Dhaba Style Egg Keema: ధాబా స్టైల్ ఎగ్ కీమా కర్రీ ఇలా చేస్తే.. చపాతీల్లోకి అదిరిపోతుంది..

| Edited By: Janardhan Veluru

Jul 25, 2024 | 7:05 PM

చాలా మందికి ధాబాలకు వెళ్లి తినే అలవాటు ఉంటుంది. అక్కడ టేస్ట్ కూడా రెస్టారెంట్‌లో లభించే టేస్ట్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకే చాలా ధాబాలో తినేందుకు ఇష్ట పడుతూ ఉంటారు. ఇలా ధాబాల్లో తయారు చేసే కర్రీల్లో ఎగ్ కీమా మసాలా కర్రీ కూడా ఒకటి. దీన్ని చపాతీ, రోటీ, పుల్కాల్లోకి తింటే.. ఖచ్చితంగా వావ్ అంటారు. అంత అద్భుతంగా ఉంటుంది. వీకెండ్స్‌లో, స్పెషల్ డేస్‌లో..

Dhaba Style Egg Keema: ధాబా స్టైల్ ఎగ్ కీమా కర్రీ ఇలా చేస్తే.. చపాతీల్లోకి అదిరిపోతుంది..
Dhaba Style Egg Kheema Curry
Follow us on

చాలా మందికి ధాబాలకు వెళ్లి తినే అలవాటు ఉంటుంది. అక్కడ టేస్ట్ కూడా రెస్టారెంట్‌లో లభించే టేస్ట్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది. అందుకే చాలా ధాబాలో తినేందుకు ఇష్ట పడుతూ ఉంటారు. ఇలా ధాబాల్లో తయారు చేసే కర్రీల్లో ఎగ్ కీమా మసాలా కర్రీ కూడా ఒకటి. దీన్ని చపాతీ, రోటీ, పుల్కాల్లోకి తింటే.. ఖచ్చితంగా వావ్ అంటారు. అంత అద్భుతంగా ఉంటుంది. వీకెండ్స్‌లో, స్పెషల్ డేస్‌లో ఇది తయారు చేసుకుని తినొచ్చు. పిల్లలకు, పెద్దలకు కూడా దీని రుచి నచ్చుతుంది. మరి ధాబా స్టైల్‌లో చేసే ఈ ఎగ్ కీమా మసాలా కర్రీ ఎలా తయారు చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ధాబా స్టైల్ ఎగ్ కీమా మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు:

ఎగ్స్, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చి మర్చి, ఆయిల్, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, బిర్యానీ ఆకులు, జీలకర్ర, ఉప్పు, ధనియాల పొడి, కారం, ఉప్పు, గరం మసాలా, కసూరి మేతి, బటర్, కొత్తి మీర, కరివేపాకు, ఎండు మిర్చి,

ధాబా స్టైల్ ఎగ్ కీమా మసాలా కర్రీ తయారీ విధానం:

ముందుగా కోడి గుడ్లను ఉడకబెట్టి.. తురిమి పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్, బటర్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఇవి వేడెక్కాక.. జీలకర్ర, ఎండు మిర్చి, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లి పాలయలు వేసి సగం వేగాక.. అల్లం, వెల్లుల్లి తరుగు కూడా వేసి వేయించు కోవాలి. ఆ తర్వా టమాటా ముక్కలు, ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. టమాటా ముక్కలు కాస్త మగ్గాక.. నీళ్లు పోసి మరింత మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి. తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా, కసూరి మేతి వేసి మరి ఆయిల్ పైకి తేలేంత వరకూ ఉడికించాలి.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత మరో కడాయి తీసుకుని.. అందులో బటర్ వేసుకోవాలి. బటర్ వేడెక్కాక.. ముందుగానే గుడ్లను తురిమి పెట్టుకోవాలి. దీన్ని కాస్ల వేయించుకోవాలి. ఆ తర్వాత పచ్చి మిర్చి కూడా వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని ఇప్పుడు కర్రీలో వేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలాక.. కొత్తి మీర, కరివేపాకు చల్లుకుని ఓసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కీమా మసాలా కర్రీ సిద్ధం. దీన్ని వేడి వేడిగా ఉన్నప్పుడే తినాలి. అప్పుడే టేస్ట్ బావుంటుంది.