొయ్యలు అంటే చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. రొయ్యలతో కూరగాయలు కూడా కలిపి వండితే చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది రొయ్యలతో బిర్యానీ కూడా తయారు చేసుకుంటూ ఉంటారు. రొయ్యల్లో మంచి ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. అదే విధంగా గోంగూర తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్లు ఎ, సి, క్యాల్షియం వంటి పోషకాలు లభిస్తాయి. ఈ రెండింటి కాంబినేషన్ కర్రీ అయినా పచ్చడినా సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా మంది గోంగూర..

Gongura Prawns Pickle: గోంగూర రొయ్యల నిల్వ పచ్చడి.. ఇలా చేశారంటే ఆహా అదుర్స్..
Gongura Prawns Pickle
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 12, 2024 | 9:16 PM

రొయ్యలు అంటే చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. రొయ్యలతో కూరగాయలు కూడా కలిపి వండితే చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది రొయ్యలతో బిర్యానీ కూడా తయారు చేసుకుంటూ ఉంటారు. రొయ్యల్లో మంచి ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. అదే విధంగా గోంగూర తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్లు ఎ, సి, క్యాల్షియం వంటి పోషకాలు లభిస్తాయి. ఈ రెండింటి కాంబినేషన్ కర్రీ అయినా పచ్చడినా సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా మంది గోంగూర రొయ్యలు కర్రీ తినే ఉంటారు. కానీ గోంగూర రొయ్యల పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది. మరి ఈ గోంగూర రొయ్యలు పచ్చడి ఎలా తయారు చేస్తారు? ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

గోంగూర రొయ్యల పచ్చడికి కావాల్సిన పదార్థాలు:

రొయ్యలు, గోంగూర, ఎండు మిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, పసుపు, కొత్తిమీర.

గోంగూర రొయ్యల పచ్చడి తయారీ విధానం:

ముందుగా రొయ్యలను శుభ్రంగా కడగాలి. రొయ్యలు పెద్దవిగా ఉంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గోంగూర కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎండు మిర్చి ఆయిల్‌లో వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ నెక్ట్స్ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి చిటపటలాడాక వేయించాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గోంగూర, రొయ్యలు వేసి నీరంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి.

ఇవి కూడా చదవండి

నీరు పోయి.. ఆయిల్ పైకి తేలాక ఉప్పు, కారం, పసుపు కొద్దిగా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించిన ఎండు మిర్చి పొడిలా చేసి కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర వేసి మొత్తం కలుపుకోవాలి. అంతే గోంగూర రొయ్యల పచ్చడి సిద్ధం. ఇది చల్లారక డబ్బాల్లోకి తీసుకుని గాలి వెళ్లకుండా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిజ్‌లో కూడా పెట్టుకోవచ్చు. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.

హిట్టా.? ఫట్టా.? రజినీ అమితాబ్ ప్రయత్నం సక్సెస్ అయ్యిందా.?
హిట్టా.? ఫట్టా.? రజినీ అమితాబ్ ప్రయత్నం సక్సెస్ అయ్యిందా.?
ఐదేళ్ల వయస్సు నుంచి రహస్యంగా ఆ పని చేస్తున్న యువతి.! వీడియో..
ఐదేళ్ల వయస్సు నుంచి రహస్యంగా ఆ పని చేస్తున్న యువతి.! వీడియో..
మహిళల్లో ఈ సమస్యలు కనిపిస్తే జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి.!
మహిళల్లో ఈ సమస్యలు కనిపిస్తే జాగ్రత్త.. వెంటనే ఇలా చేయండి.!
మహిళలకు గుడ్ న్యూస్.! యూపీ సర్కార్ నుండి ఏపీ సర్కార్ వరకు ఫ్రీ..
మహిళలకు గుడ్ న్యూస్.! యూపీ సర్కార్ నుండి ఏపీ సర్కార్ వరకు ఫ్రీ..
ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌.. 20వేల మంది పైనే నివాసం.!
ప్రపంచంలోనే అతిపెద్ద అపార్ట్‌మెంట్‌.. 20వేల మంది పైనే నివాసం.!
ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత అసహనం.! రూ.కోటి నష్టంపై జస్ట్‌ ఆస్కింగ్..
ప్రకాశ్‌రాజ్‌పై నిర్మాత అసహనం.! రూ.కోటి నష్టంపై జస్ట్‌ ఆస్కింగ్..
ఒక్క లాటరీ టిక్కెట్‌తో రూ.25 కోట్లు.. ఇది కదా అదృష్టమంటే..!
ఒక్క లాటరీ టిక్కెట్‌తో రూ.25 కోట్లు.. ఇది కదా అదృష్టమంటే..!
అమ్మబాబోయ్.! ఈ విషపు ఈగలు కాలనాగు కంటే యమ డేంజర్..
అమ్మబాబోయ్.! ఈ విషపు ఈగలు కాలనాగు కంటే యమ డేంజర్..
రతన్‌ టాటాది లవ్‌ ఫెయిల్ ఆమెతోనేనా.? అందుకే పెళ్లి చేసుకోలేదా.?
రతన్‌ టాటాది లవ్‌ ఫెయిల్ ఆమెతోనేనా.? అందుకే పెళ్లి చేసుకోలేదా.?
అద్భుత సంజీవని మునగాకు.. ప్రత్యేకించి మగవాళ్ళకి స్పెషల్.!
అద్భుత సంజీవని మునగాకు.. ప్రత్యేకించి మగవాళ్ళకి స్పెషల్.!